Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

దూసుకెళ్తా - చిత్ర సమీక్ష

Movie Review - Doosukeltha

చిత్రం: దూసుకెళ్తా
తారాగణం: మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, పంకజ్‌ త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, కోట, రావు రమేష్‌, భరత్‌, రఘుబాబు, పోసాని తదితరులు
ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
నిర్మాత: మోహన్‌బాబు
దర్శకత్వం: వీరూ పోట్ల
విడుదల తేదీ: 17 అక్టోబర్‌ 2013

క్లుప్తంగా చెప్పాలంటే:
చిన్నప్పటినుంచీ తనకేం ఇష్టమో అదే చేయడం, నలుగురికి సహాయ పడటం చిన్నా (విష్ణు)కి అలవాటు. అలేఖ్య (లావణ్య) కొన్ని సమస్యలతో తన ఇంటికి దూరమవుతుంది. ఓ సందర్భంలో అలేఖ్యని చిన్నా కలుస్తాడు, ఆమెను సమస్యల నుంచి గట్టెక్కించాలనుకుంటాడు. పనిలో పనిగా ఆమెతో ప్రేమలో పడ్తాడు. చిన్నా కారణంగానే ఫ్యామిలీకి దూరమైన అలేఖ్య, చిన్నాకి దూరంగానే వుండాలనుకుంటుంది. అలేఖ్యని చిన్నా దక్కించుకుంటాడా? ఆమె సమస్యల్ని తీరుస్తాడా? వంటివన్నీ తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే:
మంచు విష్ణు నటనలో మెచ్యూరిటీ ప్రదర్శించాడు. డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ బాగున్నాయి. డాన్సుల్లో రాణించాడు. నటన పరంగా పాత్రకు తగ్గట్టుగా పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. లావణ్య క్యూట్‌గా కన్పించింది. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కిందామెకి. నటన పరంగా బాగానే స్కోర్‌ చేస్తుంది. కామెడీ పార్ట్‌ని బ్రహ్మానందం అవలీలగా లాగించేశాడు. వెన్నెల కిషోర్‌ సూపర్బ్‌. కోట షరామామూలుగానే మంచి పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటాడు. పంకజ్‌ త్రిపాఠి ఓకే. అలీ, రఘుబాబు, భరత్‌ తదితరులు సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచారు.

కమర్షియల్‌ ఫార్ములా మిస్‌ కాకుండా, తనదైన పంథాలో వీరు పొట్ల కథను నడిపించేశాడు. దర్శకుడిగా మంచి మార్కులే కొట్టేస్తాడు. డైలాగులు బాగా పేలాయి. సన్నివేశాలు ఒకదాని తర్వాత ఊహించగలిగేవే అయినా ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవలేదు. పాటల్లో కొరియోగ్రఫీ బాగా సూటయ్యింది. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌ని బాగా డిజైన్‌ చేశారు. ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్‌గా వుంటే బావుండేది. సినిమాకి పెట్టిన ఖర్చు కన్పిస్తుంది. గ్రాండ్‌గా, అందంగా తీర్చిదిద్దారు.

ఒక్క మాటలో చెప్పాలంటే: దూసుకెళ్ళలేదుగానీ..

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with flute nagaraj