Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Aliabhtat wish

ఈ సంచికలో >> సినిమా >>

బాక్సాఫీస్‌ దుమ్ము రేపుతున్న 'ఆర్‌ఎక్స్‌100'

box office block buster RX100

కొన్ని సినిమాలు ఎందుకు హిట్‌ అవుతాయో చెప్పలేం. టాక్‌తో సంబంధం లేదకుండా బంపర్‌ హిట్స్‌ అందుకుంటున్నాయి ఈ మధ్య కొన్ని సినిమాలు. ఆ కోవలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమా 'ఆర్‌ఎక్స్‌100'. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అజయ్‌ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. తొలి సినిమాతోనే బంపర్‌ హిట్‌ అందుకున్నాడీ యంగ్‌ డైరెక్టర్‌. కంటెన్ట్‌ నార్మలే. కానీ ఎంచుకున్న విషయాన్ని ఎట్రాక్టివ్‌గా చెప్పడం ఆడియన్స్‌కి నచ్చేసింది. అది కూడా ఓ వర్గం ఆడియన్స్‌ని తెగ మెప్పించేస్తోందీ సినిమా. ఆ వర్గం ఎవరా అంటే యూత్‌ అన్నమాట. యూత్‌కి బా.గా. కనెక్ట్‌ అయిపోయింది 'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రం. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించారు

ఈ సినిమాలో. సినిమాకి మెయిన్‌ అట్రాక్షన్‌ హీరోయిన్‌ అందలు. లెక్కలేనన్ని లిప్‌లాక్స్‌, హాట్‌ రొమాంటిక్‌ సీన్స్‌ యూత్‌ని మళ్లీ మళ్లీ ధియేటర్స్‌కి వచ్చేలా చేస్తున్నాయి. సినిమాలో ఒకటి రెండు లిప్‌లాక్‌ సీన్స్‌ ఉంటేనే ఆ సినిమా ఇప్పుడు పెద్ద హిట్‌ అయిపోతోంది. అలాంటి లెక్కలేనన్ని లిప్‌లాక్స్‌ అంటే.. మరి రిజల్ట్‌ ఈ రేంజ్‌లోనే ఉంటుంది అని 'ఆర్‌ఎక్స్‌100' నిరూపించింది. ఈ సినిమాకి రివ్యూలు అంతంత మాత్రంగానే వచ్చాయి. టాక్‌ కూడా ఓ మోస్తరుగా వచ్చింది. కానీ వసూళ్లే ఊహాతీతం. బాక్సాఫీస్‌ వద్ద వీకెండ్స్‌, వీక్‌ డేస్‌ అనే తేడా లేకుండా వసూళ్లు కొల్లగొడుతోంది 'ఆర్‌ఎక్స్‌ 100'. దాదాపు పది కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు కొల్లగొట్టిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో ఓవర్సీస్‌ కాకుండా, దాదాపు 8కోట్లు వరకూ తెలుగు రాష్ట్రాల్లోనే వసూలు చేసిందీ సినిమా. 
 

మరిన్ని సినిమా కబుర్లు
vidhyabalan so hot