Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
lady cartoonist -vagdevi

ఈ సంచికలో >> శీర్షికలు >>

30 - 11 -2018 నుండి 06-12-2018 వరకు వారఫలాలు - - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారంలో ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. చేపట్టిన పనులను మిత్రులతో కలిసి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సూచన. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. తండ్రి తరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానం విషయంలో కీలకమైన ఆలోచనలు కలిగి ఉంటారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం మేలుచేస్తుంది.  

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారంలో చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. అనుకోకుండ ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. పెద్దలతో చర్చలు చేయునపుడు వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. సంతానపరమైన విషయాల్లో చక్కటి గుర్తింపును పొందుతారు. జీవితభాగస్వామితో సర్దుబాటు విధానం తప్పక మేలుచేస్తుంది.

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

 ఈవారం మొత్తం మీద కుటుంబంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆశించిన మేర సహకారం వారినుండి లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. చిన్న చిన్న విషయాల వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం అవసరం. సంతానం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. మీ మాటతీరు మూలన నూతన సమస్యలు వచ్చే అవకాశం ఉంది, సర్దుబాటు విధానము ఉత్తమం. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి కాస్త సమయం పట్టే అవకాశం కలదు.

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మొత్తం మీద మీ మాటతీరు కొంతమందిని ఆశ్చర్యానికి గురిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలను కలిగి ఉంటారు. నూతన ఆలోచనలకు ప్రధాన్యం ఇస్తారు, చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. స్త్రీ పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. అనుకోకుండా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది , అనుభవజ్ఞుల సూచనలతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలకు ఆస్కారం ఉంది. విదేశీప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. కుటుంబంలో సర్దుబాటు మంచిది.

 


సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారంలో కుటుంబపరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సంతానపరమైన విషయాల్లో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైన అవకాశాలు పెరుగుటకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారంలో ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు లబ్దిని కలుగజేస్తాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మేర లబ్దిని పొందుతారు, నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. చర్చలకు అవకాశం ఇవ్వకండి.   

 

 


తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారంలో చేసిన నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. మీ ఆలోచనలో స్పష్టమైన విధానం కలిగి ఉండుట సూచన. పెద్దలతో మీకున్న పరిచయం బలపడే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో కొంత ఆలోచనల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. సోదరులతో చేసిన చర్చలు మద్యలో ఆగిపోయే అవకాశం కలదు. విదేశీప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

 ఈవారంలో ఆరంభంలో కాస్త నిదానంగా ఉండుట సూచన. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం నిదానంగా వ్యవరించుట సూచన. గతం కన్నా ఈవారం బాగుంటుంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు ఆస్కారం కలదు. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. విలువైన వస్తువులను కొనుగులు చేయుటకు ఆస్కారం ఉంది. రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును, జాగ్రత్త అవసరం.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

  ఈవారం మొత్తం మీద అధికారుల సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోండి, వారితో నూతన పనులను మొదలు పెడతారు. మానసిక పరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పవల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కలదు. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు.

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగప్రయత్నాల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన మాటల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావోచ్చును. అనారొగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో విభేదాలు ఒక కొలిక్కి రాకపోవచ్చును. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, నిదానం అవసరం.

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద నూతన అవకాశాల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తయి. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగపడుతాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఇబ్బంది ఉంటుంది. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. కుటుంబంలో సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఆర్థికపరమైన సహకారం అందుతుంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. మీ మాటతీరు మిమ్మల్ని ఒకస్థాయికి తీసుకువెళ్తుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారంలో ముఖ్యమైన విషయాలకు సమయం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. చర్చాపరమైన విషయాల్లో సమయాన్ని కేటయిస్తారు. గతంలో మీరు చేపట్టిన పనులకు గాను నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మంచిది. విదేశీప్రయాణాలు చేయువారికి బాగానే ఉంటుంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 
మరిన్ని శీర్షికలు
sarasadarahasam