Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

సమంత టర్న్‌ మామూలుగా లేదులే.!

samanta turn

ఈ ఏడాది సమంతకు తిరుగే లేదు. ఏది పడితే అదే బంగారమైపోయింది. సమంత నటించిన అన్ని సినిమాలూ సంచలన విజయాలు అందుకున్నాయి. 'రంగస్థలం'తో మొదలు పెట్టిన సమంత టర్న్‌ ఈ ఏడాది వరుసగా 'మహానటి', 'అభిమన్యుడు' తదితర సినిమాలతో సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అందుకుంది. ఇప్పుడు సమంత లీడ్‌ రోల్‌లో 'యూటర్న్‌' చిత్రం రాబోతోంది. ఈ సినిమాని సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన 'యూటర్న్‌' చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌గా రూపొందుతోంది. ఒరిజినల్‌ని రూపొందించిన పవన్‌ కుమార్‌ ఈ చిత్రానికి తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

'రంగస్థలం'లో రామలక్ష్మిగా సమంత తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు, తన కెరీర్‌లోనే విభిన్న పాత్ర అది. అంతే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఆ పాత్రతో సమంత. అయితే అంతకు మించి ప్రాధాన్యత ఉన్న పాత్రలో సమంత కనిపించబోతోంది యూటర్న్‌ చిత్రంలో. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో, డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకోనుంది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సమంత పాత్రకు కూడా అంతే మంచి రెస్పాన్స్‌ వస్తుందనీ చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
Chaitanya the chariot is no more