Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope October 18 - October 24

ఈ సంచికలో >> శీర్షికలు >>

మొక్కుబడి - బన్ను

Mokkubadi

ఫంక్షన్లకు పిలవటం, బంధుమిత్రులతో ఫంక్షన్ కళకళలాడటం మన ఆచారం. అది కాలక్రమేణా మన యాంత్రిక జీవనంలో ఎలా మారిందంటే... 'పిలవకపోతే బాగోదేమో' అని ఫోన్ చేసి పిలవటం, వెళ్ళే వాళ్ళు కూడా 'వెళ్ళకపోతే బాగోదేమో' అని వెళ్ళి ముఖ్యమైన వాళ్ళకి మొహం చూపించి 'మేమొచ్చాం' అంటూ హాజరు వేయించుకొని మాయమవుతున్నారు. ఇది ఒక 'మొక్కుబడి' గా మారిందనటంలో సందేహం లేదు.

ఇంతకు ముందు 'పెళ్ళి భోజనం' కి వెళ్ళటం చాలా ఆనందంగా, ఇష్టంగా వెళ్ళి కడుపునిండా తిని, వధూ వరులను ఆశీర్వదించి వచ్చేవారు. బంతి భోజనం లో కూర్చుని అందరూ తినేవరకు ఆగి చేతులు కడుక్కోడానికి వెళ్ళేవారు. ఇప్పుడొచ్చిన 'బఫే' సిస్టమ్ లో ప్లేటు పట్టుకొని కేటిరింగ్ వాళ్ళు వేసే పదార్ధాలు (జైల్లో ఖైదీలకు పెట్టేట్టు వాళ్ళు పదార్ధాలని విసరటం గమనార్హం!) గబగబా తినేసి 'తిన్నాం' అనిపించుకుని బయల్దేరుతున్నారు. పెళ్ళి భోజనంలో ఎన్ని వెరైటీలు పెడ్తే అంత గొప్పగా భావిస్తున్నారు కానీ అందులో ఒక్కటైనా రుచిగా వుందాని చూడటం లేదు!

ఈ మొక్కుబడి పిలుపులు మాని, ఆప్యాయతతో పిలవాలనుకున్న వాళ్ళనే పిలుస్తే వారు ఆప్యాయంగా వచ్చి ఆశీర్వచనాలు అందజేస్తారని నా అభిప్రాయం!

మరిన్ని శీర్షికలు
Book Review - chamatkara shloka manjari