Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

అరవింద సమేత వీర రాఘవ చిత్రసమీక్ష

aravndasameta veeraaghava movie review

చిత్రం: అరవింద సమేత వీర రాఘవ 
తారాగణం: ఎన్టీఆర్‌, పూజా హెగ్దే, జగపతిబాబు, సునీల్‌, నాగబాబు, ఈషా రెబ్బ, సుప్రియ పాఠక్‌, నవీన్‌ చంద్ర, దేవయాని, సితార, బ్రహ్మాజీ, రావు రమేష్‌ తదితరులు. 
సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌ 
సినిమాటోగ్రఫీ: పిఎస్‌ వినోద్‌ 
నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) 
దర్శకత్వం: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 
నిర్మాణం: హారిక హాసిన క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 1 అక్టోబర్‌ 2018 
కుప్లంగా చెప్పాలంటే.. 
తండ్రి హత్యకు గురికావడంతో, ఫ్యాక్షన్‌కి దూరంగా వుండాలనుకుంటాడు వీర రాఘవ (ఎన్టీఆర్‌). నానమ్మ సూచన మేరకు హైద్రాబాద్‌కి పయనమవుతాడు. అక్కడ అరవింద (పూజా హెగ్దే) అతనికి పరిచయమవుతుంది. ఓ సందర్భంలో అరవిందను కాపాడిన వీర రాఘవ, ఆమెకు రక్షణగా నిలుస్తాడు. ఆమె ఇంటికి వెళ్ళిన వీర రాఘవకి, అక్కడి పరిస్థితులు అనూహ్యంగా కన్పిస్తాయి. అసలేంటి ఆ పరిస్థితులు. తండ్రి మరణంతో హింసకు దూరమైన వీర రాఘవ మళ్ళీ కత్తి పడతాడా? అరవింద, అతన్ని హింస వైపు ప్రోత్సహిస్తుందా? హింసకు దూరంగానే వుంచుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. 
మొత్తంగా చెప్పాలంటే.. 
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మంచి నటుడు. ఈ విషయం అందరికీ తెల్సిందే. లౌడ్‌ యాక్షన్‌ మాత్రమే కాదు, సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌లోనూ తనకు తానే సాటి అన్పించుకున్న యంగ్‌ టైగర్‌, ఈ సినిమాలో నటన పరంగా కొత్తగా అన్పిస్తాడు. కళ్ళతో అనేక భావాల్ని పలికించేశాడు. భిన్న రకాలైన భావాల్ని అత్యద్భుతంగా పండించి, నటుడిగా మరోమారు తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతారనడం అతిశయోక్తి కాదేమో. 
పూజా హెగ్దే అందంగా కన్పించింది. ఆమె పాత్ర గ్లామర్‌కే పరిమితం కాలేదు. సొంత డబ్బింగ్‌ కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టినా ఓవరాల్‌గా ఓకే. నటిగానూ మంచి మార్కులేయించుకుంటుందామె. పాటల్లో ఎన్టీఆర్‌తో పోటీ పడి స్టెప్పులేసేందుకు ప్రయత్నించింది. తెరపై ఈ ఇద్దరి పెయిర్‌ నిండుగా కన్పించింది. 
నెగెటివ్‌ రోల్‌లో జగపతిబాబు పాత్ర షాకింగ్‌గా అన్పిస్తుంది. మేకప్‌, ఆహార్యంతో జగపతిబాబు పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుంది. అత్యంత క్రూరమైన విలనిజం పండించాడు జగపతిబాబు. సినిమా చూశాక జగపతిబాబు పాత్ర గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. సునీల్‌ బాగా చేశాడు. నవీన్‌ చంద్ర సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. మిగతా పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేర ఓకే అన్పిస్తాయి. అన్ని పాత్రలకూ ఎంతో కొంత ప్రాధాన్యత లభించింది. అంతలా త్రివిక్రమ్‌ పక్కాగా సినిమాని నడిపించాడు. 
కథ కొత్తదేమీ కాదు, కథనంలోనే కొంచెం కొత్తగా ఆలోచించాడు దర్శకుడు. సన్నివేశాల కంటే డైలాగ్స్‌ మీదనే ఎక్కువ ఫోకస్‌ పెట్టిన దర్శకుడు, చిన్న చిన్న లోపాల్ని డైలాగ్స్‌తో కవర్‌ చేసేశాడు. పాటలు ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్రధాన బలం. సాధారణ సన్నివేశాల్ని తమన్‌ తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో బాగా లేపాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ రాయలసీమలోని 'రా' లుక్‌ని పెర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్‌ చేశాయి. నిర్మాణపు విలువలు చాలా రిచ్‌గా వున్నాయి. 
సినిమా స్టార్ట్‌ అయిన వెంటనే గ్రాఫ్‌ పెరుగుతూ వెళుతుంది. కథ యాక్షన్‌ మోడ్‌లోంచి, కూల్‌ మోడ్‌లోకి వెళ్ళాక గ్రాఫ్‌ స్టడీగా వున్నట్లు అన్పిస్తూనే, కొంత నెమ్మదిస్తుంది. అయితే త్రివిక్రమ్‌ తన డైలాగుల పవర్‌తో ఆ లోటు కన్పించనీయకుండా చేశాడు. సెకెండాఫ్‌లో కొన్ని సీన్స్‌ సాగతీతగా అన్పిస్తాయి. అది మినహాయిస్తే, సెకెండాఫ్‌లోనూ పెద్దగా వంకలేమీ పెట్టలేని పరిస్థితి. ప్రీ క్లయిమాక్స్‌ మళ్ళీ ఊపందుకుంటుంది. ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చినా, త్రివిక్రమ్‌ డైలాగులు కట్టి పడేస్తాయి. త్రివిక్రమ్‌ డైలాగులకు తోడు, ఎన్టీఆర్‌ పెర్ఫామెన్స్‌ వెరసి సినిమా ఆద్యంతం బిగి సడలనియ్యలేదనే భావన కల్గిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్ళు తగ్గడం కొంత మైనస్‌గానే చెప్పుకోవాల్సి వుంటుంది. మొత్తమ్మీద, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ యంగ్‌ టైగర్‌ పరాక్రమాన్ని అత్యద్భుతంగా చూపించడంలో సఫలమయ్యాడు. ఎన్టీఆర్‌ వన్‌ మ్యాన్‌ షో, త్రివిక్రమ్‌ డైలాగులు, కథనాన్ని నడిపించడంలో కొత్తదనం వెరసి మంచి ఔట్‌పుట్‌ వచ్చిందని చెప్పొచ్చు. 
అంకెల్లో చెప్పాలంటే.. 
3.25/5 
ఒక్క మాటలో చెప్పాలంటే 
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పవర్‌

 
  
మరిన్ని సినిమా కబుర్లు
churaka