Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
house

ఈ సంచికలో >> యువతరం >>

సకల కళా వల్లభులు.!

All art works.

మా అమ్మాయి, లేదా అబ్బాయి స్కూల్లో లేదా కాలేజీలో ఫస్ట్‌ర్యాంక్‌ తెలుసా? ఎప్పుడూ పుస్తకాలతోనే కుస్తీ పడుతూ ఉంటుంది. . అంటూ తల్లి తండ్రులు బాగా చదివి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించే పిల్లల కోసం ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడలా కాదు, చదువుతో పాటు, ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌ గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. చదువులోనే కాదు, ఆ ఇతర వ్యాపకాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలా ఇప్పుడు పిల్లలు చిన్నతనం నుండే చదువుతో పాటు మ్యూజిక్‌, డ్రాయింగ్‌, డ్యాన్స్‌, కరాటే తదితర విద్యల్లోనూ శిక్షణ పొందుతున్నారు. ఆయా విద్యల్లో ఉన్నత శిక్షణలు తీసుకుని స్టార్స్‌గా ఎదుగుతున్నారు. చిన్నారుల్లో స్కూలు డేస్‌ నుండే స్టార్ట్‌ అవుతోన్న ఈ సకల కళా వైభవం కాలేజీలకొచ్చేసరికి వాటిలో వారిని ఎక్స్‌పర్ట్స్‌ని చేసేంతగా ఎదుగుతోంది. అందుకే ఈ కళలకు తల్లితండ్రుల నుండి అమితమైన ప్రోత్సాహం అందుతోంది.

'క్రియేటివిటీ ఉండాలిరా.. దేనికైనా.. వాడిలో ఆ క్రియేటివిటీ ఉంది. అందుకే వాడు అది సాధించాడు..' అని నూటిలో ఏ ఒక్కరి గురించో మాట్లాడుకునేవారు గతంలో. కానీ ఇప్పుడలా కాదు, చిన్నతనం నుండే ప్రతీ చిన్నారికీ క్రియేటివిటీ ఆలోచనలు రేకెత్తేలా వారి మెదడుకు పదును పెడుతున్నారు. ఆ రకంగా వారికి తర్ఫీదునిస్తూ పెంచుతున్నారు. దాంతో ఒక స్టేజ్‌కొచ్చేసరికి, చదువుతో పాటు, ఆయా విద్యల్లోనూ ఆరితేరుతున్నారు పిల్లలు. క్రియేటివిటీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా పిల్లలు ఈ పనులు చేయకూడదు, ఆ విద్యను అభ్యసించకూడదు అనేమీ లేదు. సంస్కారం కోసం, జీవన ఉపాధి కోసం చదువు తప్పనిసరి. కానీ తానేంటో నిరూపించుకోవాలంటే చదువుతో పాటు మిగిలిన వ్యాపకాలు కూడా అత్యవసరం అనే స్థాయికి ఇప్పటి సొసైటీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆ వేగాన్ని అందుకోవాలంటే తప్పదు చిన్నతనం నుండే పిల్లలకు ఏ రంగంలో ఇంట్రెస్ట్‌ ఉందో గుర్తించాల్సిందే. ఆయా రంగాల వైపు మళ్లేలా వారిని ప్రోత్సహించాల్సిందే. మొదట్లో టైం పాస్‌ వ్యవహారంగా మారిన ఈ తతంగం ఇప్పుడు జీవనోపాధికీ గట్టి పోటీగా నిలుస్తోంది.

ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ కాలేరు కదా. అందరూ బీటెక్స్‌ చేసేస్తే కోరుకున్న ఉద్యోగాలేం వచ్చేయవు కదా. అందుకే వివిధ రంగాల్లో కొలువులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే వ్యక్తికి నెలకు సంపాదించే ఆదాయానికి ఏమాత్రం తీసిపోకుండా ఇతర రంగాల్లో పని చేసే వ్యక్తులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటే ఒత్తిడితో కూడుకున్న పని. కానీ మనం పైన పేర్కొన్న విద్యల్లో ఎక్స్‌పర్ట్స్‌ అయినవారు ఆయా సంబంధిత ఉద్యోగాల్లో ఎంతో సంతృప్తిగా పని చేస్తున్నారనీ ఓ సర్వేలో తేలింది. అలా సకల కళల్లోనూ ప్రవేశం.. చిన్నతనం నుండే అంది పుచ్చుకోవడం వల్ల పెద్దయ్యాక చదువులు పూర్తయ్యాక ఆ చదవుకు సంబంధించిన ఉద్యోగం కోసమే ఎదురు చూసి కాలాన్ని వృధా చేసుకోకుండా, నేర్చుకున్న కళలు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే బీటెక్‌ చేసిన విద్యార్ధి ఇప్పుడు ఇంజనీరే కావాలనుకోవడం లేదు. చక్కగా వ్యవసాయం చేస్తున్నాడు. అలాగే ఇంకోటి. ఇలా కళ అనేది ఏదైనా కావచ్చు ఎవర్‌ అండ్‌ ఎవర్‌. ఆల్వేస్‌ బీ విత్‌ యూ. 

మరిన్ని యువతరం