Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rakul @40

ఈ సంచికలో >> సినిమా >>

బయో పిక్ ల హవా.

bio pics hava

కాసుల వర్షాన్ని కురిపించడానికైనా, కాంట్రవర్సీతో అదరగొట్టేయడానికైనా ఇప్పుడొకటే హవా....అదే బయో పిక్ ల హవా...అటు బాలివుడ్ అయినా...ఇటు టాలివుడ్ అయినా ఇదే పరంపర...తియ్యగలిగే సత్తా ఉండాలేగానీ మనకు ఆసక్తికరమైన వ్యక్తులు కరువా, వారి జీవిత సన్నివేశాలకు కొదువా? ఒకేవ్యక్తి బయోపిక్ ని ఇద్దరు దర్శకులు తీసినా చూసేస్తారు. ఎందుకంటే వారు తీసుకునే కోణాలు, చిత్రీకరించే శైలి, ఇలా రకరకాల కారణాలతో...అయితే, జనం తెలుసుకోవాలనుకునే సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన వారి జీవిత విశేషాలను తెరకెక్కించడం ఒక ఎత్తయితే, వివాదాస్పద జీవితాలూ, అర్ధాంతర మరణాలతో నిష్క్రమించిన వ్యక్తుల బయో పిక్ లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి...కానీ, వీటి విషయంలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి...

అసలే కాంట్రవర్సీ సబ్జెక్టులాయె..తేడా వస్తే అసలుకే మోసం వస్తుంది...ఇప్పుడిదంతా ఎందుకంటే, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ ఒకప్పుడు వార్తలో నిలిచిన వ్యక్తి..ఆమె రూప లావణ్యం,తెలివి తేటలు అన్నీ ప్రత్యేకమే...ఆఖరికి మిస్టరీగా మిగిలిపోయిన ఆమె అర్థంతర మరణం కూడా ప్రత్యేకమే....ఆమె జీవిత కథనూ, మరణానికి దారి తీసిన పరిస్థితుల నేపథ్యాన్నీ తీసుకుని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలివుడ్ లో వినికిడి...అంతేకాదండోయ్, ఆమె పాత్రకు దీపికా పదుకొన్ ఎంపికయ్యిందని కూడా టాక్ వినిపిస్తోంది...వివరాఇంకా తెలియరావలసి ఉన్నాయట..

మరిన్ని సినిమా కబుర్లు
Young hero crossing Border