Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
shree puchalapalli sundarayya

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతకచక్రం(ఏప్రిల్ 27 - మే 03) - శ్రీ నంద

వచ్చే సంచిక నుండి 'శ్రీ నంద' గారు మీ ప్రశ్నలకు సమాధానాలిస్తారు. మీ యొక్క ప్రశ్నలను(ఒక్కటి మాత్రమే) మీ పేరు, పుట్టిన తేది, సమయం, పుట్టిన ఊరు జతచేసి 'goteluguastro@gmail.com ' కి పంపగలరు
 మేష రాశి
ఈ రాశివారు ఈవారం మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో లేదా ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలే వస్తాయి. వారం ప్రారంభంలో మీ ఆలోచనల వల్ల మీకు గౌరవం లభించినప్పటికీ  వారం చివర్లో ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. సంతానం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అకాల భోజనం వల్ల అనారోగ్య సూచనలున్నాయి.  ఆహారం విషయంలో నిర్లక్ష్యం తగదు. బంధుమిత్రులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి...  వారితో ఆచితూచి, కాస్త నిదానంగా వ్యహరించడం మంచిది.  వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి. విందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. విదేశీప్రయాణాలపై ఆసక్తిని కలిగి ఉన్నవారు చాలా గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడే వారి కోరిక నెరవేరుతుంది. ధర్మసంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరాశివారు మంచి ఫలితాలు పొందాలంటే ఆదివారం నాడు శివుడికి అభిషేకం చేయాలి. ప్రతిరోజూ గణపతి అష్టోత్తరం చదవితే మీరు అనుకున్న విషయాల్లో అభివృద్దిని సాధిస్తారు.

వృషభ రాశి
ఈ రాశివారు మంచిఫలితాలను పొందుతారు భోజనం విషయంలో సంతృప్తిని కలిగి ఉంటారు మీయొక్క ఆలోచనలచేత అందరిలోను గౌరవాన్ని పొందుతారు.ఆర్థికపరమైన అంశాల్లో ముందుకు వెళ్తారు ధనలాభంను కలిగి ఉంటారు.వ్యాపారస్థులు నూతన ప్రయత్నాలు ప్రారంభించుట మంచిది కాకపోతే ప్రయాణాలు చేయవలసి వస్తే తగుజాగ్రత్తలు తీసుకోవడం మేలుచేస్తుంది.బంధుమిత్రులలో ఒకరియొక్క ఆరోగ్యం ఆందోళనను కలిగిస్తుంది.భోజనంవిషయంలో సరైన శ్రద్ధను వహించుట మితంగా భుజించుటమే కాకుండా పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం చేత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును.సేవారంగంలో ఉన్నవారు మంచిపేరును సంతృప్తిని పొందుతారు.ఉద్యోగస్థానంలో మాములుగా ఉంటుంది పనిభారం చేత అధికంగా సంచారం చేయుట మూలాన చిరాకును ఇబ్బందిని పొందుతారు. కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దలను సంప్రదించుట అదేవిధంగా పెద్దలు నిర్ణయాలు తీసుకంటే వాటికి కట్టుబడి ఉండుట చేయాలి. విలువైన వస్థువులు పోగొట్టుకొనే అవకాశం కలదు కావున జాగ్రత్తగా ఉండటం బంధువులతో ఉన్నప్పుడు నిదానంగా ఉండటం వారితో సరదాగా గడపడం మాత్రమేచేయండి వీరు మంచిఫలితాలు సాదించాలంటే  లక్ష్మీఆరాధనచేయుట, వేంకటేశ్వరదేవాలయం వెళ్ళడం మంచిది

