Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

'రౌడీ బేబీ'గా మారిన హైబ్రీడ్‌ పిల్ల.!

rowdy baby changed hybrid girl

'భానుమతి', హైబ్రీడ్‌ పిల్ల.. సింగిల్‌ పీస్‌.. అంటూ 'ఫిదా' సినిమాలో డైలాగులు చెప్పి కుర్రోళ్లు, పెద్దోళ్లూ, క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ అనే తేడా లేకుండా అందరి హృదయాల్ని కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ఇప్పుడు రౌడీ బేబీగా మారిపోయింది. తమిళంలో ధనుష్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'మారి 2' చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్టుగా ఈ సినిమా నుండి ఓ ఆడియో సింగిల్‌ బయటికొచ్చింది. ఈ ఆడియో సింగిల్‌లో ధనుష్‌, సాయి పల్లవి మాస్‌, ఊర మాస్‌ స్టెప్పులు చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. నిజానికి ఇదేమీ వీడియో సాంగ్‌ కాదు, జస్ట్‌ స్టిల్స్‌ మాత్రమే వచ్చాయి. ఆ స్టిల్స్‌లోనే సాయి పల్లవి అమ్మడూ.. లెట్స్‌ డూ కుమ్ముడూ.. అనే రేంజ్‌లో స్టెప్పులిరగదీసింది.

ధనుష్‌ మాస్‌ హీరో. మాస్‌ స్టెప్పులేయడంలో ఆయనకి ఆయనే సాటి. సాయి పల్లవి నటించిన తెలుగు, తమిళ చిత్రాలు మొదలుకొని ఇంతవరకూ ఆమె నటించిన హీరోల్లో ధనుష్‌ పెయిర్‌ ది బెస్ట్‌ మాస్‌ పెయిర్‌గా చెప్పుకోవాలి. ఆన్‌ స్క్రీన్‌ ఈ ఇద్దరూ రచ్చ రంభోలా చేసుంటారని ఈ స్టిల్స్‌ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రభుదేవా కొరియోగ్రఫీలో రూపొందిన ఈ సాంగ్‌ని ధనుష్‌ ఆలపించారు. యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ అందించారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్‌ తన సొంత బ్యానర్‌లో రూపొందిస్తున్నారు. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిశంబర్‌ 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
Mass Raja with three heroins