Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Mass Raja with three heroins

ఈ సంచికలో >> సినిమా >>

కిర్రాకు పుట్టిస్తోన్న 'పిచాక్‌'.!

kirack pichak

'పిచాక్‌' ఇదేంటీ అనుకుంటున్నారా.! అక్కడికే వచ్చేద్దాం. ఈ మధ్య 'ఫసక్‌' అన్న మాట బాగా వింటున్నాం కదా. ఆ మాటని బీట్‌ చేసేందుకే ఇప్పుడీ 'పిచాక్‌' వచ్చినట్లుంది. 'హుషారు' అనే ఓ కొత్త సినిమా తెరకెక్కుతోందండీ. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన పాటే ఇది. 'నా జిందగీ.. పిచాక్‌' అంటూ సాగే ఈ పాట ఎంతలా వైరల్‌ అయిపోయిందంటే ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట. విజువల్‌గా కూడా పాటని బాగా చిత్రీకరించడంతో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌ అయిపోయింది. ఆడియోగానూ వైరల్‌ అయిపోయింది. అందరూ కొత్త నటీనటులతో కొత్త డైరెక్టర్‌ శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సమాజం జులాయిలుగా ముద్ర వేసిన నలుగురు కుర్రాళ్ల కథే ఈ 'హుషారు'. ఇక 'పిచాక్‌' పాటలో కనిపించింది మాత్రం సుపరిచితుడైన నటుడు రాహుల్‌ రామకృష్ణ. బీటెక్‌ చదివిన ఓ కుర్రాడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో పడే పాట్లు ఏంటనేది ఈ పాటలో ఫన్నీగా చూపించారు. ఫన్నీ అంటే పన్నీగా తీసి పాడేయడానికి లేదండోయ్‌. మీరు కూడా సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ అయితే తెలిసేది.. పాపం ఈ కుర్రోడి కష్టమేంటో. కొన్ని పాటలు అనుకోకుండా క్లిక్‌ అయిపోతూ ఉంటాయి. అలాగే ఈ పిచాక్‌ పాట పిచ్చెక్కించేస్తోంది. ఇక ఈ 'హుషారు' గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఏంటంటే, ఈ సినిమా కథ ముందుగా సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ దగ్గరికి వచ్చిందట. అయితే నలుగురు హీరోల కథ కదా, నేను చేయననడంతో కొత్త కుర్రోళ్లకు ఆ అవకాశం దక్కింది. చూడాలి మరి ప్రమోషన్‌ సాంగ్‌ అయితే ఓ రేంజ్‌లో క్లిక్‌ అయ్యింది. సినిమా ఎలాంటి కిక్‌ ఇస్తుందో విడుదలయ్యాకే తెలుస్తుంది.

మరిన్ని సినిమా కబుర్లు
'Bhairwagita' is going back!