Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
perfect actress

ఈ సంచికలో >> సినిమా >>

అమ్మో బాపుగారి బొమ్మో

ammo bapu gari bommo

కన్నడ భామ ప్రణీత దశ తిరిగింది ‘అత్తారింటికి దారేది’ సినిమాతో. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన ప్రణీత, ఆ సినిమా సక్సెస్ తో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. సినిమా అవకాశాలు అటుంచితే, వస్త్ర వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాలతో బిజీ అయిపోయింది ప్రణీత.

‘అత్తారింటికి దారేది’ సినిమాకి ముందు ప్రణీత రెమ్యునరేషన్ చాలా తక్కువ. అది కూడా పది లక్షల లోపే. అంత మొత్తానికి ఇప్పుడామె షోరూం ప్రారంభోత్సవాలు చేసేస్తోందని సినీ పరిశ్రమలో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. దసరా సీజన్ కావడంతో వరుసగా కొత్త వస్త్ర దుకాణాలు ప్రారంభమవుతున్నాయి.

వివిధ సంస్థలు పోటీ పడి మరీ ప్రణీతతో షోరూమ్స్ ని ఓపెన్ చేయిస్తున్నారు. అందాల తారలకు సినిమాలు సక్సెస్ అయితే డబుల్ సంపాదనే. ఒకటి సినిమా రెమ్యునరేషన్, ఇంకోటి సినిమాల కారణంగా వచ్చే ఇలాంటి అవకాశాల ద్వారా లభించే రెమ్యునరేషన్. ‘అమ్మో.. బాపుగారి బొమ్మో..’ అని పవన్ పాడితే, ఆమె చెబుతోన్న రెమ్యునరేషన్ కి సినిమా నిర్మాతలు, షోరూం నిర్వాహకులూ అదే
పాట పాడుకోవాల్సి వస్తోందిట.

మరిన్ని సినిమా కబుర్లు
Ladies Night at New Jersey