Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The difference looks like ...

ఈ సంచికలో >> శీర్షికలు >>

26 - 10 -2018 నుండి 01-11-2018 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

వారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరంభంలో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. కుటుంబంలో మీ ఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. సోదరులతో చర్చలకు సమయం ఇస్తారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాల పట్ల అశ్రద్ద వద్దు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు ఆస్కారం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. 

 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం మొత్తం మీద పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిదిబీ. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు, అనుకూలమైన మార్పులు వస్తాయి. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. ఆత్మీయులను కలుసుకునే అవకాశం ఉంది. 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను మిత్రుల సహాయంతో పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. ఆరోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. వైద్యం విషయంలో కాస్త ధనం ఖర్చు అయ్యే ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకపోవడం అనేది సూచన.

 

 


కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మొత్తం మీద నూతన ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయ వంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. మిత్రులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువులతో సమయాన్ని సరదగా గడుపుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. మీ ఆత్మీయుల ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈవారం మొత్తం మీద చర్చలకు దూరంగా ఉండుట సూచన. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, ఖర్చులు తగ్గించుకోండి. వారాం మధ్యలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో బాగానే ఉన్న , పని ఒత్తడికి ఆస్కారం ఉంది. బంధువులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాల విషయంలో సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. 

 

 


కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం మొత్తం మీద పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితమ్. ఆత్మీయుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు నూతన వివాదాలకు దారి తీస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ఆవకాశం ఉంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. 
 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యారపరమైన విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మీ ఆలోచనలు కాస్త స్వార్థపూరితంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. రావాల్సిన ఆర్థికపరమైన సహకారం సమాయానికి లభిస్తుంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఆశ్రద్దగా ఉంటె నూతన సమస్యలు వస్తాయి, జాగ్రత్త. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. 

   

 

వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాల్లో కాస్త తడబాటు ఉండే అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త శ్రమతో పూర్తిచేసే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ మాటతీరు మిమల్ని మిత్రుల నుండి దూరం చేసే అవకాశం ఉంది. ఆరోగ్య పరమైన సమస్యలు తగ్గుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందక పోవచ్చును. తండ్రి తరుపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది. 

 

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మనస్పర్థలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. మిత్రుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. జీవితభాగస్వామితో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. 



మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం మొత్తం మీద కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. మానసికంగా దృడంగా ఉండుట సూచన. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. 


కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద సోదరులతో చేపట్టిన చర్చలు పూర్తిఅవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. బంధువులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. చర్చపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. 

కలదు.

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. చిన్న చిన్న విషయాలను సైతం పట్టించుకోవడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. పెద్దలతో మీకున్న అనుభందం మరింతగా బలపడుతుంది. ప్రయాణాలు అనుకోకుండా చేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. వ్యాపారంలో బాగానే ఉంటుంది.  

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 

మరిన్ని శీర్షికలు
Ramayana is the goodman of the ideals.