Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఇప్పుడెవరంటే...

big bi

హీరోలంటే హీరోలే...వారేది చేసినా ప్రత్యేకమే....ఎందుకంటే వారివారి మార్కెట్ ను నమ్ముకుని కోట్లాది రూపాయలు కుమ్మరిస్తారు నిర్మాతలు...అంచనాలు పెంచుకుంటారు అభిమానులు....అందుకే వారి ప్రతి చిత్రానికీ....ప్రతి ఫ్రేముకీ ఎంతో శ్రద్ధవహిస్తారు దర్శకులూ రచయితలూ...వారి హావభావలే కాక, వారి స్వరానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది...ఆ స్వరాలను అప్పుడప్పుడు తమ చిత్రాలకే కాక, వేరే చిత్రాలకూ అందిస్తూంటారు. అదే క్రమంలో ఒకప్పుడు బిగ్ బీ అమితాభ్ బచ్చన్ ప్రముఖ యానిమేషన్ ఫిల్మ్ హనుమాన్ లో హనుమంతుడి పాత్రకు అందించి ప్రేక్షకులను రంజింపజేసారు....ఆ తర్వాత అదే హనుమాన్ తెలుగు వెర్షన్ కి మన మెగాస్టార్ తన గంభీరమైన స్వరాన్ని అందించి అభిమానులనలరించారు. జక్కన్న రూపొందించిన మర్యాద రామన్న చిత్రంలో ఓ డొక్కు సైకిల్ కి వెరైటీగా మన మాస్ మహారాజా డబ్బింగ్ చెప్పాడు.... ప్రాణం లేని సైకిల్ మనసులో నిజంగా అన్ని భావాలుంటాయా అనిపించేంత పండించాడు....

ఇప్పుడదే క్రమంలో నట కిరీటి కూడా తన గాత్రాన్ని వేరే పాత్రకు దానం చెయ్యబోతున్నాడు...కానీ అది ఏ మనిషి పాత్రకో కాదు....వెరైటీ చిత్రాల రవిబాబు రూపొందిస్తున్న చిత్రంలో ప్రధాన పాత్ర పందిపిల్ల "బంటి"కి....రెండు దశాబ్దాలకు పైగా హాస్య చిత్రాల కథానాయకుడుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన రాజేంద్రప్రసాద్, సెకండ్ ఇన్నింగ్స్ లో రూటు మార్చుకుని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఔరా అనిపిస్తున్నాడు...వెరైటీ చిత్రాల  దర్శకుడు రవిబాబు ఆలోచనకు నటకిరీటి గాత్రమంటే ప్రేక్షకులకు బహు పసందే కానున్నదన్నమాట....

మరిన్ని సినిమా కబుర్లు
rakul @40