Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
How to find happiness

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఇది మన తెలుగు గోతెలుగు - బన్ను

This is our  go Telugu

స్వస్తిశ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినాన (11 ఏప్రిల్ 2013 న ) అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా గోతెలుగు ప్రారంభ సంచిక ఆవిష్కరణ జరిగి, స్వర్గీయ శ్రీ బాపుగారి చేతులమీదుగా రూపుదిద్దుకున్న అద్భుతమైన ముఖ చిత్రంతో వెలువడిందన్న విషయం పాఠకులకు విదితమే....ఆ తర్వాత ప్రతి ప్రత్యేక సంచికకూ గురుదేవులు శ్రీ జయదేవ్ బాబు గారే ముఖచిత్రాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది...ఎక్కడో ఒకట్రెండు సందర్భాల్లో తప్ప ఎప్పుడూ క్రమం తప్పలేదు...అయితే, పండుగ ప్రాశస్త్యాలను ప్రతిబింబించడం మాత్రమే కాకుండా, వాటి ద్వారా ఒక చక్కటి సందేశాన్ని అందించడం, సామాజిక అంశాలను జోడించడంతో అవి పాఠకులను అలరించడంతోబాటు ఆలోచింపజేస్తున్నాయి కూడా..

మరొక ప్రత్యేకత గురించి కూడా చెప్పుకోవాలి...అదేమిటో పాఠకులు గమనించే ఉంటారు...పండగల ఇతివృత్తానికి గోతెలుగుకి ఉన్న అవినాభావ సంబంధాన్ని చూపిస్తూ అద్భుతమైన చిత్రాల్ని అందిస్తూ వస్తున్నారు....ఇందుకు గోతెలుగు తరపున గురుదేవులవారికి అభినందనలు తెలియజేస్తున్నాము.

ఈసారి ముఖచిత్ర రూపకల్పన విషయానికొస్తే, గోతెలుగు పత్రిక పేరులోని మొదటి అక్షరం " గో" కి అనేకమైన అర్థాలున్నాయి. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది గో అంటే గోమాత. హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే గోమాత శుభ-ఆరోగ్య ప్రదాయిని. గృహ ప్రవేశ సమయంలో ఆవుని తీసుకురావడం, పూజల్లో ఆవునెయ్యితో దీపారాధన, ఆవుపేడతో ఇల్లు అలకడం(పాత కాలంలో) మంత్రోచ్చారణ చేస్తూ గోపంచకంతో పరిసరాలను శుద్ధి చేయడం.. ఇలా ఎన్నో విధాలుగా శుభకార్యాల్లో గోమాతకు విశిష్ట స్థానం ఉంది.

గోమాత స్వయంగా దీపారాధన చేయడం, అదీ తెలుగు అనే అక్షరాల మీద ప్రమిదలు పేర్చడం అనేది అద్భుతమైన భావన...తెలుగింటి ఆడపడుచులా చక్కగా చీరకట్టి గోమాతను ముస్తాబు చెయ్యడం గోతెలుగు పట్ల గురుదేవులకున్న వాత్సల్యాన్ని ప్రతిబింబిస్తోంది...

ఎప్పటిలాగే ఈ ప్రత్యేక సంచికను కూడా పాఠకులు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం.

ఇంతమంచి ముఖచిత్రాన్ని అందించి, ప్రత్యేక సంచికకే ప్రత్యేకతను అపాదించించిన  శ్రీ జయదేవ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ...

అందరికీ దీపావళి శుభాకాంక్షలతో....

మీ బన్ను

మరిన్ని శీర్షికలు
lehenga