Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

20-7-2018 నుండి 26-7-2018 వారఫలాలు - - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈ వారంలో మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, వారై సూచనల మేర ముందుకు వెళ్ళండి మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట సూచన, ఉద్యోగంలో అభివృద్ధిని పొందుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయునపుడు ఏమాత్రం అశ్రద్ధ వద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు. సోదరులతో గతంలో మీరు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, పరిచయాల మూలాన లబ్దిని పొందుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. అనుకోని ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి లేక బంధువుల నుండి సూచనలు వస్తాయి.

 

 

 

 వృషభ రాశి : ఈ వారంలో ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన లబ్దిని పొందుతారు, పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరు మూలాన చిన్న చిన్న సమస్యలు పెరుగుటుకు అవకాశం ఉంది , సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

 


మిథున రాశి : ఈ వారంలో చిన్న చిన్న విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. కుటుంబంలో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. ఆత్మీయుల అనారోగ్యం మిమ్మల్ని ఒకింత ఆందోలనకు గురిచేసే అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులను కలుస్తారు, వారితో సమయం గడుపుతారు.

 

 

 

 

కర్కాటక రాశి :  ఈ వారంలో ముఖ్యమైన పనులకు సమయం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, సాధ్యమైనంత మేర తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. స్వల్పదూర ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉన్నమిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దూరదృష్టిని కలిగి ఉండుట సూచన. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

 

 

 

 సింహ రాశి : ఈవారంలో ఉద్యోగపరంగా నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, తోటివారి నుండి ఆశించిన మేర సహాయం అందుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. కుటుంబంలో నలుగురి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సామాజిక పరమైన విషయాల్లో కొత్త కొత్త అవకాశాలు లభించే ఆస్కారం ఉంది, వాటిని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం మంచిది. వాహనాల వలన ఇబ్బందులు లేక ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది జాగ్రత్త. దైవపరమైన విషయాలకు లేదా పూజలకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు మీరు చేసే ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది. అనుభవజ్ఞుల సూచనలను మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు.

 

 

కన్యా రాశి : ఈవారంలో ఉద్యోగంలో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతంలో రావలిసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సాధ్యమైనంత మేర చర్చలలో పాల్గొనేటప్పుడు నిదానంగా వ్యవహరించుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. మానసికపరమైన ఇబ్బందులు పెట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది.  మిత్రులతో విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి.

 

 

 

 

తులా రాశి : ఈరోజు మీరు ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం ఉంటుంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. వాటిని తగ్గించుకోవడంలో మీరు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవొచ్చు. స్త్రీ పరమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్త. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానం వలన కొంత ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది, జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. తండ్రి తరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.

 

 

వృశ్చిక రాశి :  ఈవారంలో సాధ్యమైనంత మేర చేపట్టు పనుల విషయాల్లో స్పష్టత కలిగి ఉండుట సూచన. చర్చల్లో నిదానంగా వ్యవహరించుట , అవసరం అయితేనే పాల్గొనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను నస్టపోయే ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. జీవితభాగస్వామితో అనుకోకుండా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది, సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. తండ్రి తరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమాయన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.

 

 

 

ధనస్సు రాశి : ఈ వారంలో బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. విలువైన వస్తవులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వాహనాల విషయంలో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. స్వల్పఅనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మేలు.

 

 

మకర రాశి : ఈవారంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. మీ నిర్ణయాలను ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడటం మేలు. మీ ఆలోచనలను జీవితభాగస్వామికి తెలియజేస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు సంతృప్తికరంగా ముగుస్తాయి. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం విషయంలో కొంత ఆందోళన ఉండే అవకాశం ఉంది, నిదానంగా ఆలోచన చేయుట మంచిది.

 

 

కుంభ రాశి : ఈవారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉండే అవకాశం ఉంది, పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళుట సూచన. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మీ మాటతీరును కొంతమంది వ్యతిరేకించే అవకాశం ఉంది. సోదరులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న బాంధవుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది.

 

 

మీన రాశి :  ఈవారంలో సంతానపరమైన విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు, సంతోషకరమైన వార్తని వైని అవకాశం ఉంది. ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి. పెద్దల అనుభవాలకు అనుగుణంగా నడుచుకొనుట వలన లబ్దిని పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో కాస్త తడబాటును పొందుతారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అనుకోకుండా విభేదాలు రావడానికి ఆస్కారం కలదు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, వాటిని తగ్గించుకోవడంలో చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేక బదిలీ ఉండే అవకాశం ఉంది. ఆత్మీయుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.
 

మరిన్ని శీర్షికలు
Plastic is a demon