Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rakul in NTR bio pic

ఈ సంచికలో >> సినిమా >>

ఏమంత కొత్తగుంది గురూ.!

What's new

రామ్‌ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే రామ్‌. ఆ రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'హలో గురూ ప్రేమ కోసమే'. క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్‌ 18న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. కాగా లేటెస్టుగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. మొన్న విడుదలైన టీజర్‌కి వచ్చిన హాట్‌ రెస్పాన్స్‌ అదిరిపోయింది. ఇప్పుడు ట్రైలర్‌ కూడా మంచి రెస్పాన్సే అందుకుంటోంది.

అయితే ట్రైలర్‌లో పెద్దగా కొత్తదనమేమీ చూపించింది లేదు కానీ, ఫుల్‌ ఫ్యామిలీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది. 'అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారో లేదో తెలీదు కానీ, అబద్ధాలకి అమ్మాయిలు పడిపోవడం మాత్రం ఖాయం..' అంటూ మన ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ చెప్పే డైలాగ్‌ ట్రైలర్‌కి హైలైట్‌ నిలవడంతో పాటు, యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతోంది. ఇక అనుపమా క్యూట్‌ లుక్స్‌, ప్రకాష్‌రాజ్‌, సితార, పోసాని కృష్ణ మురళి వంటి నటీనటుల అప్పియరెన్స్‌తో ట్రైలర్‌కి నిండుతనం వచ్చింది. 'నేను శైలజ' సినిమా తర్వాత రామ్‌ ఆ స్థాయిలో హిట్‌ అందుకున్నది లేదు. క్లీన్‌ రొమాంటిక్‌ మూవీలా రూపొందుతోన్న ఈ సినిమాతో తనదైన ఎనర్జీ లెవల్స్‌తో మరోసారి ఆ రేంజ్‌ హిట్‌ని రామ్‌ తన ఖాతాలో వేసుకుంటాడేమో అనిపిస్తోంది. పండక్కి పండగ లాంటి ఫ్లేవర్‌తో వస్తోన్న ఈ సినిమాకి 'నేను లోకల్‌' ఫేం నక్కిన త్రినాధరావు దర్శకుడు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam