Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్టీఆర్‌' బయోపిక్‌: ఆర్టిస్టులు కావాలహో.!

ntr bio pic

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్‌' ప్రాజెక్ట్‌ని దర్శకుడు క్రిష్‌ టేకప్‌ చేసిన సంగతి తెలిసిందే. క్రిష్‌ చేతిలోకి వచ్చాక సినిమా షూటింగ్‌ పనులు వేగవంతమయ్యాయి. అందులో భాగంగా స్క్రిప్టు పనులు ఆల్రెడీ పూర్తి చేశాడు. ఎన్టీఆర్‌ జీవితంలోని అతి ముఖ్యమైన ఘటనల్ని ఆధారంగా క్రిష్‌ స్క్రిప్టు ప్రిపేర్‌ చేశాడట. సినీ, రాజకీయ ప్రస్థానంలోని అతి కీలక ఘట్టాల్ని తెరపై చూపించబోతున్నాడట. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌ బయోపిక్‌కి సంబంధించి ఇంతవరకూ నటీనటుల లిస్ట్‌ ప్రిపేర్‌ కాలేదు. ఎన్టీఆర్‌ పాత్ర పోషిస్తున్న బాలయ్య తప్ప మరో ఆర్టిస్టు పేరు కన్‌ఫామ్‌ కాలేదింతవరకూ. ఫలానా పాత్రలో ఫలానా వారట.. అనే గాసిప్స్‌ తప్ప అఫీషియల్‌గా చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే తాజాగా అందిన సమాచారమ్‌ ప్రకారం ఈ సినిమాలో కొత్త నటీనటుల్ని ఎంచుకోవాలని క్రిష్‌ భావిస్తున్నాడట.

అందుకే 'ఎన్టీఆర్‌' బయోపిక్‌కి ఆర్టిస్టులు కావాలి అని అధికారిక అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాడు దర్శకుడు క్రిష్‌. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర అంటే, అలనాటి మేటి నటీనటులను మ్యాచ్‌ చేయగల ఫీచర్స్‌తో ఉన్న వారే కావాలి. అందుకనుగుణంగానే ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోందట. ఇంతవరకూ ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్‌ అనీ, చంద్రబాబు పాత్రలో రానా అనీ.. ఇలా పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ జస్ట్‌ ప్రచారం మాత్రమే. ఫైనల్‌ డెసిషన్‌ డైరెక్టర్‌గా క్రిష్‌దే. క్రిష్‌ సెలెక్ట్‌ చేయబోయే నటీనటులు ఎవరనేది అషీషియల్‌గా కొద్ది రోజుల్లోనే తెలిసిపోనుంది.

మరిన్ని సినిమా కబుర్లు
What is the friendship of the directors for any miracles?