Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
YSR 's trip on silver screen

ఈ సంచికలో >> సినిమా >>

హాఫ్‌ సెంచరీ దాటిన 'ఆర్‌ఎక్స్‌100'

Half century crossed the 'RX100'

2018లో అనూహ్యంగా లాభాలు ఆర్జించిన సినిమా 'ఆర్‌ఎక్స్‌ 100'. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీకి ఫుల్‌ డోస్‌లో గ్లామర్‌ యాడ్‌ చేసి సమర్ధవంతంగా తెరకెక్కించాడు డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మకు శిష్యుడు ఈ అజయ్‌ భూపతి. గురువులాగే తొలి సినిమాకే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ప్రతీ ఫ్రేమ్‌లోనూ గురువు రామ్‌ గోపాల్‌ వర్మ మార్క్‌ ప్రత్యక్షంగా కనిపించింది. కానీ టేకింగ్‌లో కొత్తదనం చూపించి, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాడు. సినిమాకి ఎంచుకున్న కాస్టింగ్‌ ముఖ్యంగా హీరో కార్తికేయ, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌లు సినిమాని ఓ స్థాయిలో నిలబెట్టేశారు.

హీరోయిన్‌ పాత్రకు ఎక్కువ వెయిట్‌ ఉండేలా డిజైన్‌ చేశాడు. పాయల్‌ కూడా తన గ్లామర్‌తో అన్ని వర్గాల వారినీ, ముఖ్యంగా యూత్‌ని ఎక్కువగా ధియేటర్స్‌కి రప్పించేలా చేయడంతో, తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ మొత్తంలో లాభాలు ఆర్జించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'అర్జున్‌రెడ్డి' సినిమా తర్వాత ఈ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారంతా. అలా 50 రోజులుగా సమర్ధవంతంగా ధియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది 'ఆర్‌ఎక్స్‌ 100'. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam