Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Beauty who is struggling with cancer

ఈ సంచికలో >> సినిమా >>

'గూఢచారి' వీడు మామూలోడు కాదు.!

goodachari is not like us

అడవిశేష్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'గూఢచారి'. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌. రెస్పాన్స్‌ అదిరిపోతోంది. హాలీవుడ్‌ క్వాలిటీస్‌తో ఈ టీజర్‌ని కట్‌ చేశారు. సినిమాని కూడా అంతే రిచ్‌ వేల్యూస్‌తో తెరకెక్కించారట. శిశికిరణ్‌ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి కథ అడవిశేష్‌దే. అందరూ స్టన్‌ అవ్వాల్సిందేనట సినిమా చూసి. ఆ రేంజ్‌లో ఉంటుందట కాన్సెప్ట్‌. టీజర్‌లో హాలీవుడ్‌ హీరో జేమ్స్‌ బాండ్‌ని తలపిస్తున్నాడు అడవి శేష్‌. నీట్‌గా సూటూ, బూటూ వేసుకుని కాస్ట్‌లీ కారులోంచి దిగుతున్నట్లుగా ఉన్న అడవిశేష్‌ అప్పియరెన్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు.

అంతేనా, హాట్‌ సీన్లు కూడా హాలీవుడ్‌ సినిమానే తలపిస్తున్నాయి. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల ఈ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది. హీరో, హీరోయిన్‌ మధ్య లిప్‌ లాక్‌ టీజర్‌కి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఓ రేంజ్‌లో చూపించారు టీజర్‌లో. కొన్ని సెకన్ల పాటు చూపించిన టీజర్‌లోనే ఇంత చూపిస్తే, అడవిశేష్‌ సినిమాలో ఇంకేం చూపిస్తాడో చూడాలిక. ఇకపోతే సపోర్టింగ్‌ రోల్స్‌తో యాక్టింగ్‌లో తనదైన శైలితో ఆకట్టుకున్న ఆడవిశేష్‌ సోలో హీరోగా 'క్షణం' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ సారి 'గూఢచారి'తో ఏం చేస్తాడో చూడాలి మరి. 

మరిన్ని సినిమా కబుర్లు
Anamama glamor fence