Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

స్మార్ట్‌ బూచాళ్లు దోచేస్తారు జాగ్రత్త.!

smart mobile use only smart

మనం మెలకువగా ఉన్నప్పుడే మనకి తెలియకుండా మన అండర్‌వేర్‌ని ఎవరైనా కొట్టేయగలరా? ఈ ఆలోచన చుట్టూ చాలా సినిమాల్లో చాలా కామెడీ సీన్లు వచ్చాయి. వినడానికి ఫన్నీగా ఉంటుంది. ఒంటి మీద దుస్తులేం కర్మ. ఒంట్లోని అవయవాలైన కిడ్నీలు, లివర్‌, హార్ట్స్‌ని కూడా కొల్లగొట్టేసే దొంగలు పడ్డారు సమాజంలో. ఇది ఫిజికల్‌ ఎటాక్‌. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నారు స్మార్ట్‌ బూచాళ్లు. మీ బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు మీకు తెలియకుండా కాచేస్తున్నారు. మీ చేతిలో ఉన్న మొబైల్‌ మీ చేతిలోనే ఉంటుంది. కానీ అది ఇంకొకరు చెప్పినట్లు నడుచుకుంటుంది. స్క్రీన్‌ యాక్టివ్‌గా లేదు కదా. ఏమవుతుందిలే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అప్పుడూ మీ మొబైల్‌ పని చేస్తుంది. అందులోని కెమెరా పని చేస్తుంది. వాయిస్‌ రికార్డర్‌ పని చేస్తుంది. అలా పని చేసేలా వేరొకరు మీ ఫోన్‌ని కంట్రోల్‌ చేస్తారు. ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

అందుకు తగ్గట్లుగా కుప్పలు తెప్పలుగా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.  పొరపాటున ఈ బెడ్‌రూంలో ఫోన్‌ని అజాగ్రత్తగా ఉంచారో నాలుగు గోడల మధ్య జరిగే ప్రతీ విషయం మీ ఫోన్‌ ద్వారా రికార్దై చేరకూడని చోటుకు చేరిపోతుంది. చెన్నైలో ఓ యువకుడు ఈ టెక్నాలజీ పైత్యంతో 80 మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. బాధితుల్లో నిందితుడి సోదరి కూడా ఉంది. వావి వరసలు మర్చిపోయి నేటి యువత ఎలా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. మీ ఫోన్‌ మామూలుగానే కనిపిస్తుంది. అందులో మీకెలాంటి అనుమానమూ రాదు. కానీ మీకు తెలియకుండానే మీ ఫోన్‌లో అన్నీ జరిగిపోవడం వాటి టెక్నిక్‌. మొదట్లో బ్యాంకింగ్‌ క్రైమ్స్‌ కోసం హ్యాకర్స్‌ సరికొత్త టెక్నాలజీని అభివృద్ది చేసుకునేవారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్న సమాచారమ్‌తో ఎవరికి వారే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

ఈ జాడ్యానికిి మందు లేదా.? 'ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌'. రోగం వచ్చాక మందు వెతుక్కునేదానికన్నా, రోగం రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. యాప్స్‌ స్టోర్‌లోకి వెళ్లి కనిపించిన ప్రతీ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేయడం, వచ్చిన ప్రతీ మెసేజ్‌నీ ఓపెన్‌ చేసి అందులో లింక్స్‌ని క్లిక్‌ చేయడం, ఇతరుల చేతికి మీ ఫోన్‌ ఇవ్వడం, వాట్సప్‌ వంటి యాప్స్‌లో ఇబ్బడి ముబ్బడిగా గ్రూప్స్‌ క్రియేట్‌ చేయడం లేదా గ్రూప్స్‌లో చేరడం, అపరిచితుల నుండి వచ్చే కాల్స్‌ని అటెండ్‌ చేసి, వారు చెప్పినట్లు మీ వివరాల్ని అప్పగించేయడం, ఫోన్‌లో సమస్యలు వచ్చినప్పుడు రోడ్డు పక్కన కనిపించే రిపేర్‌ సెంటర్స్‌కి ఫోన్‌ ఇచ్చి రావడం.. ఇలా మీరు చేసే చిన్న చిన్న, పెద్ద పెద్ద పొరపాట్లు మిమ్మల్ని బజారుకీడ్చేస్తాయి. త'స్మార్ట్‌' జాగ్రత్త.! మీరు వాడుతున్నది 'స్మార్ట్‌ ఫోన్‌' అంతే స్మార్ట్‌గా దాన్ని వాడండి.!

మరిన్ని యువతరం
kik challenge