Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The original health of all is eaten

ఈ సంచికలో >> శీర్షికలు >>

మన ఆరోగ్యం మన చేతిలో.. - హనుమాన్ ప్రసాద్

Our health is in our hands ..

మన జీర్ణవ్యవస్థకు ప్రధాన అడ్డంకి అసిడిటి. మన శరీరం లో పి.హెచ్ లెవల్స్ "7" కంటే తక్కువగా వున్నప్పుడు దీన్ని "అసిడిక్" అంటారు.పి.హెచ్ లెవల్ 7 కంటే ఎక్కువ వుంటే, అది "ఆల్కలైన్" అని పిలుస్తారు.

శరీరం లో ఆల్కలైన్ ఎక్కువ వుంటే , జీవ ప్రక్రియలు చాలా చురుకుగా వుంటాయి. ఇవి వుండాలంటే, పి.హెచ్ లెవల్స్ వున్న ఆహారాన్ని మనం తీసుకుంటే, వాటిని "ఆల్కలైన్" ఆహారాలు అంటారు.

ఆల్కలైన్ డైట్ మనం పాటించగగితే, అనారోగ్యాన్ని దూరంగా తరిమికొట్టవచ్చు. ఆల్కలైన్ డైట్ అంటే

ఉల్లిపాయలు, కీరదోస, బీట్రూట్ - కాయగూరలు
ద్రాక్ష, పైనాపిల్, కమలాపండు - పండ్లు
అవకాడో దాల్చినచెక్క, అల్లం, సముద్రపు ఉప్పు -  

పైన  పేర్కొన్న ఆల్కలైన్ డైట్ పాటించడం వలన మనకు ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు:

_ అధిక బరువు, అజీర్తి, అలసట, చిగురు వాపు, కిడ్నీ, మూత్ర సంబంద వ్యాధులు, చర్మ వ్యాధులు మొదలగు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
డైట్ అనగా ఒక క్రమమైన పద్ధతిలో , మన ఆహార సేవన విధానం లేక ఒక ఆరోగ్యకరమైన జీవిత విధానం అని కూడ అనవచ్చు.
డైట్ లో వివిధ రకాలు వున్నా, ఇప్పుడు వున్న ఆధునిక జీవితం లో ప్రధానం గా కొన్ని కిందవాటిని పేర్కొనవచ్చును.

1. ATKINS DIET
2. THE ZONE DIET
3. KETOGENIC DIET

అని మనం వివిధ రకాలుగా వీటిని పిలుచుకుని పాటించడం జరుగుతున్నా... "అతిసర్వత్ర వజ్రయేత్" అన్నట్లు.. మితమైన ఆహారమే,  పరమౌషధం.

ఎవరో మహానుభావుడు అన్నట్లు" ఆరోగ్యము యావత్తూ పోయి.. ఆ రోగము మిగిలె!! అన్నట్లు మనం ఎన్ని రకాల డైట్లు పాటించినా కూడా ప్రస్తుతం మనం అవలంబిస్తున్న ఆధునిక జీవనశైలి, ఆహారపద్ధతులు, వివిధ రకములైన ఆహార రుచులు మన సాంప్రదాయమైన ఆహారం చేయు మేలును చేయలేవు.
 
ఈ ఆధునిక డైట్ వల్ల వివిధ సంస్థలు వాటి ఉత్పత్తులను బాగా మార్కెట్ చేసుకొని వారి సంపాదనలో డైట్ పాటించడం లేదు!
ప్రజలు వెర్రిగా "జీరో సైజ్ " అని, మరొకటి అని ఇలాంటి డైట్ ప్రాక్టీస్ ల వల్ల అనారోగ్యాన్ని "కొని" తెచ్చుకున్టూ తమ ఆర్ధిక వనరులకు డైట్ పాటించడం మరుస్తున్నారు.

 Y.HANUMAN PRASAD
Associate Professor &
Head Department of MANAGEMENT
STUDIES SKD ENGINEERING COLLEG E GOOTY
Anantapur .DIst
 

మరిన్ని శీర్షికలు
betalaprasna