Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - రామయ్య వస్తావయ్యా

Movie Review - Ramayya Vasthavayya

చిత్రం: రామయ్యా వస్తావయ్యా
తారాగణం: ఎన్టీయార్, సమంత, శృతిహాసన్, ముఖేష్ రుషి, రవి శంకర్, రావు రమేష్, కోట, అజయ్, రోహిణి హట్టంగడి, తనికెళ్ళ భరణి
ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు
సంగీతం: తమన్
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: హరీష్ శంకర్
విడుదల తేదీ: 11 అక్టోబర్ 2013

క్లుప్తంగా చెప్పాలంటే
సరదా సరదాగా తిరిగే కుర్రాడు నందు(ఎన్టీయార్)కి ఓ సందర్భంలో అక్షర (సమంత) ఎదురుపడ్తుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్తాడు నందు. అయితే అక్షర, నందు ప్రేమని అంత త్వరగా అంగీకరించదు. ఎలాగో అక్షర కూడా నందుని ఇష్టపడుతుంది. అక్షర ఇంటికి ఆమె సోదరి పెళ్ళి కోసం వస్తాడు నందు. అక్షర తండ్రి పెద్ద బిజినెస్ మేన్. అతనికీ కొన్ని ఇబ్బందులుంటాయి, శతృవుల నుంచి ప్రాణభయమూ పొంచి వుంటుంది. తాను ప్రేమించిన అక్షర తండ్రిని ప్రాణ భయం నుంచి ఎలా నందు రక్షిస్తాడు? ఈ క్రమంలో కథలో వెలుగు చూసే ట్విస్ట్లు ఏంటి? అనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
ఎన్టీఆర్ మునుపటి సినిమాలకంటే అందంగా కన్పించాడు. సినిమాలో ఎన్టీఆర్ నటనకు వంక పెట్టలేం. ఒంటి చేత్తో సినిమాని అంతా తానై నడిపించాడు. డాన్స్, డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్సెస్ లోనూ సత్తా చాటాడు. స్టయిలిష్ గానూ కన్పించాడు. సమంత క్యూట్ గా వుంది. తనదైన సెక్సప్పీల్ తో యూత్ ని ఆకట్టుకుంటుంది. శృతిహాసన్ ఫర్వాలేదు. ముఖేష్ రుషి తన పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించాడు. రవిశంకర్ అదరగొట్టేసాడు. ఈ పాత్రకి ఇచ్చిన బిల్డప్, ఆ బిల్డప్ కి తగ్గ గాంభీర్యం, సంభాషణలు అన్నీ సమతూకంలో పడ్డాయి. కనిపించింది కాస్సేపే అయినా కోట తనదైన ముద్ర వేయగలిగారు. రావు రమేష్, అజయ్ తదితరులంతా ఓకే. మిగతా పాత్రధారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. చెప్పినట్టుగానే సినిమాని పవర్ ప్యాక్డ్ గా తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. సినిమా రిచ్ గా తెరకెక్కించడంలో, ఎన్టీఆర్ ని అందంగా చూపించడంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. సెకెండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గి, సీరియస్ నెస్ పెరిగింది. యాక్షన్ సన్నివేశాలతో సినిమా అంతా నింపేశాడు. డైలాగులతో తన ప్రత్యేకతను చాటుకున్నా, సినిమా మొత్తంగా చూస్తే యావరేజ్ కంటెంట్ తప్ప, సినిమా రిలీజ్ కి ముందు చెప్పిన రేంజ్ లో సినిమాని రూపొందించలేకపోయాడు. యాక్షన్ సీక్వెన్సెస్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి గనుక, బీ, సీ సెంటర్స్ ప్రేక్షకులకు సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నదానిపైనే సినిమా ఫలితం ఆధారపడి వుంటుంది. భారీ అంచనాల నేపథ్యంలో సినిమాకి భారీ ఓ పెనింగ్స్ లభించాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే: రామయ్యా.. ఫర్వాలేదంతేనయా

అంకెల్లో చెప్పాలంటే:  2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Raghu Kunche