Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

sakshyam movie review

చిత్రం: సాక్ష్యం 
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్దే, జగపతిబాబు, శరత్‌కుమార్‌, మీనా, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, బ్రహ్మాజీ, రవికిషన్‌, అశుతోష్‌, రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు. 
సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ 
సినిమాటోగ్రఫీ: ఆర్థర్‌ ఎ విల్సన్‌ 
దర్శకత్వం: శ్రీవాస్‌ 
నిర్మాత: అభిషేక్‌ నామా 
నిర్మాణం: అభిషేక్‌ పిక్చర్స్‌ 
విడుదల తేదీ: 27 జులై 2018

క్లుప్తంగా చెప్పాలంటే 
తనకు అడ్డు వస్తోందని మునుస్వామి సోదరులు (జగపతిబాబు అండ్‌ టీమ్‌), రాజావారి కుటుంబం (శరత్‌ కుమార్‌ తదితరులు) మొత్తాన్నీ చంపేస్తాడు. ఈ మారణహోమానికి సాక్ష్యం వుండకూడదని, పిల్లలు, పశువుల్ని సైతం మునుస్వామి సోదరులు అంతం చేస్తారు. అయితే రాజావారి కుటుంబానికి సంబంధించి విశ్వ (బెల్లంకొండ శ్రీనివాస్‌) ప్రాణాలతో బయటపడ్తాడు. విదేశాల్లో గేమింగ్‌ డిజైన్‌లో ప్రావీణ్యం సాధించిన విశ్వకి సౌందర్య (పూజా హెగ్దే) పరిచయమవుతుంది. కొన్ని మనస్పర్ధలతో ఇద్దరూ విడిపోతారు. సౌందర్యను వెతుక్కుంటూ విశ్వ, ఇండియాకి వస్తాడు. వచ్చాక, తనకు తెలియకుండానే తన శతృవులపై విశ్వ ప్రతీకారం తీర్చుకుంటాడు. అదెలా జరిగింది? అన్నది తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే 
సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ఈ సినిమాలోనూ సాయి శ్రీనివాస్‌ చాలా కష్టపడ్డాడు. డాన్సులు అదరగొట్టేశాడు, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ కోసం రిస్క్‌ చేశాడు, ఎమోషనల్‌ సీన్స్‌లో రాణించాడు. రొమాంటిక్‌గానూ సత్తా చాటాడు. మాస్‌ని మెప్పించేందుకోసం సాయిశ్రీనివాస్‌ పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తుంది. నటుడిగా ఈ సినిమాతో ఇంకొన్ని మార్కులు అదనంగా వేయించుకుంటాడు సాయి శ్రీనివాస్‌.

హీరోయిన్‌ పూజా హెగ్దే నటన పరంగా ఓకే అన్పిస్తుంది. పాటల్లో సాయిశ్రీనివాస్‌కి పోటీగా డాన్సులేసింది. గ్లామరస్‌గానూ కన్పించింది. అయితే అక్కడక్కడా బక్క చిక్కిపోయినట్లు కన్పించడం ఓ మైనస్‌గా చెప్పుకోవాలి.

జగపతిబాబు మరోమారు తనదైన విలనిజంతో ఆకట్టుకున్నారు. వేమన శతకాలు చెబుతూ, విలనిజాన్ని పండించడం ద్వారా జగపతిబాబు కొత్త తరహాలో అన్పిస్తారు. వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పోసాని, రావు రమేష్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే, తారాగణం చాలా ఎక్కువగానే వుంది. శరత్‌కుమార్‌, మీనా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 
కథ కొత్తదేమీ కాకపోయినా, కాన్సెప్ట్‌ పరంగా ఎట్రాక్ట్‌ చేస్తుంది. స్క్రీన్‌ప్లే యాంగిల్‌లో చూస్తే అక్కడక్కడా హిక్కప్స్‌ కన్పిస్తాయి. ఎడిటింగ్‌ ఓకే, ఇంకాస్త బెటర్‌గా వుండాల్సింది. మాటలు బాగున్నాయి. సంగీతం ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గ్రాఫిక్స్‌ ఆకట్టుకుంటాయి. నిర్మాణపు విలువల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని చాలా రిచ్‌గా రూపొందించారు.

మాస్‌ ఆడియన్సే టార్గెట్‌గా చేసుకుని, ఓ మామూలు కథకి కొత్త కాన్సెప్ట్‌ని జోడించి.. ఓ కొత్త ప్రయత్నం అనదగ్గ రీతిలో సినిమాని రూపొందించారు. ఈ క్రమంలో 'కమర్షియల్‌ టచ్‌' కోసం చేసిన ప్రయత్నాలు ఇబ్బందికరంగా మారాయి. సీరియస్‌గా కథ సాగుతున్నప్పుడు పాటలు వచ్చి డిస్టర్బ్‌ చేయడం పెద్ద మైనస్‌. పంచభూతాల్ని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా సినిమా ఓ మోస్తరుగా ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. మాస్‌ మెచ్చే అంశాలున్నా, స్పీడ్‌ బ్రేకర్స్‌లా వచ్చే పాటలు.. సినిమా వేగాన్ని తగ్గించేశాయి. పాటల్లో రిచ్‌నెస్‌ని సైతం ఇబ్బందిగా ఫీలయ్యే పరిస్థితి. ఓవరాల్‌గా ఓ మంచి అనుభూతిని అయితే సినిమా కల్గిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
పంచభూతాలే సాక్ష్యం

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka