Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

11-01-2019 నుండి 17-01-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఊహించిన దానికన్నా అధికంగా ఖర్చుఅయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం. కొన్ని కొన్ని విషయాల్లో సర్దుబాటు విధానం కలిగి ఉండుట తప్పక మేలుజరుగుతుంది. కుటుంబంలో సాధ్యమైనంత మేర వివాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. విదేశాలలో ఉన్న మిత్రులకు మీ ఆలోచనలను తెలియజేస్తారు. రుణపరమైన విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశ ఉంది.  

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

 ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో బాగాఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. పెద్దలను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారంలో బాగాఉంటుంది , మీ ఆలోచనలకు పెద్దలనుండి గుర్తింపు లభిస్తుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. 

 

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం మొత్తం మీద దైవపరమైన విషయాలకు లేదా చర్చలకు అవకాశం ఇస్తారు. పెద్దలనుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ద చేయకండి. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును, మీ ఆలోచనలను అమలు చేసే ప్రయత్నం చేస్తారు. బంధువుల నుండి సహకారం లభ్సితుంది. అలాగే వారితో కలిసి విందులలో పాల్గొంటారు. నూతన వాహనాలను లేదా విలువైన వస్తువులను కొనుగులు చేయుటకు అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. 

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

 ఈవారం మొత్తం మీద ఆరంభంలో కాస్త ఒత్తిడి లేదా ఇబ్బందులు తప్పక పోవచ్చును . చేపట్టిన పనుల విషయాల్లో స్ఫష్టత అవసరం, అలాగే కార్యరూపంలో వాటిని పూర్తిచేసే విధంగా ప్రణాళిక కలిగి ఉండుట మంచిది. సంతానపరమైన విషయాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీప్రయాణాలు లేదా అంనత విద్య కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మిత్రులనుండి వచ్చిన సూచనల్ను పరిగణలోకి తీసుకోవడం సూచన. ఉద్యోగంలో కాస్త పనిభారం పెరుగుతుంది, నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన వాటిని పూర్తిచేస్తారు. చర్చలు చేయకండి. 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

 ఈవారం మొత్తం మీద మొదట్లో ఉన్న ఉత్సాహాన్ని చివరి వరకు ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొండి. కుటుంబంలో సభ్యుల నుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోండి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. విలువైన వస్తువులను పొందుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వలన సమజాంలో మంచి పేరు లభిస్తుంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలనుండి ఆశీర్వాదం పొందటం మంచిది. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు.  

 

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం మొత్తం మీద మిత్రులను కలుస్తరు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి, కాకపోతే సంతృప్తి ఉండకపోవచ్చును. ఆరోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో మాత్రం కాస్త నిరుత్సాహం పొందుటకు అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి, కొంత నిరాశకు గురయ్యే ఆస్కారం ఉంది, సర్దుబాటు అవసరం. 

 

 

 


తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం మొత్తం మీద సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చర్చాపరమైన విషయాలకు మీరు చేసే ప్రయత్నాలు విఫలం అవుతారు. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోండి. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. వివాదాలు మరింతగా పెరుగుటకు ఆస్కారం ఉంది, వేచిచూసే ధోరణి ఫలితాలు ఇవ్వకపోవచ్చును. 

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన గుర్తిపును పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు విఫలం అయ్యే ఆస్కారం ఉంది. మీ మాటతీరు తోటివారిని ఆకట్టుకుంటుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. విందులల్లో అలాగే వినోదాలలో పాల్ఫ్గొంటారు. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. సంతానం నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. 

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద సోదరుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, వారితో గతంలో ఉన్న విభేదాలు తగ్గుముఖం పడుతాయి. చర్చల్లో కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు పొందుతారు. కుటుంబపరమైన విషయాల్లో మాత్రం ముఖ్యమైన విషయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ వద్దు. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన సూచనలు తెలుస్కుంటారు. వాహనాలను కొనుగులు చేయుటకు ఆస్కారం కలదు. మాటతీరు విషయంలో జాగ్రత అవసరం. 

 

 


మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం మొత్తం మీద ముఖ్యమైన ఆలోచనలు లేదా నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. ప్రయాణాలు చేయవల్సి వస్తుంది , ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. సోదరుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. బంధువుల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోండి. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లేదా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. రుణపరమైన విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. స్థిరాస్తి ని కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. 

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

 ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు ప్రాధాన్యత ఇస్తారు. వారితో సమయం గడుపుతారు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి వస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే టప్పుడు ఎవరిని ఇబ్బందికి గురిచేయక అందరిని ఆకట్టుకొనేలా చూసుకోండి. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులతో విభేదాలు రాకూండా చూసుకోండి. ఆత్మీయులతో మీ ఆలోచనలు పంచుకోండి. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. తల్లి తరుపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద మొదట్లో కాస్త నిదానంగా ఉండుట సూచన. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పెద్దల నుండి వచ్చిన సూచనలు మీకు ఉపయోగ పడుతాయి. రావాల్సిన ధనం కొంచం కొంచం గా మీ చేతికి అందుతాయి. నూతన ప్రయత్నాలు కల్సి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. సంతానం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు మంచి గుర్తింపు వస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 

 

 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 
మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu