Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
gone sancheelO savam

ఈ సంచికలో >> కథలు >> పరాయి సొమ్ము

parayi sommu

ప్రతిపక్షాలు బందుకు పిలుపునిచ్చిన నేపద్యంలో ఆఫీసుకు ముందస్తు సెలవు ఇవ్వటంతో ఇంట్లో టివి చూస్తూ కూర్చున్నాడు అవినాష్.  అవినాష్ భార్య కుసుమ, కొడుకు అరవింద్ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లారు.  తాను మాత్రం భోజనాల వేళకు వస్తానని చెప్పి ఇంట్లో వుండి పోయాడు అవినాష్.  ఇంట్లో టివి చూస్తున్న అవినాష్ కు  వీధి  

లోనుంచి  “పాత పేపర్లు కొంటాం” అన్న కేక వినపడింది.  తను రోజు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు ఇంటువంటి కేకలు మాములుగానే వినిపిన్తువున్న ఈ కేకలో కాస్త తేడ వుండడంతో వీధి లోకి వచ్చి చూసాడు అవినాష్.   ఇంచుమించి తన కొడుకు అరవింద్ వయస్సులో వుండే ఒక 12 సంవత్సరాల  పిల్లాడు   బండిని తోసుకుంటూ వెళుతున్నాడు.  “బాబు ఇల రా “ అంటూ పిలిచాడు అవినాష్. తన దగ్గరకు వచ్చిన అ పిల్లాడితో “ ఇంత చిన్న వయస్సులో చదువుకోకుండా ఎందుకు ఇలా వీధులవెంట తిరుగుతున్నావు” అని అడిగాడు అవినాష్. 

“సార్ నేను గవర్నమెంటు స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను.  ఈ రోజు బంద్ నేపధ్యంలో స్కూలుకు సెలవు ఇచ్చారు.  మా క్లాసులో ఆన్ని సబ్జక్టుల్లో నేనే ఫస్టు సార్.  ప్రతిరోజూ మానాన్న ఉదయంనుంచి ఎండలో తిరుగుతూ పాత పేపర్లు కొని మారు బేరానికి వాటిని అమ్మి సాయంత్రానికి ఇల్లు చేరుకొని ఆ వచ్చిన డబ్బులతో మమ్ములును చదివిస్తు  కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎలాగు నాకు సెలవిచ్చారు కాబట్టి నాన్నకు కాస్త ఈరోజైన  రెస్ట్ ఇద్దామని   నేను  పనిలోకి వచ్చాను సార్.  నేను ఎలాగైనా బాగా చదువుకొని మా అమ్మ నాన్నల కష్టాలను తీరుస్తాను సార్ “ అన్నాడు  ఆ పిల్లాడు.  ఆ పిల్లాడు అలా చెపుతువుంటే ముచ్చటగా చూస్తున్న అవినాష్ జోబులోంచి 100 రూపాయలు తీసి ఇవ్వబోయాడు.  “సార్ కష్టపడకుండా వచ్చేది ఏదైనా కాని తీసుకోవద్దని మా నాన్న చెప్పాడు.  మీకు అంతగా సహాయం చేయాలనీ వుంటే మీ ఇంట్లో పాత పేపర్లు ఎవైన వుంటే ఇవ్వండి సార్.  వాటిని కొని అమ్మితే మాకు ఒక కేజీకి 2 రూపాయల లాభం  వస్తుంది” అన్నాడు.

ఆ  పిల్లాడి మాటలు విన్న అవినాష్ వాడిని వుత్త చేతుల్తో  పంపడం ఇష్టం  లేక ఇంట్లోకి వెళ్లి పాత పేపర్లు వెతకసాగాడు.  ఒక అలమారలో కొన్ని పాత పేపర్లు కనపడటంతో తిసుకొచ్చి ఆ  పిల్లాడి కి ఇచ్చాడు.  అ పేపర్లు తూకం వేసిన అ అబ్బయి “సార్  ఇవి రెండు కీజిలు వున్నాయి, కీజికి 5 రూపాయల ప్రకారంగా ఇదిగోండి 10 రూపాయలు తీసుకొండి ” అంటూ 10 రూపాయలు ఇవ్వబోయాడు.  “పరవా లేదులే నీవే ఉంచుకో” అన్నాడు అవినాష్.  “ సార్ పరాయి సొమ్ము పాముతో సమానం మనము వాటిని ముట్టుకోకూడదు అని మా నాన్న చెప్పాడు సార్.  మీ వల్ల  మాకు ఈ రోజు 4 రూపాయలు లాభం.  మీకు సహాయం చేయాలనిపిస్తే మీ ఇంట్లో పాత పేపర్లు ఎప్పుడు మాకె అమ్మండి సార్”  అని అవినాష్ కు 10 రుపాయల  నోటు ఇచ్చి పాత పేపర్లు కొంటాం అంటూ అరుస్తూ వెళ్లి పోయాడు ఆ పిల్లాడు.  
లంచ్ టైం కావటంతో అవినాష్ భార్య,కొడుకు వెళ్ళిన ఫంక్షన్ కు వెళ్ళి భోజనాలు ముగించుకొని అందరు ఇంటికి తిరిగి వచ్చారు.  ఇంట్లోకి వచ్చిన కుసుమ అలమార తలుపు తెరిచి వుండటం గురించి  అవినాష్ ని అడిగింది.

“అవును నేనే  తెరిచాను అందులో పాత పేపర్లు ఒక పిల్లాడికి అమ్మేసాను” అన్నాడు అవినాష్.  “ అయ్యో ఎంత పని చేసారండి. అరవింద్ అస్తమానం మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నాడని నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వానికి కనపడకుండా ఆ పేపర్ల మధ్యన  పెట్టాను.  20 వేల రుపాయల ఫోన్ అనవసరంగా పోయిందే.  వాడెవడో కానీ అ ఫోన్ అమ్మేసి హ్యాపీగా  ఒక నెలంతా బతికేస్తాడు ”  అని భాదతో కూడిన కోపంతో అంది కుసుమ.  అవినాష్ మాత్రం  ఆ  పిల్లాడి అలా చేయడేమో  అన్నాడు. “ ఈరోజుల్లో అలాంటి వారు ఎవరున్నారండి, పరాయి సొమ్ము ఊరికె దొరికితె అప్పనంగా తీసుకొంటారు”  అంది కుసుమ ఫోన్ పోయినందుకు మరొకసారి భాద పడుతూ. అవినాష్ కు  మాత్రం మనసులో ఆ  పిల్లాడి పై చెడు అభిప్రాయం కలగడం లేదు. 

అప్పటివరకు ఎండగా వున్న వాతావరణము  ఒక్కసారిగా మారి పోయింది.  ఉన్నట్లుండి పెద్ద వర్షం కురవసాగింది.  సాయత్రం 6 గంటలకే కారుమబ్బులు కమ్ముకోవటంతో చీకటి అలముకుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగటంతో వెళ్లి తలుపు తీసింది కుసుమ.  ఎదురుగ నడివయస్సు ఆతను అతనితోపాటు ఒక పిల్లాడు తడిసిన బట్టలతో వున్నారు.

“ ఎవరు మీరు ఎవరు కావాలి “ అని అడిగింది కుసుమ.  “మేడం, సార్ వున్నారా?” అడిగాడు ఆ పిల్లాడు .  ఇంతలో అవినాష్ కూడా బయటకు బచ్చాడు.  “నమస్తే సార్, పొద్దున మీరు నాకు పాత పేపర్లు అమ్మారు.  అ  పేపర్ల మధ్యన మీ  ఫోన్ వుండి పోయింది.  ఇంద తీసుకోండి” అంటూ వానలో తడవకుండా ఉంచిన కవర్లోంచి ఫోన్ తీసి అవినాష్ కు ఇచ్చాడు ఆ పిల్లాడు.  ఆ  పిల్లాడి పట్ల తనకున్న అంచనా తప్పుకానందుకు  లోపల సంతోషించాడు అవినాష్.  “ నీకు చాల మంది పేపర్లు అమ్మింటారు కదా? ఇది మాదేనని ఎలా అనుకున్నావు”  అడిగింది కుసుమ. “ మేడం మీఫోన్  వెనకాల కవర్లో మీ అబ్బాయి ఫోటో వుంది.  పొద్దున్న పేపర్లు తీసుకుంటూనప్పుడు వరండాలో మీ ఫ్యామిలీ ఫోటో చూసాను అందులో మీ అబ్బాయి ఫోటో ను పోల్చుకొని ఆ ఫోన్ మీదేనని డిసైడ్ అయ్యాను” చెప్పాడు ఆ  పిల్లాడు .    “ ఇంత  వర్షంలో రాకుంటే ఏమిటి  పొద్దున్నే తేవచ్చు కదా” అన్నాడు అవినాష్. 

“ సార్  ఇంత  ఖరీదయిన  ఫోన్ ను కాపాడే శక్తి మాకు లేదు, ఇదికాని మా చేతుల్లో పోతే  అ ఫోన్ ను  మేమే తీసుకున్నామన్న చెడు అభిప్రాయం మీ మనస్సులో వుండి పోతుంది.  అట్లాంటి నిందను మేము భరించలేము.  అందుకే  ఇంత వర్షంలో మా వాడిని తీసుకొని వచ్చాను”  అన్నాడు అ పిల్లాడి  త్రండి.  “  చూడండి మీకు కృతజ్ఞతగా ఏమన్న ఇస్తే తీసుకోరు.  మా కంపెని బ్రాంచిలు ఈ ఊర్లో 5 వున్నాయి ఆ బ్రాంచిల తాలూకు పాత పేపర్లు అన్నికూడా మీకే ఇప్పించే  ఏర్పాటు చేస్తాను.  దయచేసి కాదనవద్దు”  అన్నడు అవినాష్.  అవినాష్ పట్ల కృతజ్ఞత భావంతో చూస్తుండి పోయారు ఆ  పిల్లాడు , అతని తండ్రి.

మరిన్ని కథలు