మిథున రాశి
ఈరాశివారికి వృత్తివ్యాపారరంగాలు అనుకూలిస్థాయి చేపట్టిన పనులలో ధనలాభాలను పొందుతారు. కొన్ని పనులను ప్రారంభించినప్పుడు ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో కొనసాగిస్తే రానురాను వాటిని సులభంగా పూర్తిచేయగలుగుతారు. వారంప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత కుటుంభంలో, సమాజంలో గుర్తింపును తెచ్చుకొగలుగుతారు.వ్యాపారస్థులకు అనుకూలంగానే ఉంది ధనలాభంను పొందుతారు. సేవాగుణాన్ని కలిగిఉంటారు మీయొక్క ఆలోచనలు కొంతమందికి ఉపయోగపడుటకు అవకాశం కలదు. ఆరోగ్యంబాగుంటుంది చాలావరకు సరదాగా నచ్చినవారితో గడపడం మూలాన అలాగే అనుకూలమైన ఫలితాలను పొందుట చేత సంతోషాన్ని కలిగిఉంటారు. ప్రారంభించిన పనులలో మొదట కలిగిఉన్న ఉత్సాహాన్ని చివరివరకు చూపడంలో విఫలం అయ్యే అవకాశాలు కలవు. ధార్మికకార్యక్రమాలకోసం అదేవిధంగా ప్రయాణాలకోసం ఖర్చుపెట్టుఅవకాశాలు కలవు. భోజనంవిషయంలో ప్రీతిని కలిగిఉంటారు విందులపట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. బంధువులను కలిసేఅవకాశం కలదు నూతన గృహనిర్మాణసూచనలు ఉన్నవి.మీరు అనుకున్న ఫలితాలను సాదించాలంటే దక్షిణామూర్తిని పూజించుట, విష్ణుసహస్రనామంపారాయణ చేయుట ఉత్తమం.

కర్కాటక రాశి
ఈరాశివారికి ఈవారం కొంతఅనుకూలమైన కాలమనే చెప్పవచ్చును బంధుమిత్రులను కలుస్తారు అధికారులను కలవడం వారియొక్క ఆలోచనలను అమలుచేసే దిశగా ముందుకు వెళ్తారు చాలావరకు మీరు పనులలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీయొక్క వ్యతిరేకవర్గంను ఇబ్బందిపెడుతారు మీయొక్క ఆలోచనల్లో వేగాన్ని కలిగిఉంటారు.అనారోగ్యం మాత్రం ఇబ్బందిపెడుతుంది అందువలన మానసికఆందోళనను పొందుతారు ఒకవార్త వినడంచేత కొద్దిగా భాదను పొందుటకు అవకాశం కలదు.వారం చివార్లో విందులలో పాల్గొనుటకు నచ్చినవారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. కొన్నివిషయాల్లో ఎదురుదెబ్బలు తగలడం చేత నిరుత్సాహంను పొందుతారు అదేవిధంగా కుటుంభంలో సర్దుకుపోవడం మంచిది. స్త్రీలకు సంభందించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి స్త్రీ మూలక సమస్యలను ఎదుర్కోను అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను నియత్రించుట చేత ఇబ్బందులు తొలగుతాయి. మీరు మరిన్ని ఫలితాలను పొందాలంటే దుర్గాదేవినిపూజించుట, లక్ష్మీఅష్టోత్తరశతనామస్తోత్రంపరాయాణం చేయండి.

సింహ రాశి
ఈ రాశివారు ప్రయత్నాలలో అభివృద్దిని కలిగి ఉంటారు.గురువుయొక్క ఆశిస్షుల చేత ముందుకువెళ్ళగలుగుతారు.కుటుంభసభ్యులతో గడుపుతారు కోపాన్ని వదులుకోవడం మంచిది. అకారణంగా కలహములను పొందుటకు అవకాశం ఉంది ఆర్థికనష్టాలను పొందుతారు కావున ధనంకు సంభందించిన విషయాల్లో  తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.వారం ప్రారంభంలో బాగున్న చివర్లో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటారు మానసికఆందోళనను పొందుతారు.అనారోగ్యం మూలాన ఇబ్బందులను ఎదుర్కొంటారు శారీరకంగా బలహీనపడుతారు. మీరు ఆశించిన ఫలితాలను పొందుటలో కొంత ఆటంకాలు కలుగుతాయి. మీ యొక్క ప్రవర్తన మొదట్లో కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నమీ యొక్క ఆలోచనలను చివరకు భయటపెట్టుటమూలాన అపార్థాలు తొలగుతాయి. ఉద్యోగులు తమవృత్తిస్థానంలో శ్రమను పొందుటకు అవకాశాలు కలవు శ్రమకుతగ్గ గుర్తింపును పొందలేరు. అనవసరంగా ప్రయాణాలు చేస్తారు శారీరకశ్రమను పొందుతారు. బంధువులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం కలదు. ఉత్తమఫలితాలకోసం నవగ్రహాఆరాధన,గణపతికి బుధవారంరోజున అభిషేకం చేయడం మంచిది.

