Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
deepaavali time

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Sri Swamy Vivekananda Biography

శ్రద్ధ అనే పదాన్ని వివరిస్తూ వివేకానంద స్వామి ఈ విధముగా ప్రసంగించారు.

"ప్రతి ఒక్కరికి భగవంతుని యందు, మతము నందు, విశ్వాసము  వుండాలి . అది కలిగే వరకు ఎవ్వరు జ్ఞాని అవలేరు . ఈ ప్రపంచము లోని ఇరవై మిలియనుల జనులలో ఒక్కరు కూడా భగవంతుని సంపూర్ణ ముగా నమ్మిన  లేరని ఒక మహ ఋషి నాతొ చెప్పారు . ఎందుకని నేను అడుగగా ఆయన ఈ విధము గ అన్నారు . " ఈ గది లో ఒక దొంగ వున్నాడని , పక్కన గదిలో ఒక బంగారము ముద్దా వున్నదని అతనికి తెలిసిందనుకోండి . ఆ రెండు గదుల మధ్య  పల్చటి గోడ వుంది . ఇంక ఆ దొంగ పరిస్థితి ఎలా వుంటుంది . ?". నేను ఈ విధముగా సమాధానము చెప్పను . "ఆ దొంగ ఇంకా నిద్ర పోనే పోదు . అతని మెదడులో ఆలోచనలన్నీ ఆ బంగారాన్ని ఎలా చేజిక్కున్చుకున్దామా అని వుంటాయి . ఆ ఒక్క దాన్ని గురించి తప్ప ఎ విషయాల గురించి ఆటను అలోచిన్చనే ఆలోచించడు . ".

అప్పుడా ముని ఈ విధముగ అన్నారు. "ఎవరైనా భగవంతుని విశ్వసిస్తూ, ఆయన్ను పొందటానికి పిచ్చివాదవకుండా వునదగాలరన్న విషయము మీరు నమ్ముతార?. అక్కడ అఖండ ఆనందపు గని వుందని, దానిని తప్పకుండ పొందగలమని నిజముగా నమ్మే వాడు, దానిని పొందటానికి జరిపే పోరాటములో పిచ్చివాడు అవటానికి కూడా సిద్దముగా వుండాలి . దైవం యందు ధృడ విశ్వాసము,  చేరటానికి కావలిసిన వ్యాకులత ,ఆడుర్దాయే శ్రద్ధ అనబడుతుంది "

ఒకసారి స్వామిజి బేలూరు ఆశ్రమములో అనారోగ్యముతో వున్నారు . శరత్చంద్ర చక్రవర్తి అనే శిష్యుడు ఆయనను చూడటానికి వచ్చి , ఆయన గదిలో " ఎన్సైక్లోపీడియా బ్రిటానికా " పుస్తకాన్ని చూసారు . ఆ పెద్ద పెద్ద పుస్తకాలు చూసి ఆచర్యముగా ఆయన ఇలా అన్నారు . "ఒక్క జీవితములో ఇన్ని పుస్తకాలు చదవటము నిజముగా చాల కష్టం . ".

స్వామీజీ దీనికంగీకరించక "నేవ్వేమంటున్నావు? నేనిప్పటివరకూ చదవటం పూర్తి చేసిన ఈ పది పుస్తకాలలో ఎక్కడ , నుంచైనా ఎవైన ప్రశ్నలు నువ్వు నన్ను అడుగు . నేను సమాధానము చెప్పగలుగుతాను . అన్నారు . శిష్యుడు , స్వామీజీ ని ఆ పది  పుస్తకాలలో  ప్రతి ఒక్క పుస్తకము నుంచి చాల ప్రశ్నలు అడిగారు . శిష్యుడు పెట్టిన పరీక్షలో స్వామిజి ఉత్తెర్నులయ్యారు . అంతేకాకుండా చాల చోట్ల స్వామీజీ ఆ పుస్తకాలలో వాక్యాలను ఉన్నదున్నట్లు గా చెప్పారు . ఇదంతా జరిగిన తరువాత వివేకానందుడు " బ్రహ్మ చర్య దీక్షను నియమంగా పాతిస్తేవ్ ,నువ్వు కోరుకున్న దేనిలోనైన ప్రావీణ్యం సంపాడించ గలవు . అంతేకాకుండా ఇప్పుడు నువ్వు నాలో గమనిన్చినటువంటి జ్ఞాపక శక్తిని కూడా సులభముగా పొందగలవు .

వివేకానందుడికి సుక్ష్మ సత్యాలను అవగాహన చేసుకునే అద్భుత శక్తి వుండేది . దక్షిణేస్వరము లో ఒక రోజు శ్రీ రామ కృష్ణులు భక్తులకు వైష్ణవ మాట సిద్దాంతాలను వివరిస్తున్నారు . "సర్వ జీవుల యెడల దయ చూపు " అనే పదాలను ఉచరించగానె , ఆయన సమాధి  స్తితిలోకి ప్రవేశించారు . కొద్ది సేపటి తరువాత , ఆయన అర్ధ బాహ్య స్మృతి కి వచ్చి ఈ విధముగా అన్నారు . " జీవుల యెడల దయా  !  జీవుల యెడల దయా  ! మూర్ఖుడా ! భూమి పై ప్రాకే అల్పమైన క్రిమి వంటి నీవు , ఇతరుల యెడల దయ చూపుట యా !. దయ చుపుటకు నువ్వెవరివి ? ఇతరుల యెడల దయ కాదు నువ్వు చూప వలసినది . మానవులను సాక్షత్తు భగవత్స్వరూపులుగా భావించి సేవించటమే నీవు చేయ వలసినది . ఆ మాటలలోని అంతరార్థాన్ని వివేకానందుడు గ్రహించాడు ,ఈ మహత్తర సత్యాన్నే విశ్వం అంతా " అనుస్టాన వేదాంతం పేరిట ప్రకటించి , ఆయన వ్యాప్తి చేసాడు . తన గురువు మాటలలోని నిజమైన భావనను తన సూక్ష్మ బుద్ధి ద్వారానే ఆయన గ్రహించగలిగారు . వేదాంత అధ్యయనం మూఢ నమ్మకాలను దూరం చేయటానికి దోహదం చేస్తుందని వివేకానంద స్వామి అన్నారు.

మరిన్ని శీర్షికలు
weekly horoscope November 01 - November 07