Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
avasaraaniko abaddam short flim review

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

tamilnadu

విహారయాత్రలు

చెన్నైలో మందిరాలే కాక మహమ్మదీయుల ప్రార్ధనలస్థలాలు , క్రైస్థవుల ప్రార్థనా స్థలాలు చాలా వున్నాయి , పాండీ బజారు , పారిస్ కార్నరు , వెస్ట్ మాంబళం మార్కెట్ప్లేసులూ చూడదగ్గవే . పట్టు చీరల షాపుల గురించి చెప్పనేఅక్కరలేదు . మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు కూడా పేరుపొందింది చెన్నై మహానగరం .పర్యాటక ప్రదేశాలకే కాక పంచరంగుల సినిమాప్రపంచానికి కూడా పేరుపొందింది  అడుగడుగున రంగులు మార్చే రాజకీయాలకు కూడా ముఖ్య కూడలి చెన్నై అని చెప్పనవసరం లేదు .

పట్టణం పాశ్చాత్య పోకడలను యెప్పుడో ఆహ్వానించినా సాంప్రరదాయతను పోగొట్టుకోకుండా మన దేశంలో నిలిచిన  యేకైక  మహా నగరం కూడా యిదే . జీన్ పేంటు ఓ పక్క పట్టుచీరలు మరోపక్క , బాబ్ కట్ ఓవైపయితే తలనిండా మల్లెలు కనకాంబరాలు మరోపక్కకనిపిస్తాయి .

చెన్నై చుట్టుపక్కల వున్న పల్లెలు సాంప్రదాయకంగాకనిపిస్తాయి .

చెన్నై నుంచి కాస్త దూరం వెడితే యిప్పుడు నగరంమహానగరంగా మారింది కాబట్టి చాలా పల్లెలుమహానగరంలో విలీనమయేయి . అలాంటిదే ‘ మాంగాడు ‘ . 1990 ల వరకు చిన్నపల్లెగా వుండేది . ఇక్కడ వున్నఅమ్మవారి కోవెల వలన యీ గ్రామం తమిళనాడులో ప్రసిధ్దపొందింది . ఈ కోవెల గురించి యివాళ తెలుసుకుందాం .

చెన్నై నుంచి 20 కిలోమీటర్లు కోయెంబేడుబస్సుస్టాండు మీదుగా అంటే పూనమల్లి హైవే మీదుగాబెంగుళూరు వైపు వెళితే ‘ మాంగాడు ‘ గ్రామం యిప్పడుగ్రామం అనకూడదు చెన్నై మహానగరంలో కలిసిపోయింది . మాంగాడు అంటే మామిడితోట అని అర్దం .  మాంగాడు చేరగానే హైవే కి యెడమపక్క కాస్త లోపలికి వెడితేయేడంతస్థుల రాజగోపురం కనిపిస్తుంది . అయితే యీగోపురం యీ మధ్య కాలంలో కట్టినది , కోవెల మాత్రంచోళరాజులకాలానికి చెందినది . మందిరానికి వెళ్లేదారంతాకొబ్బరికాయలు పళ్లు అమ్మే దుకాణాలు ప్రతీ దుకాణం లోనూనిలువెత్తు నిమ్మకాయల దండలు వ్రేలాడుతూ వుంటాయు . లోపల యెత్తైన ద్వజస్థంబం , భక్తులు బారులు తీరిఅమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తూ కనిపిస్తారు , అడుగులులెక్కపెడుతూ ప్రదక్షిణాలు చేస్తూ వుంటారు . కోర్కెలు తీరినభక్తులు యిలా తమ మొక్కులు తీర్చుకుంటారు . నిలువెత్తునిమ్మకాయల దండలు అమ్మవారికి సమర్పంచే భక్తులుకూడా కనిపిస్తారు . నిమ్మకాయల మొక్కు గురించి మీకుయింతకు ముందు తెలియజేసేనుకదా ? .

       సర్వాలంకార భూషిత యైన అమ్మవారు గర్భగుడిలోకళకళ లాడుతూ వుంటుంది . అమ్మవారి మెడలో వున్ననిమ్మకాయల దండలు చూస్తే అమ్మవారి పై భక్తుల నమ్మకంయెంత యెక్కువగా వుందో తెలుస్తుంది . 

        లోపల ఉప మందిరాలలో వినాయకుడు , షణ్ముఖుడు , సంధికేశ్వరి , శివుడు , దుర్గ లుపూజలందుకుంటున్నారు . 1990ల వరకు నామమాత్రంగావున్న యీ మందిరం తరువాత చాలా మార్పులు చేర్పులుజరిగి చాలా పెద్ద మందిరంగా రూపుదిద్దుకుంది . గర్భగుడియెదురుగా వున్న మంటపంలో హోమాలు జరుగుతూవుంటాయి . అక్కడ వున్న అర్దమేరుచక్రం దగ్గర భక్తులుసాష్టాంగ నమస్కారాలు నిర్వహిస్తూ వుంటారు . అర్దమేరుచక్రాని కి పువ్వులతో పూజలు చేస్తూ వుంటారు . గర్భ గుడి వెలుపలి భాగాన అమ్మవారి సప్తమాతృికలవిగ్రహాలు వుంటాయి . ఈ అమ్మవారిని కామాక్షి అమ్మవారుఅని అంటారు . అన్ని అమ్మవారి మందిరాలలోలా కాకుండాయిక్కడ శివకోవెల వేరుగా వుండడం విశేషం . అమ్మవారురోజంతా అలంకారంలో వుంటారు కాబట్టి మనకి అమ్మవారినిజరూపం యెలావుంటుందో కనిపించదు . అభిషేకసమయంలో  నిజరూప దర్శనం అవుతుందేమో మరి , స్థలపురాణం గురించి అడిగితే యిక్కడ పూజారి చెప్పిన కథమాకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది . మరి ఆకథేమిటో మీరుకూడా చదివేయండి .