కన్యా రాశి
ఈరాశివారు ఇష్టమైన వారిని కలుస్తారు భోజనంపైన ప్రత్యేకశ్రద్ధను కలిగిఉంటారు సరదాగా గడపడానికి ప్రాముఖ్యతను ఇస్తారు. ఈవారం ఫలితాలను పొందుటకు కష్టపడవలసి రావోచ్చును మీయొక్క ఆలోచనల్లో పూర్తిస్థాయిలో అవగాహన లేకపోతే ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. భోజనం పైన చూపే శ్రద్ధను కొంత పనులపైన చూపడం మూలాన పనులు ముందుకు సాగుతాయి. శ్రమను పొందుటకు సముఖతను వ్యక్తపరచరు బద్దకాన్ని విడనాడి శ్రమను చేయుట వలన ఫలితాలు కలుగుతాయి.వాహనములు నడుపునప్పుడు అలాగే ప్రయాణాలు చేయునప్పుడు జాగ్రత్తగా లేకపతే ప్రమాదాలు తప్పకపోవచ్చును. ప్రయాణాలు అధికంగా చేయడం మూలాన అలాగే విందులపట్ల ఆసక్తిని ప్రదర్శించుట మూలాన సమయం వృదాఅవడమేకాకుండా అలసిపోతారు. ఉద్యోగస్థానంలో అధికారులచేత ఇబ్బందులను ఎదుర్కొంటారు అకారణంగా భయంను పొందుటచేట మీయొక్క విధానాలు కొద్దిగా ఇబ్బందిపెట్టేవిగా ఉంటవి. నూతనగృహంనకు సంభందించిన పనులు ముందుకు సాగుతాయి స్థిరాస్థివిషయంలో సరైనఆలోచనలు చేస్తే లాభాన్నిపొందుతారు. వీరు సుబ్రమణ్యఆరాధన చేయడం, శివాభిషేకం చేయడం మంచిఫలితాలను ఇస్తుంది.

తులా రాశి
ఈరాశివారికి  వారం మొదట్లో బాగున్నప్పటికిని మధ్యలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు.వారం చివర్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ఇష్టమైన వారిని కలిసే అవకాశం కలదు నూతన వస్థువులు కొనడానికి ఆసక్తినిప్రదర్శిస్తారు. వీరు తమయొక్క ఆలోచనలు మార్చుకొనుట కోపాన్నితగ్గించుకొనుట చేత కలహములు తగ్గుటకు అవకాశం కలదు.ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. పనులయందు ఆసక్తినిచూపరు.ఒకవార్త మీకు కొంతభాదను కలిగించేదిగా ఉంటుంది కుటుంభంలో వివాదములు పెరుగుటకు అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో అనుకూలతలు ఉండకపోవచ్చును. వారం ఆరంభంలో ఆర్థికంగా బాగానే ఉనప్పటికిని సరైన ప్రణాళికలు అమలుచేయకపోవడం ధనవ్యయాన్ని పొందుతారు. ఉద్యోగంలో నూతన ఆలోచనలు చేయకుండా సంప్రదాయదోరణి అమలుచేయడం మేలుచేస్తుంది. మీయొక్క ప్రత్యర్థుల మూలాన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద అవసరం. మొత్తంమీద ఈవారం నిదానంగా వ్యవహరించుట మేలుచేస్తుంది అదేవిధంగా ఆంజనేయఆరాధన,నవగ్రహలకు పూజచేయడం మేలుచేస్తుంది.

వృశ్చిక రాశి
ఈరాశివారికి ఏలినాటి శనిప్రభావం ఉన్నప్పటికిని ఈవారం అభివృద్దిని కలిగి ఉంటారు. శరీరసౌఖ్యంను పొందుతారు.  ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుతారు. పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. వారం మొత్తం మీద అనుకూలమైన వాతావరణాన్ని కలిగిఉంటారు. వారంమధ్యలో మాత్రం మాటతీరు మూలాన చిన్న చిన్న ఇబ్బందులను పొందుతారు. భోజనం విషయంలో ప్రత్యేకఇస్టంను కలిగిఉంటారు. ధనాదాయం బాగున్న అదేవిధంగా ఖర్చులను కలిగిఉంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొనుటకు అవకాశం కలదు. అందరితోను సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధనుచూపడం మూలాన త్వరగా కోలుకుంటారు. చర్చలలో పాల్గొంటారు గుర్తింపును కోరుకుంటారు. రాజకీయాలలో చురుగ్గా పాల్గొనుటకు అవకాశాలు కలవు. అలాగే అధికారులతో మంచిసంభాదాలను కలిగి ఉంటారు. మీయొక్క వ్యతిరేకులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కలహములకు దూరంగా ఉండటం మూలాన కొంత ప్రశాంతను పొందుతారు. అధికమైన శ్రమతో పనులను పూర్తిచేస్తారు. అలాగే ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ఈరాశి వారు సాయిబాబా దేవాలయం వెళ్ళడం, గురుచరిత్రపారాయణం, హనుమాన్ చాలీసా చదవడం మేలుచేస్తుంది.

ధనస్సు రాశి
ఈవారం వీరు మిశ్రమఫలితాలను పొందుతారు ఉద్యోగంలో అనుకూలతలు కలుగుతాయి ఇతరుల నుంచి సహాయంను పొందుతారు ఆర్థికంగా బాగానేఉంటుంది. వారం మెదట్లో బాగుంటుంది మధ్యలో నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారం చివర్లో ఈ విషయంలో కొంత మెరుగు ఉంటుంది. మాటను అదుపులో ఉంచుకోకపోవడంచేత అధికమైన ధనవ్యయాన్ని పొందుతారు. ఒకమాటపైన ఉండలేకపోతారు. చంచలబుద్దిని కలిగిఉంటారు. సమయానికి భోజనం చేయలేకపోతారు. ఇతరులను మీయొక్క ఆలోచనలచేత ఇబ్బందులకు గురిచేస్తారు. మాతృవర్గంకు సంభందించిన వారిని కలిసే అవకాశం కలదు. అలాగే మాతృసౌఖ్యంను పొందుతారు. అనారోగ్యం మూలాన కొంత మానసికపరమైన భాదలను పొందుటకు అవకాశం కలదు. అకారణంగా సంభవించు కలహములకు దూరంగా ఉండటం కోపాన్ని కలిగిఉండక పోవడం మేలు. ఇష్టమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. దైవసంభంద పనులలో పాల్గొంటారు. వీరు లక్ష్మీగణపతి ఆరాధన, లలితాసహస్రనామం పారాయణ చేయుట మంచిది.

మకర రాశి
ఈవారం నూతన ఆలోచనలు చేస్తారు. వారం ఆరంభంలో దూసుకుపోతారు. లాభాలను పొందుతారు. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. అధికారులచేత గౌరవింపబడుతారు. కాకపోతే ఇదే విధానంను చివరి వరకు కొనసాగించుటలో విఫలం చెందుతారు. పెద్దల ద్వార కొంత ఆలోచనలను పొందుతారు. పనిభారం పెరుగుతుంది. పనులపట్ల పూర్తిస్థాయిలో శ్రద్ధనుచూపలేకపోతారు. కార్యక్రమం మధ్యలో ఆటంకాలు కలుగుతాయి. మీయొక్క ఆలోచనా విధానం మూలాన బంధుమిత్రులతో  మాటపట్టింపులు కలుగుతాయి. నిదానంగా ఉండటం మంచిది. అనారోగ్యంనకు గురయ్యే అవకాశాలు కలవు. సరైన వైద్యం తీసుకోవడం చేయాలి. అందరి సహకారంతో కార్యక్రమజయాన్ని కలిగిఉంటారు. ఉద్యోగంలో మాత్రం తోటివారితో కొంతమేర జాగ్రత్తగా ఉండటం అలాగే కలహములకు దూరంగా ఉండటం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తే మంచే జరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఉండుటవారు మీయొక్క సలహాలను పాటించుట మూలన వారికి మేలుజరుగుట వలన సంతోషాన్ని పొందుతారు. చేయువృత్తిలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. వీరు కనకధారాస్తోత్రం చదవడం, లక్ష్మీనరసింహాస్వామిదేవాలయం వెళ్ళడం మంచిది.

