Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

దేవదాస్ చిత్రసమీక్ష

devadas movie review

చిత్రం: దేవదాస్‌ 
తారాగణం: అక్కినేని నాగార్జున, నాని, రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్‌, కునాల్‌ కపూర్‌, నవీన్‌ చంద్ర, మురళీ శర్మ తదితరులు. 
సంగీతం: మణిశర్మ 
సినిమాటోగ్రఫీ: షమదత్‌ నైనుద్దీన్‌ 
నిర్మాత: అశ్వనీదత్‌ 
దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య 
నిర్మాణం: వైజయంతీ మూవీస్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ 
విడుదల తేదీ: 27 సెప్టెంబర్‌ 2018

కుప్లంగా చెప్పాలంటే.. 
ఇంటర్నేషనల్‌ మాఫియా డాన్‌ దేవ (నాగార్జున) తన గాడ్‌ ఫాదర్‌ దాదా (శరత్‌కుమార్‌)ని ఓ ముఠా చంపేయడంతో, ఆ ముఠాని వెతుక్కుంటూ హైద్రాబాద్‌కి వస్తాడు. అయితే హైద్రాబాద్‌లో దేవ మీద పోలీసులు ఎటాక్‌ చేస్తారు. ఆ ఎటాక్‌లో దేవకు బుల్లెట్‌ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకున్న దేవ, డాక్టర్‌ దాస్‌ (నాని) దగ్గరకు వెళతాడు. ఓ డాక్టర్‌గా దాస్‌, దేవాని రక్షిస్తాడు. అలా ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడుతుంది. డాక్టర్‌తో మాఫియా డాన్‌ స్నేహమేంటి? ఈ స్నేహం కారణంగా దాస్‌ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే.. 
డాన్‌ పాత్రలు నాగార్జునకి అలవాటే. ఆ పాత్రలో ఒదిగిపోయాడు. డాన్‌ పాత్ర అంటే, కంప్లీట్‌ సీరియస్‌నెస్‌ అనుకుంటే పొరపాటే. ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనింగ్‌ డాన్‌ క్యారెక్టర్‌లో నాగ్‌ అదరగొట్టేశాడు. ఆద్యంతం నాగ్‌ క్యారెక్టర్‌ అలరిస్తుంది. నేచురల్‌ స్టార్‌ నాని జీవించేశాడనడం చిన్న మాట. 'దాస్‌' పాత్రలో అంతలా ఒదిగిపోయాడు నాని. నాగార్జున - నాని మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారనడం అతిశయోక్తి కాదు. సీనియర్‌ హీరో, యంగ్‌ హీరో మధ్య ఆన్‌ స్క్రిన్‌ కమ్యూనికేషన్‌ బాగా వర్కవుట్‌ అయ్యింది. తెరపై ఇద్దర్నీ చూడటం కన్నుల పండువగా అన్పిస్తుంది అభిమానులకి.

అందాల భామలు రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్‌ గ్లామర్‌కే పరిమితమయ్యారు. పాత్రల పరంగా ఇద్దరికీ అవకాశం తక్కువే లభించింది. వున్నంతలో రష్మిక కాస్త బెటర్‌ అంతే. ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ తదితరులు బాగానే చేశారు. కునాల్‌ కపూర్‌ ఆకట్టుకుంటాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

కథ కొత్తదేమీ కాదు. కథనం పరంగానూ ఓకే. మాటలు బాగున్నాయి. మణిశర్మ మరోమారు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో తనకు సాటి లేదని నిరూపించుకున్నారు. పాటలు బాగానే వున్నాయి. వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కన్పిస్తుంది.

నాగార్జున, నాని కాంబినేషన్‌.. ఇదొక్కటే దర్శకుడు దృష్టిలో పెట్టుకున్నట్టున్నాడు. ఆ కాంబినేషన్‌ మేగ్జిమమ్‌ ఎంటర్‌టైనింగ్‌గా వుండేలా ఆయా పాత్రల్ని తీర్చిదిద్దాడు. సన్నివేశాల్నీ ఈ ఇద్దర్నీ కేంద్రంగా చేసుకునే రాసుకున్నాడు. అయితే రొమాంటిక్‌ ట్రాక్‌ విషయంలోనూ, హీరోయిన్ల పాత్రలకు వెయిట్‌ వుండే విషయంలోనూ దర్శకుడు పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం లోటనిపిస్తుంది. ఫస్టాఫ్‌ డల్‌గా స్టార్ట్‌ అయినా, నాగ్‌ ఎంట్రీతో సినిమా జోరందుకుంటుంది. అక్కడక్కడా సీన్స్‌ సాగతీతగా అన్పించడం మైనస్‌ పాయింట్‌. ఓవరాల్‌గా నాగార్జున ఎంటర్‌టైనింగ్‌ రోల్‌లో కన్పించడం, నాని - నాగార్జున మధ్య నడిచే సన్నివేశాలు వర్కవుట్‌ అవడం మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌. ఈ కాంబో తెరపై కన్పించినంతసేపూ ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది గనుక పైసా వసూల్‌ అన్నట్టే లెక్క. మిగతా కథ మీద ఇంకాస్త ఫోకస్‌ పెట్టి వుంటే, బెస్ట్‌ ఔట్‌ పుట్‌ వచ్చి వుండేదే.

అంకెల్లో చెప్పాలంటే..
3/5

ఒక్క మాటలో చెప్పాలంటే
దేవ - దాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బిందాస్‌

మరిన్ని సినిమా కబుర్లు
one more bomb on casting couch