Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sri Swamy Vivekananda biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (అక్టోబర్ 18 - అక్టోబర్ 24) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్రవారం నాడు ఆలోచనలు అదుపులో చేసుకోవడంలో విఫలం అయ్యే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయంలో ఖర్చును కలిగి ఉంటారు. శని, ఆది, సోమవారాలలో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. మృష్టాన్నభోజనప్రాప్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. మంగళ, బుధవారాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. పనులలో నిదానం అవసరం తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చును కావున జాగ్రత్తలు పాటించుట మంచిది. గురువారం పెద్దల సహకారంతో పనులను పూర్తిచేస్తారు. విజయంను కలిగి ఉంటారు. వారం మొత్తం మీద తలపెట్టిన పనులలో మొదలు చూపిన ఉత్సాహంను చివరి వరకు కొనసాగించే ప్రయత్నం చేయండి. సమయానికి మాత్రం భోజనం చేయుట ఉత్తమం. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట ద్వార మేలు జరుగుతుంది. సోదరులకు మీ ఆలోచనలు తెలియజేయండి. అందరిని కలుపుకొని వెళ్ళుట మేలు. బంధువులను కలిసి సమయాన్ని గడిపే అవకాశం ఉంది.         

వృషభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది, నూతన పనుల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. శని, ఆది, సోమవారాల్లో ఆలోచనలు అధికమయ్యే అవకాశం ఉంది, మానసికంగా ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు కలిగి ఉంటారు. బంధువులతో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. మంగళ, బుధవారాల్లో పనులలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. నూతన పనులను చేపట్టి లాభంను పొందుటకు అవకాశం ఉంది. గురువారం మాటలను పొదుపుగా వాడుట చేత మంచిజరుగుతుంది. నిదానంగా వ్యవహరించుట చేత పనులను కొంత నిదానంగా నైనా పూర్తిచేయగలుగుతారు. వారం మొత్తంమీద నూతన పనులయందు ఉత్సాహంను కలిగి ఉండి పనులలో విజయాన్ని పొందుటకు అవకాశం ఉంది. ప్రయత్న కార్యములయందు విజయాన్ని పొందుతారు సహకారంతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. పనులలో శ్రమను పొందుతారు సర్దుకుపొండి. వినోదములలో ఆసక్తిని కలిగి ఉంటారు. మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకోవడం వలన వివాదములు తగ్గుతాయి. 

మిథున రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున తలెపెట్టిన పనులలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. శని, ఆది, సోమవారాలలో బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. ధనమును వివిధ రూపములుగా పొందుటకు అవకాశం ఉంది. మానసికంగా సంతోషంను కలిగి ఉంటారు. మంగళ, బుధ వారాలలో కొంత ఆలోచనల మూలాన ఇబ్బందులు పొందుతారు. వాటిని అదుపులో ఉంచుకొనే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట ద్వార కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చును. గురువారం మీరు పెద్దల సహకారంతో పనులను పూర్తిచేసే అవకాశం కలదు. నూతన అవకాశాల కోసం చేయు ప్రయత్నం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వారంమొత్తం మీద బంధుమిత్రులతో కలిసి చేయు పనులలో ఖర్చులు కలుగుతాయి. మీరు ఊహించని విధంగా ధనమును ఖర్చుపెట్టు అవకాశం కలదు. నూతనవస్త్ర ప్రాప్తిని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఉద్యోగంలో సామాన్యంగా ఉంటుంది నిదానంగా వ్యవహరించుట సూచన. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చును. 

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున సంతానంతో చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి. వారితో నిదానంగా వ్యవహరించుట మంచిది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి మేలుజరుగుతుంది. శని, ఆది, సోమవారాల్లో ప్రయత్నాల్లో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనుల మూలాన గౌరవాన్ని పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను కలిగి ఉంటారు. మంగళ, బుధగురువారాల్లో భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. నూతన పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంది. ఇష్టమైన పనులలో సమయాన్ని గడుపుతారు. గురువారం పనులలో శ్రమను కలిగి ఉంటారు. ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. వారం మొత్తంమీద కుటుంబంలో కలహములు కలుగుటకు అవకాశం కలదు. సర్దుబాటు విధానం కలిగి ఉండుట మేలుచేస్తుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. స్నేహితులతో కలిసి చేయు పనులలో జాగ్రత్తగా వ్యవహరించుట వలన తప్పక మేలుజరుగుతుంది. మాత్రువర్గం నుండి వార్తను వినే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. భోజనం విషయంలో శ్రద్ధను, ఆసక్తిని కలిగి ఉంటారు. 
  

