Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The robot arrived, brought the sensations!

ఈ సంచికలో >> సినిమా >>

రష్మికా ఇంత పెద్ద షాకిచ్చిందేంటీ

Rashikanta is such a big shock.

టాలీవుడ్‌ సెన్సేషన్‌ రష్మికా మండన్నా ఓ పెద్ద షాకిచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ఆల్రెడీ మ్యారేజ్‌ ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. కన్నడలో తొలి సినిమా హీరో రక్షిత్‌ శెట్టితో ప్రేమ, పెద్దల అంగీకారంతో పెళ్లి సెటిలైపోయాయ్‌. గతేడాది వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అయితే వీరి పెళ్లి బ్రేకప్‌ అయ్యిందంటూ ఈ మధ్య ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. రక్షిత్‌ శెట్టితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామనీ ఆయనపై రష్మికా తల్లి ఆరోపిస్తోంది. అయితే రక్షిత్‌ శెట్టి మాత్రం ఈ విషయమై రష్మికాని నిందించొద్దు.. అని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తాజాగా ఇదే విషయమై రష్మికా కూడా స్పందించింది. అనుకోని సంఘటనలు చాలా జరిగాయ్‌. త్వరలోనే అన్ని విషయాల మీద క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనను పక్కన పెట్టి, కెరీర్‌ మీదే పూర్తిగా దృష్టి పెట్టాను.. అని రష్మికా చెప్పింది. ఇక కెరీర్‌ విషయానికి వస్తే, ప్రస్తుతం తెలుగులో చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. 

రష్మికా. రెండు సూపర్‌హిట్స్‌ కొట్టి, మరో హిట్‌కి రెడీ అవుతోంది. ఆమె నటించిన 'దేవదాస్‌' ఈ నెల 27న విడుదలకు రెడీగా ఉంది. విజయ్‌దేవరకొండతో నటిస్తున్న 'డియర్‌ కామ్రేడ్‌' సెట్స్‌పై ఉంది. యంగ్‌ హీరో శర్వానంద్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇంకా మరెన్నో క్రేజీ ఆఫర్లు ఆమెను వరించడానికి రెడీగా ఉన్నాయి. ఈ తరుణంలో తన కెరీర్‌కి పెళ్లి ఓ అడ్డంకి కాకూడదని రష్మికా భావిస్తోందేమో. గతంలో కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని పలువురు ముద్దుగుమ్మలు ఎంగేజ్‌మెంట్‌నీ, వివాహ బంధాన్ని రద్దు చేసుకున్న సంగతులు విదితమే. ఆ కోవలో తాజాగా రష్మికా పేరు కూడా చేరుతుందేమో.

మరిన్ని సినిమా కబుర్లు
piggy very special