Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope October 25 - October 31

ఈ సంచికలో >> శీర్షికలు >>

సినీ పిచ్చి - బన్ను

cine pichi

ఈ మధ్య చాలామంది యువకులకి 'సినీ పిచ్చి' పట్టింది. ఇందులో కొందరికి యాక్టింగ్ పిచ్చి, మరికొందరికి డైరక్షన్ పిచ్చి. డైరక్షన్ పిచ్చి పట్టినవాళ్ళలో 99% యువకులకి RGV ఇన్స్ప్ రేషన్ అంటున్నారు. అదెందుకో నాకు అర్ధం కావటం లేదు. ఈ మధ్య బాగా హిట్లొచ్చిన పూరీ జగన్నాధ్ లాంటి వారు ఆడియో ఫంక్షన్స్ లో నేను RGV గారి శిష్యుడిని అని చెప్పటం ఓ కారణం కాబోలు. ఇహపోతే యాక్టింగ్ పిచ్చున్నవాళ్ళు కొందరొచ్చి నేను 'హీరో' అవుదామనుకుంటున్నా... అంటుంటే వాళ్ళకో 'అద్దం' కొని ఇవ్వాలనిపిస్తుంది. నేనెవరినీ కించపర్చాలని చెప్పటం లేదు. మనలో టాలెంట్ వుంటే బైటకి తీసుకురావాలి కానీ... మనం ఎంతవరకు న్యాయం చేయగలమని మనల్ని మనం ప్రశ్నించుకోవటం అవసరం - అత్యవసరం!

షార్ట్ ఫిలిమ్స్ తీసి 'Youtube' లో అప్ చేసి ఆ లింక్ వారి ఫేస్ బుక్, ట్విట్టర్ల లో వేసి 'లైక్' ల కోసం వేచి చూస్తున్నారు. అందులో  కొంతమంది చాలా టాలెంటెడ్ వాళ్ళూ వున్నారు. కానీ... సినీ పిచ్చితో చదువులు పాడుచేసుకోరాదని నా మనవి. ప్రయత్నించండి - కానీ చదువు, వృత్తి లకు ప్రాధాన్యత ఇవ్వండి. మీకు మంచి LIFT దొరికితే దాన్ని 'కెరియర్' గా మార్చుకోండి కానీ మిగతావారు అదే నాకెరియర్ అని డిసైడ్ అవ్వద్దు.

మరిన్ని శీర్షికలు
Book Review - Sri Ramana Paradeelu