సింహ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు చేపట్టుట మేలుచేస్తుంది. శని, ఆది, సోమవారాల్లో కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేపట్టుట మంచిది. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. అధికారులతో నిదానంగా వ్యవహరించుట చేయుట ఉత్తమం. మంగళ, బుధ వారాల్లో అనుకున్న పనులను సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అవకాశాలు కలిసి వచ్చే అవకాశం కలదు. పెద్దలనుండి సహకారం అందుతుంది. గురువారాల్లో మంచి నిర్ణయాలు తీసుకొనే ప్రయత్నం చేయండి మేలు జరుగుతుంది. వారం మొత్తంమీద బంధుమిత్రులను కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ధనము విషయంలో సంతృప్తిని కలిగి ఉంటారు. తలపెట్టిన పనులలో ఉత్సాహంను కలిగి ఉంటారు. అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు కాకపోతే శ్రమను కలిగి ఉంటారు. గాయములు అగుటకు అవకాశం కలదు కావున జాగ్రత్తగా ఉండుట సూచన. ఉద్యోగంలో పనిభారంను కలిగి ఉంటారు. నిదానంగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయండి. కుటుంబసభ్యులకు సమయాన్ని కేటాయించుట వలన మేలుజరుగుతుంది.

 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఆర్థికంగా బాగుంటుంది, పనులలో ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశం కలదు. శని, ఆది, సోమవారాల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. మోకాళ్ళ నొప్పులు భాదించే అవకాశం కలదు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు కలుగుతాయి. మంగళ, బుధవారాల్లో కుటుంబంలో మీ ఆలోచనల పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, కావున అందరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. అందువలన చిన్న చిన్న సమస్యలు అధిగమించే అవకాశం ఉంది. గురువారం రోజున నూతన ప్రయత్నాల కోసం చేయు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం కలదు. వారంమొత్తం మీద వ్యాపారంలో కాని ఉద్యోగంలో కాని సమస్యలు కలుగుతాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ప్రయాణాలలో సమస్యలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద కూడదు. మంచివారితో మీకున్న పరిచయాల మూలాన మేలుజరుగుతుంది. ప్రతి పనిని బాగా ఆలోచించి చేపట్టుట ద్వార లాభంను పొందే అవకాశం కలదు. 

తులా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఇతరులకు సేవచేయాలనే తలంపును కలిగి ఉంటారు. నూతన అవకాశాలు కలుగుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుటుంది. శని, ఆది, సోమవారాల్లో తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆలోచనల మూలాన నలుగురిలో గుర్తింపును పొందు అవకాశం కలదు. కుటుంబంలో సంతోషంను పొందుటకు అవకాశం ఉంది. నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. మంగళ, బుధ వారాల్లో కొంత నిదానంగా వ్యవహరించుట మూలాన మేలు జరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జగ్రత్తగా ఉండుట మేలు. ముఖ్యంగా భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. గురువారం రోజున కుటుంబంలో కొంత విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. సర్దుబాటు విధానం అవలంబించుట మేలు. వారం మొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలిగే అవకాశం కలదు, కావున జాగ్రత్త. నచ్చిన పనుల కోసం సమయాన్ని గడిపే అవకాశం కలదు. చంచల మనస్సును కలిగి ఉంటారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది వారి ఆలోచనలు పాటించే ప్రయత్నం చేయండి.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున అశుభవార్తను వినే అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండుట మంచిది. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. శని, ఆది, సోమవారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో బాగున్నను అనుకోని ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషంను పొందుతారు వారితో సమయాన్ని గడుపుతారు. మంగళ, బుధ వారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. నిదానంగా ఆలోచించి పనులను చేపట్టుట చేత వాటిలో లాభంను పొందుటకు అవకాశం ఉంది. స్త్రీ/పురష సౌఖ్యంను కలిగి ఉంటారు. నూతన అవకాశాల కోసం ప్రయత్నాలు ఆరంభిస్తారు. గురువారం మీరు స్వల్ప ఆరోగ్య సమస్యలు పొందుతారు జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వారం మొత్తం మీద సమయానికి భోజనం చేయుట మంచిది. బంధు, మిత్రులతో చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశం ఉంది. నిదానంగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో మీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చును. కొంత సమస్యలు కలుగుతాయి. సంచారం చేయుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుటలో ఇబ్బందులు తలెత్తుతాయి. నిదానంగా వ్యవహరించుట నోటిని అదుపులో ఉంచుకొనుట వలన తప్పక మేలు జరుగుతుంది.


ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఫలితాలు కొంత వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. ఈకారణం చేత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చును. శని, ఆది, సోమవారాల్లో ఆరోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. పనులు నిదానంగా సాగుతాయి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే విజయం కలుగుతుంది. పెద్దల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం తప్పక మేలు చేస్తుంది. మంగళ, బుధవారాల్లో దూరప్రదేశం నుండి అనుకూలమైన వార్తను వింటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. నూతన పనులను చేపడుతారు. గురువారం రోజున చేపట్టిన పనుల మూలాన గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. పనులలో లాభంను తప్పక పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. వారం మొత్తంమీద భోజనం విషయంలో ప్రత్యేకశ్రద్ధను కలిగి ఉంటారు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన వారి అభినందనలను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. స్థానచలనం కలిగే అవకాశం కలదు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం కలదు జాగ్రత్త.

మకర రాశి

ఈవారం మీరు శుక్రవారం రోజున ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. నచ్చిన పనులను చేపడుతారు వాటిని పూర్తిచేస్తారు. శని, ఆది, సోమవారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్నను అధికమైన ఖర్చులు పొందుట మూలాన ఒకింత ఆందోళన చెందుతారు. ప్రతిపనిని ఆచితూచి వ్యవహరించుట వలన కొంత మేలుజరుగుతుంది. మంగళ, బుధ, గురువారాల్లో ఆశించిన ఫలితాల్లో కొంత నిరుత్సాహంను పొందుటకు అవకాశం కలదు. పనులలో అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన తప్పక పనులను ముందుకు తీసుకు వెళ్ళు అవకాశం ఉంది. వారం మొత్తంమీద అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు. బంధుమిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. రాజకీయవ్యవహరాలలో జయంను పొందుతారు. ప్రయాణాలు అధికంగా చేయుట మూలన సమస్యలు పొందుతారు. కావున ప్రయాణాలను వాయిదా వేయుట మంచిది. కుటుంబంలో కొంత ఇబ్బందిని పొందుతారు. నిదానంగా వ్యవహరించుట మేలు. అభీష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో ఆసక్తిని కలిగి ఉంటారు. అందుకోసం సమయాన్ని కేటాయించే అవకాశం కలదు.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకండి. మాటలను పొదుపుగా వాడుట వలన మేలు జరుగుతుంది. శని, ఆది, సోమవారాల్లో ఇష్టమైన వ్యక్తులనుకలిసే అవకాశం కలదు. నచ్చిన పనులను చేపడుతారు. వాటి కోసం సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి. ధనముకు సంబంధించిన విషయాల్లో కొత్త పనులను చేపడుతారు. మంగళ, బుధ వారాల్లో పనులకు సంబంధించిన విషయాల్లో కొంత ఆందోళన చెందుతారు. పెద్దల సూచనలు పాటించుట చేత మేలు జరుగుతుంది. కుటుంబంలో అందరి ఆలోచనలు వినుట ఉత్తమం. గురువారం ఒకవార్త కొంత భాధకు గురిచేసే అవకాశం కలదు. తలపెట్టిన పనులు అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళలేక పోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది తప్పక పోవచ్చును. వారం మొత్తంమీద అనుకోని ఖర్చును పొందుతారు. వ్యయాన్ని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయండి. కోపాన్ని తగ్గించుకోవడం సూచన. పనులను ఆరంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయుట మేలు. ఉద్యోగంలో మాత్రం కొంత నిదానంగా వ్యవహరించుట మంచిది. రాజకీయ పరమైన విషయాల్లో బాగుంటుంది.  

మీన రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. శని, ఆది, సోమవారాల్లో మాటలను జాగ్రత్తగా వాడుట సూచన. పనులను చేపట్టు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కలదు తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. మంగళ, బుధ వారాల్లో నచ్చిన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. మిత్రులతో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయాలనే తలంపును కలిగి ఉంటారు. గురువారం ఆశించిన ఫలితాలు రాకపోవడం చేత మానసికంగా ఆందోళన చెందుతారు. ప్రయత్నాల్లో నిరుత్సాహంను పొందుతారు. వారం మొత్తంమీద పనులలో శ్రమను పొందుతారు. అనుకోని కష్టములు కలుగుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు చేయకండి కొంతకాలం వాయిదా వేయండి మంచిది. ఇతరులకు సేవ చేయాలనే తలంపును కలిగి ఉంటారు. నూతన వస్త్ర ప్రాప్తిని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు అప్పుడప్పుడు సర్దుబాటు అవసరం. స్థిరమైన ఆలోచనలు చేసే ప్రయత్నం చేయుట మంచిది. గురువులను గౌరవించే ప్రయత్నం చేయండి. వారి మాటలను పాటించుట ఉత్తమం.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Mokkubadi