            పార్వతీ పరమేశ్వరులు కైలాసపర్వతానవున్నప్పుడు ఒకనాడు పార్వతి శివుడితో పరాచికాలుఆడుతూ శివుని రెండు కళ్లు మూస్తుంది . శివునిరెండుకళ్లైయిన సూర్యచంద్రులు కానరాక ముల్లోకాలుఅల్లకల్లోలమౌతాయి , నిత్యహోమాలు నిర్వహించేఋషులకు మునులకు యేదిరాత్రో  యేది పగలో తెలియరాకయిబ్బందులు కలుగుతాయి . శివుడు ఋషులకు , మునులకు కలిగిన అసౌకర్యానికి చింతించి అందుకుకారణభూతురాలైన పార్వతికి కైలాస ప్రవేశం నిషేధిస్తాడు . తన వల్ల జరిగిన పొరపాటుకు చింతించిన పార్వతి శివునివేడుకొనగా భూలోకంలో శాపవిముక్తి కొరకు కావలసినపుణ్యము సంపాదించవలసినదిగా శలవిస్తాడు . పరమేశ్వరుని విడిచి వుండలేని పార్వతి అతి కష్టమైనమార్గమును అనుసరించి త్వరగా శాపవిముక్త కావాలనితలచి భూలోకంలో తపస్సాచరించడానికి అనువైన ఓమామిడితోటను యెంచుకుంటుంది . ముందుగాశివలింగాన్ని ప్రతిష్టించుకొని పంచాగ్ని ప్రజ్వలింపజేసుకొనియెడమకాలు అగ్నిలో వుంచి కుడికాలు పైకెత్తి ఓచేతజపమాల ధరించి , మరొక చేయి పైకెత్తి తపస్సుచేయసాగింది . అందుకే యిక్కడ పార్వతికి తాపసకామాక్షిఅనే పేరు వచ్చింది . పార్వతీ దేవి తపస్సులోంచి పుట్టినఅగ్ని ముల్లోకాలలో వేడి పుట్టించగా ముక్కోటిదేవతలూపార్వతీ దేవి తపస్సును చూడడానికి వస్తారు . పార్వతీ దేవి32 ధర్మ విధులతో శివుని కొలువసాగింది . తపస్సునకుమెచ్చిన పరమేశ్వరుడు పార్వతి కి శాపవిమోచన కలిగించికాంచీపురంలో వేచియుండమని తాను వచ్చి తిరిగిపార్వతిని వివాహమాడి కైలాసమునకు తీసుకుపోతాననిశలవిస్తాడు . శాప విమోచన పొందిన పార్వతీదేవికాంచీపురానికి తరలిపోయి శివుని కొరకైయెదురుచూడసాగింది . పార్వతీదేవి యొక్క తపస్సునుచూస్తున్న ముక్కోటి దేవతలు ఆమె తాపసరూపాన్ని అక్కడనేవిడిచి పెట్టి కలియుగంలో భక్తులను కాపాడమని కోరగాఆమె వారి కోరికను మన్నించి ఆరూపాన్ని అక్కడ విడిచిపెట్టికాంచీపురం తరలిపోయింది . పరమేశ్వరుడుకాంచీపురంలో ముక్కోటి దేవతల సాక్షిగా మరల పార్వతినిపరిణయమాడి కైలాసానికి తీసుకు వెళ్లేడు . 

       పార్వతీదేవి కాంచీపురం తరలిపోయిన తరువాతపంచాగ్ని వేడికి ఆప్రదేశం జీవరాశులకు ప్రమాదంకలుగజేయగా ఆదిశంకరులు ఆ అగ్నిని అర్దమేరుచక్రంతోకప్పి చల్లార్చేరు . ఆ చక్రానికే యిప్పటికీ పూజాదులునిర్వహిస్తున్నారు . అయితే యీ చక్రానికి కుంకుమపూజలుచేస్తారుకాని అభిషేకం చెయ్యరు . ఎందుకంటే యీ యంత్రంలోహాంతో చెయ్యబడలేదు , ఓషధులతో తయారు చేసేరు . పార్వతీదేవి శాపవిమోచన జరిగిన ప్రాంతం కాబట్టిఅమ్మవారు ప్రసన్నరాలిగా వుంటూ భక్తుల కోరికలుతీరుస్తుందని ప్రతీతి . ఇక్కడ అమ్మవారికి తాంత్రిక శక్తులువున్నాయని తాంత్రికోపాసకులు యిక్కడ తంత్రశక్తులుపొందేందుకు పూజలు చేస్తూ వుంటారు .

          పెళ్లికానివారు , పిల్లలు లేని వారు యీ అమ్మవారికిమొక్కుకుంటారు .

       వచ్చేవారం మరికొన్ని వివరాలతో మీ ముందుంటాననిమనవి చేస్తూ అంతవరకు శలవు .

           

 

కర్రా నాగలక్ష్మి

మరిన్ని శీర్షికలు
stress-happens-with-non-veg-