Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue269/715/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి).... అనిరుద్ వచ్చాడు. సోమ వారం శరణ్య ఆఫీస్ కి బయలుదేరుతుండగా వచ్చాడు.
తేజ అతను కారు దిగుతుండగానే ఎదురు వెళ్లి ఆలింగనం చేసుకుని స్నేహితుడికి స్వాగతం పలికాడు.

లిఫ్ట్ లో ఇద్దరూ పైకి వెళ్ళే సరికి శరణ్య రెడీ అయి ఉంది. డ్రైవర్ వచ్చి ఆమెకి రిపోర్ట్ చేసాడు.

తేజ శరణ్యని, అనిరుద్ ని పరస్పరం పరిచయం చేసాడు.

“కైసే హో బేటి”  అంటూ ఎంతో కాలంగా పరిచయం ఉన్నంత ఆత్మీయంగా పలకరించాడు అనిరుద్.

“మేమిద్దరం చిన్నప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు విడిచి ఉండే వాళ్ళం కాదు.. ఇప్పుడు నా ప్లేస్ మీరు తీసుకున్నారు” అన్నాడు నవ్వుతూ.
శరణ్య చిరునవ్వు నవ్వింది.

“ ఫ్రెష్ అవుతావా అనిరుద్”  అడిగాడు తేజ.

“ ఓ నాట్  నేసేసరి .. పొద్దున్నే స్నానం చేసి బయలుదేరాను.  ఐ యాం ఫ్రెష్ “ అన్నాడు అనిరుద్ ..

శరణ్య తేజతో అంది ...” బ్రేక్ ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందామా..”

“యా ... కమాన్” అని  అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు దారి తీసాడు.

అన్నయ్యా అని పిలవకుండా పేరు పెట్టి పిలుస్తున్న తేజ వైపు ఆశ్చర్యంగా చూసింది శరణ్య. ఆ చూపులు గమనించి నవ్వుతూ అన్నాడు.. “మాకు వరసల కన్నా ఈ స్నేహ బంధమే ఎక్కువ ..”

వంటమనిషి అందరికి ఇడ్లి , కారప్పొడి, చట్ని వేసిన ప్లేట్స్ తెచ్చి పెట్టింది.

“ఇంతకీ ఎప్పుడు వచ్చావు.. మళ్ళి వెళ్తావా” అడిగాడు తేజ.

“మళ్లినా ... వెళ్ళడానికి కాదురా ఉండిపోడానికి వచ్చేసా.. ఇంక వెళ్ళే ప్రసక్తి లేదు” అన్నాడు అనిరుద్.

“పెళ్లి చేసుకున్నావా...” అడిగాడు తేజ.

“ మిలటరీ వాడు పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని సుఖపెడతాడా ... “ అన్నాడు అనిరుద్ నవ్వుతూ.

“ అదేంటి మిలటరీ లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదా ఏం” అన్నాడు తేజ.

“ చేసుకున్నారు..  కానీ నేను చేసుకోలేదు.. ఎందుకంటే నా లైఫ్ ఇన్ సెక్యూర్ .. ఏ క్షణాన చచ్చిపోతానో,   ఏ క్షణాన కాళ్ళు, చేతులు విరుగుతాయో తెలియదు.. అదే జరిగితే నన్ను చేసుకున్న అమ్మాయికి ఎంత అన్యాయం జరుగుతుంది. అందుకే ఇంత కాలం చేసుకో లేదు.. ఇంక నా ప్రాణానికి ఏ హాని లేదు.. ఇప్పుడు చేసుకోవచ్చు ... కాకపోతే ఫార్టీస్ కి చేరుతున్న నన్ను చేసుకోడానికి ఏ అమ్మాయి ముందుకు వస్తుంది..”అతని మాటలకి ప్రశంసగా చూసింది శరణ్య.

తేజ అతని భుజం మీద తట్టి “ ఇప్పుడు ఇంకా హ్యాండ్ సం గా ఉన్నావు.. నీకేంటి  ఎవరైనా చేసుకుంటారు ఎగిరి గంతేసి “ అన్నాడు.

“ ఓకే అలా ఎవరన్న ఎగిరితే గట్టిగా పట్టుకుని తీసుకురా చేసుకుంటా” అన్నాడు అనిరుద్ నవ్వుతూ.

శరణ్య నవ్వుతూ లేచి నిలబడి “నాకు టైం అయింది.. ఆఫీసుకి వెళ్తున్నాను.. మీరు మీ తమ్ముడితో ఎంజాయ్ చేయండి.. మీ ఇల్లే అనుకుని ఫ్రీ గా ఉండండి”  అంది.

“ఒక్కరోజు లీవ్ పెట్టకూడదూ ... సరదాగా నువ్వూ మాతో స్పెండ్ చేయచ్చు” అన్నాడు తేజ శరణ్యతో.

“ఇవాళ మీరిద్దరూ కబుర్లు చెప్పుకోండి తనివి తీరా.. రేపు మార్నింగ్ ఒక మీటింగ్ ఉంది ..అది అవగానే వచ్చేస్తాను”  అంది.

“ఒకే అమ్మా ... వెళ్లిరా”  అన్నాడు అనిరుద్.

“థాంక్స్”  అంటూ శరణ్య తేజకి కూడా చెప్పి వెళ్ళి పోయింది.

కజిన్స్ ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

మర్నాడు అన్నట్టే మధ్యాన్నం రెండింటి కల్లా ఇంటికి వచ్చేసింది శరణ్య. అప్పటికి వంట మనిషిని అవసరం లేదు లీవు తీసుకోమని పంపించేసి, కజిన్స్ ఇద్దరూ కలిసి ఫ్రైడ్ రైస్ , ఎగ్ పులుసు, పన్నీర్ బట్టర్ మసాలా కూర చేసారు.

శరణ్య వస్తూనే “ఏంటి ఈ ఘుమ ఘుమలు” అంది..

“మేమిద్దరం కలిసి ఇవాళ నీకోసం స్పెషల్ చేశాం .. నువ్వు త్వరగా ఫ్రెష్ అయి రా” అన్నాడు తేజ.

భోజనాలు చేస్తూ బోలెడు కబుర్లు చెప్పుకున్నారు.

భోజనాలు అయాక అనిరుద్ పెళ్లి విషయం ప్రస్తావనకు వచ్చింది..

“నీ పెళ్లి చేసే బాధ్యత నాది మాచెస్ చూడమంటావా” అడిగాడు తేజ.

“చూడు ... మీ ఇద్దరినీ చూస్తుంటే నాక్కూడా అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది” అన్నాడు అనిరుద్.

“మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏదన్న జాబ్ చూసుకుంటారా” అడిగింది శరణ్య.

“చూసుకోవచ్చు ఎక్స్  సర్వీసు కోటాలో మంచి జాబ్స్ వస్తాయి. కానీ చేయాలనీ లేదు.. మా నాన్న ఇచ్చిన ఆస్తి బోలెడు ఉంది.. ఇదిగో వీడితో కలిసి మంచి సినిమాలు తీయాలని ఉంది” అన్నాడు.

“సినిమాలా...” కొంచెం ఆశ్చర్యంగా తేజ వైపు, అనిరుద్ వైపు చూసింది.

తేజ తల ఊపుతూ “షార్ట్ ఫిలిమ్స్ తో మొదలు పెట్టి ఫీచర్ ఫిలిమ్స్ వైపు వెల్తాట్ట.’

“అదంతా పెద్ద ఇండస్ట్రీ కదా “

“ అయితే ఏం మనం కూడా ఆ ఇండస్త్రీలో కి ఎంటర్ అవుదాం ..”

నవ్వింది శరణ్య..

“ నీ నవ్వుకి అర్ధం ఏంటో చెప్తావా” అడిగాడు అనిరుద్..

“ ఏం లేదు...సినిమా అంటే అంత ఈజీ కాదు కదా మీ ధైర్యం ఏవిటా అని నవ్వొచ్చింది” అంది.

“సరే అయితే ముందు షార్ట్ ఫిలిం చేద్దాం మంచి కధ చూడు తేజా” అన్నాడు.

“నేను కూడా కధ కోసమే చూస్తున్నాను.. ఈ సారి విమెన్ పాయింట్ అఫ్ వ్యూ లో చేయాలి.. ఆడపిల్ల మీద జరిగే దౌర్జన్యాలు, అత్యాచారాలు వీటి నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి వగైరా.. శరణ్యా నీ కాండిడేట్ ఎక్కడ ఉంది” అడిగాడు తేజ.

“నా కాండిడేటా ఎవరు?” ప్రశ్నార్ధకంగా చూసింది..

“అదే ఆ అమ్మాయి పేరు మర్చి పోయాను.. ఇందిరా పార్క్, గుల్ మొహర్ “

అతని మాట పూర్తీ కాకుండానే “ఓ గాయత్రా ... చెప్పాగా అంగన్ వాడిలో చేర్చాను. ఎందుకు?”

“ఆ అమ్మాయిని పెట్టి ఆమె కధే షార్ట్ ఫిలిం తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది”.

“ఆ అమ్మాయి కధ షార్ట్ ఫిలిం గా సరిపోదు.. పెద్ద సినిమా తీయాలి.”

“ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయచ్చు..”

“ఎవరా అమ్మాయి ఏమా కధ?” అడిగాడు అనిరుద్.

శరణ్య చెప్పబోతుండగా ఆమె ఫోన్ మోగింది. సుశీల దగ్గర నుంచి. శరణ్య ఆన్సర్ బటన్ నొక్కి” హలో చెప్పండమ్మా “ అంది.

ఫోన్ లో అవతలి వాళ్ళు చెప్తున్న విషయం వింటున్న శరణ్య మొహంలో రంగులు మారడం, ఆమె స్పందిస్తున్న తీరు తేజ నొసలు చిట్లించి చూడసాగాడు.

ఎండ్ బటన్ నొక్కి ఆందోళనగా అంది శరణ్య..” గాయత్రి  వెళ్లి పోయిందిట..”

“ఎక్కడికి” అడిగాడు తేజ.

“తెలియదు..సుశీల ఇంట్లో ఏదో దొంగతనం చేసి పారిపోయింది అంటోంది.. కాని ఐ డోంట్ బిలివ్ ... ఏదో జరిగింది.. లేకుంటే ఆ అమ్మాయి పారిపోడం ఏంటి? భయపడి వెళ్ళి పోయి ఉండాలి.. లేకుంటే వీళ్ళ ఏదో చేసి వెళ్ళగొట్టి ఉంటారు..”

“మళ్ళీ తల నొప్పి మొదలైందా మనకి” అన్నాడు తేజ.

శరణ్య గభాల్న లేచి “నేను నందిగామ వెళ్ళాలి” అంది.

“ ఆగు మేమూ వస్తాం... ఒక్కదానివి ఎందుకు “ అంటూ తేజ, అనిరుద్ కూడా లేచారు.

(అపకారం తలపెట్టిందికాక, ఆమె పైనే దొంగతనం మోపిన ఆ దుర్మర్గుని పన్నాగం బయటపడేదేలా? మళ్ళీ గాయత్రి శరణ్య కంటపడేదెలా?? కంచికి చేరుతుందనుకున్న గాయత్రి కథ మళ్ళీ మొదటికొచ్చిందా?? ఇవన్నీ తెలియాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంటదాకా వేచి చూడాల్సిందే....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana