Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
vishwa song in iddarammayilatho

ఈ సంచికలో >> సినిమా >>

3డి అంటే అంతే మరి

that is 3D

‘దూకుడు’ నిర్మాత అనిల్‌ సుంకర దర్శకుడిగా మారారు. ఫ్యాషన్‌గా కాకుండా, కాసుల కోసం కాకుండా ప్యాషన్‌తో ఆయన సినిమాలు నిర్మిస్తారని తెలుగు సినిమాలో మంచి పేరుందాయనకి. దర్శకుడిగా మారి ఆయనిప్పుడు ‘యాక్షన్‌’ అనే త్రీడీ సినిమా తీస్తున్నారు. ఇండియాలోనే కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి త్రీడీ సినిమా ఇది. త్రీడీ సినిమా అంటే మాటలు కాదు కదా. 15 కోట్ల బడ్జెట్‌తో సినిమా ప్రారంభించినా అది 20 కోట్లు దాటిందని తెలుస్తోంది. ఖర్చు ఎంతైనా అనుకున్నట్టుగా సినిమాని తెరకెక్కించాలన్న కసితో అనిల్‌ సుంకర ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకంజ వేయలేదట. పైగా కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారన్న పాజిటివ్‌ దృక్పథంతో ‘యాక్షన్‌’ సినిమాని అద్భుతంగా ఆయన తెరకెక్కిస్తున్నారట.

మరిన్ని సినిమా కబుర్లు
award for musicolosist Raja