Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

బిగ్‌బాస్‌లో సామాన్యుడిపై అమిత్‌ ప్రకోపం.!

Amit fire on Bigg Boss show

బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్‌ రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'లో ఈ వారం ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ చాలా అనూహ్యంగా సాగింది. అందరూ గణేష్‌ కానీ, కౌషల్‌ కానీ ఎలిమినేట్‌ అవుతాడనుకున్నారు. కానీ భానుశ్రీ ఎలిమినేట్‌ అయ్యింది. వారంలో జరిగిన ఓ చిన్న ఇష్యూ రైజప్‌ అయ్యి వారి ఎలిమినేషన్‌కు కారణమవుతూ వస్తోంది. అందులో భాగంగానే ఓ టాస్క్‌కి సంబంధించి కౌషల్‌పై భాను చేసిన అనుచిత ఆరోపణల కారణంగా ఆమె ఎలిమినేషన్‌ని తనంతట తానే కోరి తెచ్చుకున్నట్లైంది భానుకి. ఇకపోతే, ఈ వీక్‌లోనూ బిగ్‌బాస్‌లో ఊహించని పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. 'అతి మంచోడు' అనే ట్యాగ్‌ లైన్‌తో హౌస్‌ మేట్స్‌ అందరితోనూ పోజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ చేయించుకున్న ఇంటి సభ్యుడు అమిత్‌కీ ఈ సారి హౌస్‌లో చేదు అనుభవం ఎదురైంది.

బిగ్‌బాస్‌ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ కారణంగా అమిత్‌ ఇంట్లో చెడ్డవాడిగా మారిపోయాడు కాస్సేపు. ఏం జరుగుతుందో. అసలు అమిత్‌ ఎందుకలా చేస్తున్నాడో తెలియని సందిగ్ధ స్థితిలోకి వెళ్లిపోయారు హౌస్‌ మేట్స్‌ అంతా. సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగా అమిత్‌ హౌస్‌లో అందరికంటే చిన్నోడైన గణేష్‌ తలపై గుడ్డు పగలగొట్టడం, గణేష్‌ వెక్కి వెక్కి ఏడవడం, కొట్టించుకోవడానికి నేనిక్కడికి రాలేదు. నన్ను బయటికి పంపించెయ్యండి.. అని గట్టిగా అరుస్తూ గోల చేయడం తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు హౌస్‌లోకి హాట్‌ బ్యూటీ హెబ్బా పటేల్‌ త్వరలో ఎంట్రీ ఇవ్వబోతోందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బ్రేక్‌ పడేలా తాజాగా యాంకర్‌ ప్రదీప్‌ హౌస్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో బిగ్‌ హౌస్‌కి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ యాడ్‌ అయినట్లే. 

మరిన్ని సినిమా కబుర్లు
what next sri reddy