Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Answer to Cancer by Akkineni

ఈ సంచికలో >> సినిమా >>

బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షిస్తాడా?

Is Rajamouli attracts Bollywood?

వంద కోట్ల మేనియా సినీ పరిశ్రమలో కనిపిస్తోంది. హిందీ, తమిళ సినిమాలు వంద కోట్లను టచ్ చేసేశాయి. తమిళంలో రజనీకాంత్ , హిందీలో సల్మాన్ , షారుక్ , హృతిక్ .. ఒకరేమిటి చాలామందే వున్నారు. తెలుగు సినిమా కూడా వంద కోట్ల దిశగా పరుగులు పెడ్తోంది. అది అత్తారింటికి దారేది సినిమాతో ప్రారంభమయ్యింది. బడ్జెట్ పరంగా 100 కోట్లు హిందీ, తమిళ సినిమాల్లో వర్కవుట్ అవ్వొచ్చు. తెలుగులో మాత్రం కష్టమే.

కానీ, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి వస్తోంది తెలుగు సినిమా బాహుబలి . ఈ సినిమాకి వంద కోట్లు ఖర్చుపెడుతున్నారట. వంద కోట్ల ప్రాజెక్ట్ అనగానే తమిళ, హిందీ సినీ పరిశ్రమలూ ఆశ్చర్యపోతున్నాయి. రాజమౌళి సినిమా కావడంతో, ఇప్పటికే ఈగ ని తమిళంలో, హిందీలో చూసినవారు బాహుబలి పై ప్రత్యేకమైన దృష్టిపెట్టారు.

బాహుబలి విడుదలయ్యే సమయానికి హిందీలో చాలా పెద్ద సినిమాలు విడుదలవుతాయి. వాటి మధ్య బాహుబలి ప్రత్యేకతను చాటుకోవాలంటే రాజమౌళి తనకు మాత్రమే తెలిసిన పబ్లిసిటీ వ్యూహం పన్నాల్సి ఉంటుంది. రాజమౌళి వ్యూహం ఫలిస్తే బాలీవుడ్ లోనూ బాహుబలి సంచలనాలను సృష్టించవచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
TV Anchor Suma and Shilpa