Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
speed trils..but kills

ఈ సంచికలో >> యువతరం >>

విజయాన్ని సాధించటం ఎలా?

How to get success

మీరు జీవితంలోని ప్రతి ఒక్క అంశాన్ని విజయవంతంగా అధిగమించగలరు, అయితే మీరు జీవితాన్ని ఆ విధంగా చూస్తేనే. లేకపోతే అది తొట్రుబాటు ప్రక్రియ అవుతుంది. విజయం అంటే మీరు ఇతరుల కంటే వేగంగా నడుస్తున్నారని అర్థం. ఇతరుల కంటే మీరు వేగంగా నడుస్తుంటే మరియు మీ ద్రుష్టికోణం మంచిది కాకపోతే, మీరు తప్పకుండా ఎక్కువగా ఒత్తిడికి గురవుతారుఎందుకంటే మీరు ప్రతీదానితో ఢీ కొట్టాలని చూస్తున్నారు.

మీరు దేనినైనా విజయవంతంగా చేయాలంటే, మీ అర్హత లెక్కలోకి రాదు. మీ చుట్టూ ఉన్న యథార్థ  సంఘటనల పట్ల మీ ద్రుష్టికోణ స్పష్టతపై ఆది ఆధారపడి ఉంటుంది. మీరు ఇప్పుడు దీనిని సరిగా చూస్తే, మీరు ఇప్పుడు లాటరీ టిక్కెట్ అమ్మి డబ్బు సంపాదించవచ్చు. మీరు రేపటిని చాలా స్పష్టంగా చూస్తే, రేపు తిరిగి అమ్మడానికి మీరు ప్లాన్ ని కొంటున్నారు. మీరు 50 సంవత్సరాల తరువాతను చాలా స్పష్టంగా చూస్తే, మీరు పూర్తిగా భిన్నమైన పనులే చేస్తారు.

తప్పు సమయంలో తప్పు పని

బాగా అర్హత, మేధస్సు మరియు సామర్థ్యం గల ప్రజలు కూడా విఫలమైన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు కొన్నిపనులను తమ జీవితంలో కొన్ని సందర్భాలలో గ్రహించడంలో విఫలమవుతారు. మీరు తప్పు ఆస్తిని తగని సమయంలోకొంటారు. మీరు తగని సమయంలో సరికాని వ్యాపారం చేస్తారు. మీరు తప్పు పనిని చెయ్యటానికి అనర్హుల్నిఎన్నుకుంటారు. ఇదంతా వైఫల్యమే మరియు ఇది విజయం కూడా.

విజయవంతమైన ఎంతోమంది అసాధారణమైన మేధావులు కాకపోవచ్చు, కానీ వాళ్ళ దృష్టికోణంలో స్పష్టత ఏర్పరచుకునారు. మీరు మాట్లాడే విషయాన్ని అప్పటికప్పుడే వారు గ్రహించి, మీకు సరైన రీతిలో సమాధానాన్ని ఇవ్వగలరు. కాబట్టి, విజయాన్ని కాంక్షించకండి, సమర్థతను కాంక్షించండి. మీరు ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో చూడండి. మీరు గొప్ప సామర్ధ్యం కలవారైతే, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాగైనా విజయాన్ని సాధిస్తారు. మీరు అసాధారణ సామర్థ్యం కలవారైతే, మీరు మీ సమర్థతలో ఒక స్థాయిని చేరగలిగితే,  మీరు విజయాన్ని లక్ష్యంగా చూడవలసిన అవసరము లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినవిజయమే మీ వెంట వస్తుంది.

మరిన్ని యువతరం
Smartly loses