Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

కాత్యాయని

katyayani

గత సంచికలోని కాత్యాయని  సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue300/780/telugu-serials/katyayani/katyayani/

(గత సంచిక తరువాయి)... రెండు రోడ్లవతలకి వెళ్లి ఆటో మాట్లాడుకుని మనోహర్ ఇచ్చిన కార్డ్ లోని హోటల్ కి వెళ్లింది.
ఆటో అతను ‘ఆటోలను ఈ గేటు లోపలికి రానివ్వరమ్మా.. ఒక్క ఖరీదైన కార్లనే పోనిస్తారు’ అన్నాడు హోటల్ గేటుకు కొద్ది దూరంలో ఆటో ఆపి.

కాత్యాయని దిగి అతనికి డబ్బులిచ్చి లోపలికి  వెళ్లి రిసెప్షన్ లో ఉన్న అందమైన అమ్మాయికి తన చేతిలో ఉన్న కార్డ్ ఇచ్చింది.
ఆమె వెంటనే ఇంటర్ కాం లో ఎవరికో ఏదో చెప్పింది.

కొద్ది క్షణాల్లో ఆమె ముందు ప్రత్యక్షమైంది సుమారు పదహారేళ్ల వయసుండే ఓ స్మైలీ గాళ్, చేతిలో ఫ్లవర్ బొకెతో వచ్చి దాన్ని కాత్యాయనికి ఇచ్చి ’హార్ట్లీ.. ప్లెజెంట్ వెల్ కం టూ హెవెన్’అంది.

కాత్యాయని కుంచించుకుపోతూ అది అందుకుంది. అలాంటి పరిస్థితిలో కూడా ఆమెకి ఎక్కడలేని సిగ్గూ ముంచుకొచ్చి బుగ్గల్లోకి ఎరుపు తన్నుకొచ్చి బొకె లోని ఎర్రగులాబీలతో పోటీ పడ్డాయి. కాత్యాయనిని సాదరంగా ఆహ్వానించాక తనను ఫాలో అవమన్నట్టుగా ముందుకు నడిచింది.

కాత్యాయని ఆమె వెనగ్గా బయలుదేరింది.

కొద్ది దూరంలో మూడూ లిఫ్ట్ లున్నాయి. వాటి మీద వివిధ టైం లను డిస్ ప్లే చేసే వాల్ క్లాక్స్ ఉన్నాయి.

ఆ అమ్మాయి తన చూపుడు వేలితో లిఫ్ట్ బటన్ నొక్కింది. కొన్ని క్షణాల్లో లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరూ లోపలికి ఎంటర్ అయ్యాక తలుపులు మూసుకున్నాయి.

తలుపులు తెరుచుకున్నాక ఇద్దరూ బయటకు అడుగుపెట్టారు.

"మేడమ్ ఈ హోటల్ లో ఇప్పుడూ మనమెళ్లబోయే రూం మనోహర్ గారి పర్మనెంట్ సూట్. హోట మేనేజ్ మెంట్ అది ఎవ్వరికీ అలాట్ చేయదు. మనోహర్ సార్, బిజినెస్ డీల్స్ అన్నీ అందులోనే. ఆయనకు లక్కీ రూం ఏమో!" అంది.

కాత్యాయని తప్పనిసరన్నట్టుగా చిన్నగా నవ్వింది.

సెంట్రల్లీ ఏ సీ ఎన్విరాన్ మెంట్ లో అటూ ఇటూ ఉన్న ఖరీదైన రూం ల మధ్య నుంచి ఎర్రటి తివాచీ మీద మెత్తగా నడుస్తున్నారు. దాదాపు ఎండ్ కార్నర్ లో ఉందా గది. అక్కడకి కొద్ది పక్కగా ఉన్న గ్లాసెస్ లోంచి చూస్తే బయట ఉన్న లాన్, అందంగా విరబూసిన విదేశి పూల మొక్కలు, మధ్యలో ఫౌంటెన్ చూడ రెండు కళ్లు చాలవు.

కళ్లు అందాల్ని చూస్తున్నా, శరీరం అందమైన పరిసరాల మధ్యనున్నా మనసు అభావంగా ఉంది కాత్యాయనికి. తలుపును చిన్నగా నాక్ చేసింది తనతో వచ్చిన అమ్మాయి.

అది ఆటోమేటిక్ తలుపు. లోపలున్నవాళ్లు,  రిమొట్ లో వచ్చిన వాళ్లని డిస్ ప్లే లో చూసుకుని కా(రా) వలసిన వాళ్లయితే రిమోట్ తోనే తలుపు ఓపెన్ చేయొచ్చు. అయినా వచ్చింది కాత్యాయని అని తెలుసుకుని అతను స్వయంగా తలుపు తీసి కాత్యాయనితో వచ్చిన అమ్మాయిని ‘ఇహ వెళ్లొచ్చన్నట్టుగా’ కళ్లతో సంజ్ఞ చేసి, ఆమె వెళ్లిపోయాక కాత్యాయనిని సంతోషంగా, చిన్నగా నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు. ఆమె సిగ్గుతో ముడుచుకుపోతూ లోపలికి రాగానే తలుపు ఆటోమేటిక్ గా మూసుకుపోయింది.

ఆమెను మంచం మీద కూర్చోమని చెప్పి, కూర్చున్నాక  ఆమె ముందుకు కుర్చీలాక్కుని కూర్చుని ఆమెని తదేకంగా చూస్తున్నాడు. మంచులో తడవడానికి సిద్ధంగా ఉన్న గులాబీమొగ్గలా గోచరించిందామె అతని కళ్ళకి.

ఆమె మరింత కుంచించుకుపోయింది. ఆమె కళ్లలో సన్నటి నీటిపొర. మనసు కల్లోల సాగరంగా ఉంది. ఈ రోజుతో తన మానం ఎంగిలైపోతోంది. బయటకి ప్రకటితం కాకపోయినా తన మూలంగా తన వంశ ప్రతిష్ట మంటగలిసిపోతోంది. అయ్యవారు ఇంతకుముందు ఎంత చెప్పినా, జరుగబోతున్నది తలుచుకుంటే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతోంది.

అతను ‘కాత్యాయనిగారూ..’ అన్నాడు సౌమ్యంగా.

ఆమె చిన్నగా తలెత్తింది.

ఆమె కళ్లకు అతను మసగ్గా కనిపించాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana