Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

సినిమాల నుంచి సీఎం పీఠం దాకా!

From the movies to the top of the page.

రాజకీయం అంటే రొచ్చు. ఓ పదేళ్ల కుర్రోడు రాజకీయం అంటే ఏంటి నాన్నా అనడిగితే, 'నీకెందుకురా, నీ క్లాసు పుస్తకాలు చదువుకో..' అని తల్లితండ్రులు చెప్పారు చెబుతున్నారు. చెబుతూనే ఉంటారు. సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని ఎంత పరుగులు పెట్టిస్తున్నా దాంతో పాటే పరుగెత్తడం ఒక్కటే మనిషి జీవితానికి సార్ధకత కాదు. మనం మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం, పాలకులు, రాజకీయాలు ఇవన్నీ మన జీవితంలో అంతర్భాగం. ఇదివరకటిలా నాకు రాజకీయాలతో సంబంధం ఏంటి అనుకునే పరిస్థితి యువతలో ఇప్పుడు లేదు. మారిన పరిస్థితులు యువతను రాజకీయాల వైపు మళ్లిస్తున్నాయి. అయితే రాజకీయాల్లోకి చాలా మంది వెళ్లేది సంపాదన కోసమే. అయితే అందరూ అలా కాదు, ఈ కుళ్లు రాజకీయాలు కడిగి పారేద్దామనుకుంటున్నారు కొందరు. అలాంటి వారికి కొంతమంది రాజకీయ నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

వారిని రోల్‌ మోడల్స్‌గా తీసుకుంటున్నారు. తరానికీ, తరానికీ రాజకీయాలు చాలా మారిపోతున్నాయి. ఒకప్పటి క్లీన్‌ రాజకీయాల్ని ఇప్పుడు ఆశించలేం.  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణం తర్వాత దేశమంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆయన రాజకీయ ప్రస్థానమే. 80ఏళ్లు ఆయన రాజకీయాలకు తన జీవితం అంకితం చేశారు. అలాగని తనకిష్టమైన సినిమాల్ని ఆయన వదులుకోలేదు. సినిమా నుండి, సీఎం కుర్చీ దాకా ఎదిగారాయన. దేశమంతా ఆయన గురించి మాట్లాడుకునేలా చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల సందడి ఎక్కువ. ఎమ్‌జీఆర్‌, జయలలిత సినీ నేపథ్యంలో రాజకీయ నాయకులైనవారే. విజయ్‌కాంత్‌, శరత్‌కుమార్‌, కమల్‌హాసన్‌లాంటి వారు సినీ నేపథ్యం నుండి రాజకీయం వైపు చూశారు. చూస్తున్నారు. తెలుగు నాట స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయాలకు కొత్తర్ధం చెప్పారు. సినీ నటుల్ని పగటి వేషగాళ్లలా ఎగతాళి చేయడం సులువే. కానీ ఎన్టీఆర్‌, ఎమ్‌జీఆర్‌, కరుణానిధి, జయలలితలాంటి వాళ్ల గురించి తెలుసుకుంటే, సినిమా పైన గౌరవం పెరుగుతుంది. 

ఓ స్టార్‌ హీరో స్టైల్‌గా సిగరెట్‌ తాగాడంటే యూత్‌ ఫాలో అవుతోంది. హీరోయిన్‌ షార్ట్‌ డ్రస్సు వేసుకుని కనిపిస్తే, ఆ డ్రస్సింగ్‌ని అలవాటు చేసుకుంటాం. రాజకీయం అంటే మనల్ని శాసించేది. మన భవిష్యత్తును నిర్ణయించేది. మరి మనమెందుకు రాజకీయాల పట్ల ఆశక్తి పెంచుకోకూడదు. ఈ భావన ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తోంది. ఆనాటి రాజకీయ వేత్తలు తమ జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఆ అంకిత భావం పెంచుకుంటే తప్ప రాజకీయాల్లోకి వెళ్లడం, వెళ్లాలనే తాపత్రయం సమంజసం కానే కాదు. రాజకీయం అంటే సేవ. అది మన కోసం మనం చేసుకునే సేవ. బురద కాదు, రొచ్చు కాదు, రొంపి కాదు. ఏ కొద్ది మంది రాజకీయ నాయకులో చేసే తప్పిదానికి మొత్తం రాజకీయమంటేనే ఏహ్య భావం పెంచుకోకూడదు. ఇది నేటి యువత గమనించాల్సిన సత్యం. 

మరిన్ని యువతరం
What are you 'boss'?