Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

మీ పలుకు - పాఠకులు

mee paluku
గోతెలుగు.కామ్ సంపాదకులకు శుభాకాంక్షలు. మీ పత్రిక విదేశాల్లో ఉంటున్న మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతున్నది. ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాలు మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ శీర్షికలు అందిచగలరు
--- వాసుదేవరావు, సింగపూర్.  
 
మన తెలుగు సంస్కృతిని భావి తరాల వారికి అందించాలనుకునే మీ ప్రయత్నానికి హాట్సాఫ్
---సుధా మన్నే

మీరు  మన అభిమాన  గాయకుడు, సౌజన్య మూర్తి శ్రీ  పి. బి.శ్రీనివాస్ గారి గురించి gotelugu.com పత్రికలో వ్రాసిన వ్యాసం లో ఆర్ద్రత గోచరించినది. మీ హృదయ స్పందనలు వినబడ్డాయి. నా అభినందనలు అందుకోండి.శుభాకాంక్షలు.
---ఓలేటి  వెంకట సుబ్బారావు

Very informative Article about Kannamba. Writing style is excellent.
---విజయ లక్ష్మి

కన్నాంబ గారి గురించి శాస్త్రిగారు చాలా విషయాలు తెలిపారు. శాస్త్రి గారికి, గోతెలుగు.కామ్ సంపాదకులకు నా కృతఙ్ఞతలు.
---నాగయ్య, హైదరాబాదు.

గో తెలుగు అంతర్జాల పత్రిక చాలా చాలా బాగుంది. యాజమాన్యానికి శుభాకాంక్షలు.  పీబి గారి గురించి తెలియని విషయాలెన్నో విశదీకరించారు.. రాజాగారూ... ధన్యవాదాలు.గో తెలుగు... ఇదిగో తెలుగు.. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్...కీపిట్ అప్. ఆల్ ది బెస్ట్ టు గో తెలుగు టీమ్
-- గంగాధర్, చాగల్లు 

కన్నాంబ గారి గురించి చాలా విషయాలు సేకరించి, వ్రాసి పాఠకులకు అందించారు. సంతోషం. తోడికోడళ్ళు సినిమాలో ఆమె పాత్ర ఇప్పటికి కళ్ళల్లో మెదులుతుంది. ఆ తరువాత మాంగల్యబలం లో ఆమె పాత్ర అత్యద్భుతం. ఇంక మనం మరచిపోతున్న కళాకారుల గురించి వ్రాస్తారని కోరుతూ...
---ఉప్పలపాటి వెంకటరత్నం

శ్రీ శాస్త్రి గారు మీరు శ్రీమతి కన్నాంబ గారి గురించి వ్రాసిన విశేషాలు చాలా చాలా బాగున్నాయి. ఎన్నో విషయాల్ని కష్టపడి సేకరించి వ్రాసారు. చాలా తెలుసుకున్నాము. చిన్న submission.   శ్రీమతి కన్నాంబ గారు నటించిన 'రాజమకుటం' కూడా చాలా గొప్పగా వుంటుంది. అందులో ఆమె తన మరిది మరియు సేనాని అనుకుంట, గుమ్మడి(విలన్) గురించి తన కొడుకు యువరాజు (ఎన్టీఆర్) కి చెప్పే మర్మగర్భ విషయాలు, సూచనలు, సలహాలు అద్భుతం
--- బాలు
 
కన్నాంబ గారి గురించి శాస్త్రిగారు చాలా విషయాలు తెలిపారు. శాస్త్రి గారికి, గొతెలుగు.కం సంపాదకులకు నా కృతఙ్ఞతలు.
---నాగయ్య, హైదరాబాదు.

చేపల కూర చాలా బాగుంది. ఎంతో సులభంగా నోరు ఊరించె రుచికరమైన వంటకం. చూడ గానే తినాలనిపించింది.
---రాజలక్ష్మి, చెన్నై .

మన రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల వివరాలు అందించడం నిజంగా అభినందనీయం, అందరూ వేసవి విడిది అనగానే ఊటీ, కొడైకెనాల్ గురించే ఆలోచిస్తారు కానీ హార్స్లీ హిల్స్ గురించి ఆలోచించారు, మీ వ్యాసం తప్పక అటు వైపు ఆలోచించేలా చేస్తుంది. అక్కడ వసతి సౌకర్యాల గురించి కూడా రాసి ఉంటె ఇంకా బాగుండేది.
---శ్రీనివాస్, హైదరాబాద్ 
మరిన్ని శీర్షికలు
bhagavaan shree ramana maharshi biography