Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mokshagyna entry

ఈ సంచికలో >> సినిమా >>

మెగాఫోన్‌ పట్టిన యంగ్‌ హీరో

young hero and director

యంగ్‌ హీరో రాహుల్‌ రవీంద్రన్‌ అంటే ఇంతవరకూ నటుడిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయనలో మరో యాంగిల్‌ ఉంది. అదే దర్శకుడు. ఆయన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం 'చి.ల.సౌ'. అక్కినేని మేనల్లుడు సుమంత్‌ హీరోగా నటిస్తున్నాడు. అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. 'అందాల రాక్షసి' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన రాహుల్‌ రవీంద్రన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇంతవరకూ రాహుల్‌లోని మంచి నటున్ని మాత్రమే చూసిన ఆడియన్స్‌ ఆయనలోని ఓ మంచి దర్శకున్ని చూస్తారనీ అక్కినేని కుటుంబం నమ్మకంగా చెబుతోంది.

అంతేకాదు, ఆయనలోని దర్శకత్వ ప్రతిభను గుర్తించిన నాగార్జున అండ్‌ ఫ్యామిలీ మరో రెండు సినిమాలు తమ బ్యానర్‌లోనే చేసేందుకు మాట తీసుకున్నారట. అంతే కాదు ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో నాగచైతన్య సోలోగా పాలు పంచుకున్నాడట. రాహుల్‌ రవీంద్రన్‌, చైతూకి మంచి స్నేహితుడు. ఆ స్నేహంతోనే రాహుల్‌ని ప్రోత్సహించాడట. దర్శకుడైనా కానీ, నటనను కూడా కొనసాగిస్తానంటున్నాడు రాహుల్‌ రవీంద్రన్‌. అయితే తన భవిష్యత్తు మాత్రం దర్శకత్వ రంగానికే పరిమితం చేస్తానని చెబుతున్నాడీ యంగ్‌ హీరో కమ్‌ డైరెక్టర్‌. అతి త్వరలోనే 'చిలసౌ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
 
మరిన్ని సినిమా కబుర్లు
shatru as raising  villian