కుంభ రాశి
ఈరాశి వారుకూడా మిశ్రమ ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల యొక్క ఆలోచనలతో ముందుకుసాగుతారు. మీయొక్క పిల్లలు మీకు గౌరవాన్ని సంపాదించిపెడతారు. తద్వార సంతోషాన్ని పొందుతారు. ధనంను పొందుటకు అవకాశాలు కలవు. వారం మొదట్లో అలాగే చివర్లో కలహములు కలుగుట మానసికంగా ఆందోళన చెందుట జరుగుతుంది. ఉద్యోగంలో మాత్రం అధికారుల ఆలోచనలు అమలుచేసి పేరును సంపాదించుకుంటారు. ఇష్టమైన పనులలో బిజీగా ఉంటారు. సుఖంను పొందుతారు. కోరికలను కలిగిఉంటారు. ఆదిశగా అడుగులు ముందుకు వేస్తారు. వ్యాపారస్థులు క్రయవిక్రయముల మూలాన లాభపడుతారు. అలాగే వ్యాపారాభివృద్దిని పొందుతారు. ఆలోచనలు తీసుకొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మీమీద మీకు నమ్మకం అవసరం. చేయుపనులలో వ్యతిరేకతలను పొందుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టె బృందం ఇబ్బందులు పాలవుతారు. కుటుంభంలో అందరి ఆలోచనలను పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం. కోపంను అదుపులో ఉంచుకొనుట సూచన వీరు హనుమపూజ, ఆదిత్యహృదయం చదవడం మేలుచేస్తుంది.

మీన రాశి
ఈ రాశివారు అధికారులకు అనుగుణంగా ఉండటం ఒకటికి రెండుసార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోనుట వలన మేలుజరుగుతుంది. మీయొక్క మాటతీరు మీరు ఆరంభించే పనులను ప్రభావితం చేస్తాయి. వ్యాపారస్థులు నూతన ఆలోచనలు చేయకపోవడం మేలుచేస్తుంది కొంత కాలం వేచిచూసేదోరని ఆవలంభించండి. వారం ఆరంభంలో కలిగిన ఇబ్బందులను శ్రమను పొందుట ద్వార తొలగించుకోగాలుగుతారు. ఉద్యోగస్థానంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు తోటిఉద్యోగులతొ కలిసి పనిచేయండి. అధికారులచేత మాత్రం లాభంను కలిగి ఉంటారు. ప్రయత్నాలు విఫలం అవుటకు అవకాశాలు కలవు తోటివారి నుంచి సహకారములు అందకపోవచ్చును అలాగే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అర్థికపరైమన నిర్ణయాలు తీసుకొనేముందు పెద్దల సూచనలు పాటించుట మేలు. వ్యాపారస్థులు క్రయవిక్రయాలమూలన లబ్దిని పొందుతారు. బంధువులతో మాటపట్టింపులకు పోకపోవడం ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. సంతోషంగా గడుపుతారు ఖర్చులు కూడా అదేవిధంగా ఎక్కువగానే ఉంటాయి. సమాజికంగా మాములుగా ఉంటుంది. వీరులక్ష్మీనరసింహా ఆరాధన, నవగ్రహ పూజలు చేయుట మేలు.

 

మరిన్ని శీర్షికలు
mathruvedana