Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rip real star srihari

ఈ సంచికలో >> సినిమా >>

ఆ పని చేయని నిండైన నటి

perfect actress

‘డర్టీపిక్చర్’ సినిమాకి ముందు.. ‘డర్టీపిక్చర్’ సినిమా తర్వాత.. అని చెప్పుకోవాలి విద్యాబాలన్ కి. ఆ సినిమాతో ఆమె రేంజ్ అంత పెరిగింది మరి. విద్యాబాలన్ అంటే ఇప్పుడు స్టార్. మామూలు స్టార్ కాదు, బాలీవుడ్ లో టాప్ హీరోస్ కి ధీటుగా ఆమె చుట్టూ తిరుగుతున్న నిర్మాతల సంఖ్య పెరిగింది.

స్వతహాగా బొద్దుగుమ్మ అయిన విద్యాబాలన్, నిండుదనమే స్త్రీకి అసలైన అందం అని చెబుతుంది ఎప్పుడు అడిగినా. చీరకట్టుకి కొత్త అందాన్ని తెచ్చిన విద్యాబాలన్, పార్టీ వేర్ అంటే ఖచ్చితంగా చీరకట్టుకే ప్రాధాన్యతనిస్తుంది. చీరకట్టులో నిండుగా కన్పించాలంటే బొద్దుగానే వుండాలన్నది విద్యాబాలన్ మాట.

డైటింగ్ గురించి ఆమె వద్ద ప్రస్తావిస్తే, అసలైన భారతీయత నిండైన దేహంలోనే వుంటుంది. ఇండియన్ ట్రెడిషన్ కి తగ్గట్టుగా వుండాలంటే నిండుగా కన్పించాల్సిందేననీ, అందుకే జీరోసైజ్ వంటి వాటి పట్ల తానెప్పుడూ దృష్టిపెట్టలేదనీ విద్యాబాలన్ చెప్పింది. పెళ్ళయ్యాక కూడా అదే ఫిజిక్ మెయిన్ టెయిన్ చేస్తున్న విద్యాబాలన్, తన ఫిజిక్ పెర్ఫెక్ట్ గా వుండడం వెనుక ‘డాన్స్’ కీలక పాత్ర పోషిస్తుందని వివరించింది.

మరిన్ని సినిమా కబుర్లు
ammo bapu gari bommo