Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వుల జల్లు - జయదేవ్

కోటయ్య : కోట గోడ ఎక్కబోతూ, కిందపడి నడ్డి వించుకున్నావా? ఉడుము కాలు జారిందా?
పెంటయ్య : ఉడుము కాలు జారలేదు! దాని నడుముకు కట్టిన తాడు ముడి విడిపోయింది!


కంచి పట్టు పురుగు తండ్రి : ఒరేయ్ అబ్బాయ్... నువ్ చేసుకుంటే మన కులం పిల్లనే చేస్కోవాలి, ఆరణి ధర్మావరాలు మనకి సరిపడవ్!
కంచి పట్టు పురుగు కొడుకు : నేను వరించిన పిల్ల కంచి పట్టుపిల్లే! పైగా జరీ అంచు చీరలు కడుతుంది!!
కంచి పట్టు పురుగు తండ్రి : ఆలస్యం చెయ్యక వెంటనే పెళ్ళి చూపులుకి పోదాం పద!!

సరస్వతి : స్వామీ మీకు బ్రహ్మచెముడు అని నాకు అనుమానంగా వుంది!
బ్రహ్మ : సరస్వతీ... నీ పెదాల కదలికను బట్టీ, నీ చేతి సంజ్ఞలను బట్టీ... నువ్వేదో చెప్పదలచుకుంటున్నావు... కాస్త గట్టిగా చెప్పవా?


మహా విష్ణు : లక్ష్మీ దేవీ... నా వీపుకి చందనం రాస్తున్నావేం?
లక్ష్మీ దేవి : కూర్మావతారం గుర్తొచ్చింది స్వామీ!! మీకు చల్లగా వుంటుందనీ!!


గుడి సాధువు : ఈ వాడలో మనల్ని పిలిచి అన్నం పెట్టేవి మూడే ఇళ్ళు! నువ్వు ఒకే ఇంటికి వెళతావేం?
బజారు సాధువు : మొదటి వీధి ఇంట్లో పులుపెక్కువ వేస్తారు! రెండవ వీధి ఇంట్లో ఉప్పెక్కువ!
గుడి సాధువు : మరి ఆ మూడో వీధి ఇంటి ప్రత్యేకత ఏమిటి?
బజారు సాధువు : ఆ ఇంట్లో వంట చేసేది ఆమె కాదు, ఆయన!!

మరమర శర్మ : వివాహం చేసుకుని, భార్యతో వస్తానని వెళ్ళావ్... ఒక్కడివే తిరిగొచ్చావేం?
గడబిడ వర్మ : అమ్మాయి రాక్షస వివాహానికి మాత్రమే ఒప్పుకుంటానంది!
మరమర శర్మ : సరే ఆ వివాహ పధ్ధతి ప్రకారం, అమ్మాయిని ఎత్తుకుని రావల్సిందే కదా?
గడబిడ వర్మ : అది కుదర్లేదు. ఆ అమ్మాయి ఏనుగంత లావు!!


చెట్టుమీది ఆత్మ : నిన్నెప్పుడూ చూళ్ళేదే? కొత్తగా వొచ్చినట్లున్నావ్!
చెట్టుకింది ఆత్మ : ఔను! ఇవాళే వొచ్చాను!
చెట్టుమీది ఆత్మ : ఏమిటి నీ కథ?
చెట్టుకింది ఆత్మ : జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడం ఎలా అని ఆలోచిస్తూ నడుస్తున్నాను. ఆ వీధిలో వేగంగా ఒక రధం దూసుకు వెళ్ళింది. దాని చక్రం కింద పడ్డాను!!


దిగులు రాజు : మంత్రి వర్యా, నన్ను తన ప్రేమ వలలోకి లాగిన ఆ వగల భామ, నా చేత, సగం సింహాసనం తన సొంతం కావాలని, ప్రమాణం చేయించుకుంది! నాకు దిగులుగా వుంది!!
తెలివి మంత్రి : ఏం భయపడకండి రాజా! మీరు కూర్చునేది కొయ్య సింహాసనమే కదా! దాన్ని సగంగా కోయించి, ఒక భాగం, ఆ వగల భామకి పంపించి, వెళ్ళ గొట్టండి!!


కవివరేణ్యుడు - 1 : ఈ సారి ఏదైనా కవిత, విచిత్రంగా రాసి పట్టుకురమ్మన్నారు!! పట్టుకెళ్ళాను!!
కవివరేణ్యుడు - 2 : ధన, కనక, వస్తు వాహనాలిచ్చారా?
కవివరేణ్యుడు - 1 : లేదు భోజనం మాత్రం వడ్డించి పంపించేశారు!
కవివరేణ్యుడు - 2 : ఇంతకీ ఆ విచిత్రమైన కవిత ఏమిటి? దాని గురించి చెప్పు!
కవివరేణ్యుడు - 1 : విచిత్రంగా వుండాలనడిగారు గదా అని, కవితని తాళ పత్రం మీద గాక, అరిటాకు మీద రాసి పట్టుకెళ్ళాను!!


రాజు : "కబ్జా" అంటే ఏమిటి మంత్రి వర్యా?
మంత్రి : దురాక్రమణ అని అర్ధం మహారాజా! అందువల్లే శత్రురాజు మీ సింహాసనం అధిష్టించాడు! మనం ఈ చెరసాలలో వున్నాం!!

మరిన్ని శీర్షికలు
recipe: bendakaaya masala curry