Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'Surya' changed Route

ఈ సంచికలో >> సినిమా >>

గ్యాంగ్‌లీడర్‌ రీమేక్‌: డైరెక్టర్‌ ఎవరంటే.!

gang leader re make

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వచ్చిన 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాని రీమేక్‌ చేస్తున్నారా? అంటే అవునంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. మరి ఈ రీమేక్‌లో నటించే హీరో ఎవరు? ఇంకెవరు, అక్షరాలా మెగస్టార్‌ తనయుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణేనట. రామ్‌చరణ్‌ కోసం డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి ఓ స్క్రిప్టు ప్రిపేర్‌ చేశాడట. 'ధృవ' కన్నా ముందే ఈ స్క్రిప్టు సిద్ధం చేశాడట సురేందర్‌ రెడ్డి. ఈ సినిమాకి 'గ్యాంగ్‌లీడర్‌' అనే టైటిల్‌ని పెట్టాలని అనుకుంటున్నారట. అయితే చిరంజీవి 'గ్యాంగ్‌లీడర్‌'కీ, చరణ్‌ 'గ్యాంగ్‌లీడర్‌' సంబంధం ఉండదట. టైటిల్‌ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమానీ పట్టాలెక్కించే యోచనలో సురేందర్‌ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

సురేందర్‌ రెడ్డి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి'తో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రమైన 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. చారిత్రక గాధ ఆధారంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అత్యంత కీలకమైనవి. ఆ పనిలోనే ప్రస్తుతం చిత్ర యూ నిట్‌ నిమగ్నమై ఉంది. హాలీవుడ్‌ నుండి ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. వీరి నేపథ్యంలోనే హైద్రాబాద్‌ శివార్లలో శక్తివంతమైన యాక్షన్‌ ఘట్టాలను 'సైరా' టీమ్‌ చిత్రీకరిస్తోంది. బాలీవుడ్‌ నటుడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు, కన్నడ నటుడు సుదీప్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
Anushka - Prabas  wedding