Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katyayani

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue300/779/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి) ఆ ముసలాయన అలా చెయ్యి గిల్లేసరికి సర్రున కోపంతో అరవబోయి ఆయన ఇస్తున్న చీటీకేసి చూసి టక్కున ఆగిపోయింది మనోరమ.

‘‘నేను.... తప్పని పరిస్థితుల్లో ఇలా రావాల్సి వచ్చింది. లోపలకు వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం’’ అని ఉందా చీటీలో. ఆ చీటీ చదివి ఆశ్చర్యంగా ఆ ముసలాయన కేసి తేరిపారా చూసింది మనోరమ.చిలిపిగా నవ్వుతున్న కళ్ళు.... చూస్తూనే గుర్తుపట్టేసింది మనోరమ. ఆ వెంటనే అటూఇటూ చూసి ఎప్పట్నుంచో పరిచయమున్న మనిషిని చూసినట్టు ఆ ముసలాయన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టు నటిస్తూ అంది మనోరమ.

ఆ ముసలాయన్ని అంత జాగ్రత్తగా నడిపించుకు వస్తున్న ‘మనోరమ’ కేసి చూసి ఆశ్చర్యపోయారు చాలామంది.

ముసలివేషంలో ఉన్న ఎస్సై అక్బర్‌ఖాన్‌కూడా నడవలేకపోతున్నట్టు నటిస్తూ మనోరమ నడుం చుట్టూ చెయ్యేసి గట్టిగా దగ్గరకు లాక్కుంటూ నడుస్తున్నాడు.

‘‘సార్‌! మీ వేషాలు చాలిక. చెయ్యి తియ్యండి. కావాలంటే భుజం మీద చెయ్యి వేసుకోండి’’ అంటూ ఎస్సై అక్బర్‌ఖాన్‌ నడుం మీద గట్టిగా గిల్లింది మనోరమ.మనోరమ అలా గట్టిగా గిల్లే సరికి ‘అమ్మా’ అని అరిచాడు ముసలి వేషంలో ఉన్న ఎస్సై అక్బర్‌ఖాన్‌.చుట్టు ప్రక్క వాళ్ళంతా ముసలాయన ఒక్కసారే ‘అమ్మా’ అని అరిచేసరికి ఏమైందోనని తలలు త్రిప్పి చూసారు.

‘‘ఏమైంది మామయ్యా! కాలు నొప్పిగా ఉందా!’’ అంటూ అందరి కేసి చూస్తూ ముసలి వేషంలో ఉన్న ఎస్సై అక్బర్‌ఖాన్‌ మీద శ్రద్ధ చూపిస్తున్నట్టు నటిస్తూ అంది మనోరమ.

‘‘పాపం!  తాతగారు  నడవలేకపోతున్నారు.  జాగ్రత్తగా తీసుకువెళ్ళమ్మ’’ చుట్టు ప్రక్కల ఉన్న ఫేన్సీ దుకాణా వాళ్ళు అంటున్నారు.   వాళ్ళ మాటలు వింటూ ఇద్దరూ మనసు లోనే ముసిముసిగా నవ్వుకుంటూ గాలి గోపురంలో నుండి ఆలయం ఆవరణ లోకి అడుగుపెట్టారు ఎవరూ లేని ఓ మూలకి వెళ్ళి కూర్చున్నారు.

‘‘చెప్పండి! ఏమిటీ ఈ వేషాలు! ఈ పరాచికాలు’’ చిన్నగా నవ్వుతూ అడిగింది మనోరమ.

ఉదయం శోభాదేవి గారిని కలిసిన తర్వాత అక్కడ నుండి బయలుదేరిన దగ్గర నుండి మధ్యాహ్నం వరకూ జరిగిందంతా చెప్పాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘అమ్మో! అలా వార్నింగ్‌ ఇచ్చాడా ఆ బౌన్సర్‌’’ ఆశ్చర్యంగా అడిగింది మనోరమ.

‘‘అందుకే వాడు వెళ్ళిన వెంటనే రామ్‌ని పిలిచి జరిగిందంతా చెప్పాను. లాడ్జీలో రిసెప్షనిష్ట్ కి చెప్పి హైదారాబాద్‌కి టిక్కెట్టు తీసుకున్నాను. సాయంత్రం అయిదు గంటలకే రూమ్‌ ఖాళీ చేసి తాళాలు అప్పగించేసి రోడ్డు మీద పడ్డాను. బట్టల షాపులో ఈ షరాయి, కమీజు కొన్నాను. దారిలో ‘మెన్స్‌ బ్యూటీషియన్‌’ లో దూరి ఇదిగో ఇలా తయారయి వచ్చాను. బావున్నానా?’’ నవ్వుతూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘నా మొహంలా ఉన్నారు’’ అంది మనోరమ.

‘‘అయితే ముసలి గెటప్‌ కూడా బావుందన్నమాట’’ నవ్వుతూ అన్నాడు ఎస్సై.

‘టిక్కెట్టు ఎందుకు దండగ. కేన్సిల్‌ చేయించలేకపోయారా. చెన్నై నుండి విశాఖపట్నానికి ఏ.సి.స్లీపర్‌ రెండువేల రూపాయలు తీసుకుని
ఉంటాడు. అవునా!’’ అంది మనోరమ.

‘‘రెండువేల అయిదొందలు. తప్పదు కదా! వాడు రిసెప్షన్‌లో తప్పకుండా ఎంక్వయిరీ చేస్తాడు. ఇంకా నమ్మకం కుదరకపోతే ట్రావెల్స్‌ పేరు కనుక్కుని, ట్రావెల్స్‌లో కూడా కనుక్కుంటాడు. చెన్నై నుండి వివాఖపట్నానికి వెళ్ళే బస్సులో నేను ఎక్కానా? లేదా?! అని’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘అమ్మో! అయితే మరి ఎలా? మేడమ్‌ గారిని కలవకుండానే వెళ్ళిపోతారా?’’ ఆశ్చర్యంగా అడిగింది మనోరమ.

‘‘ఎందుకు కలవను. తప్పని సరిగా కలుస్తాను!’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘మరి? ప్రయాణమంటున్నారు?’’ ఆశ్చర్యంగా అడిగింది మనోరమ.

‘‘నా బదులు లోకల్‌ పోలీసులు ఉన్నాడు కదా! ఆయన ఇక్కడ బస్సు ఎక్కుతాడు.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘పాపం! దేవుడామని అతను విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలా?’’ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి అంది మనోరమ.
‘‘పిచ్చిమొద్దు. దారిలో ఎక్కడన్నా టిఫిన్‌కి బస్సు ఆపుతాడు కదా! అక్కడ దిగి వెనక్కి వచ్చేస్తాడు.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
‘‘పోలీసు ఉద్యోగాల్లో ఇన్ని కష్టాలుంటాయా!’’ అంది మనోరమ.

‘‘కష్టమెందుకనుకోవాలి. ఛాలెంజ్‌ అనుకోవాలి. పోలీస్‌ కన్నా నేరం చేసే వాడే తెలివిగా ఆలోచిస్తాడు. పోలీస్‌ కూడా నేరస్థుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తేనే విజయం సాధిస్తాడు’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘సరే! ఈ రాత్రి ఎలా? ఎక్కడ పడుకుంటారు?’’ దిగాలుగా అడిగింది మనోరమ.

‘నాకేం... బికారి బాటసారిని. ఏ రైల్వే స్టేషన్లో నో... బస్సుస్టాండ్‌ లోనో... కూర్చొని కన్ను మూస్తే తెల్లారిపోతుంది. అక్కడే వెయిటింగ్‌ రూమ్‌లో కాలకృత్యాలు తీర్చుకుని తయారయి వచ్చేస్తాను. ఇంతకీ రేపు మీ మేడమ్‌ గారు ఎక్కడ కలుస్తామన్నారు’’ మాట మారుస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘రేపు ఎలా కలవాలన్న విషయం మాట్లాడాదామనే ఇప్పుడు వచ్చాను’’ అంది మనోరమ ఎస్సై అక్బర్‌ఖాన్‌ కళ్ళ ల్లోకి చూస్తూ.
‘‘అవునా!... నమ్మమంటావు!’’ చిలిపిగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘ఎందుకో... కలవాలనిపించింది. కలుద్దామన్నాను. తప్పా!’’ చిన్నగా బుంగ మూతి పెడుతూ అంది మనోరమ.

‘‘తప్పని అన్నానా?! నాక్కూడా నిన్ను చూడాలని అనిపించింది.... నిజం! ఎందుకో అర్ధం కావటం లేదు.’’ కొంటెగా మనోరమ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘సరిసరి! మా మేడమ్‌ గురించి ఆలోచించండి. ఆవిడ ఎందుకో ఆందోళనగా ఉన్నారు. ఈ రోజు మీరు ఏం మాట్లాడారో... నాకర్ధం కాదు. మీతో సరిగ్గా మాట్లాడలేదని... ఎలాగైనా మిమ్మల్ని కలవాని ఆందోళనగా అన్నారు’’ అంది మనోరమ.

‘‘ఉదయమే మాట్లాడొచ్చు కదా! కానీ ఎందుకో నాతో మాట్లాడ్డానికి ఇష్టం లేనట్టే మాట్లాడారు. ఇప్పుడు... రహస్యంగా కలుద్దామని కబురు చేస్తున్నారు’’ అయోమయంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘మీకు తెలుసా?! మిమ్మల్ని కలవాలని... మాట్లాడాలన్న విషయం నోటితో చెప్పలేదు. ఆఫీస్‌ నోట్‌లా కాగితం మీద  మీ ఫోన్‌ నెంబర్‌ రాసి ఎవరూ చూడకుండా నాకు ఇచ్చారు. ఫోన్‌ చేసి మీకు చెప్పమని రాసారు. అంత పెద్దావిడ ఎందుకలా భయపడుతున్నారో నాక్కూడా అర్ధం కావటం లేదు సార్‌’’ అంది మనోరమ.

‘‘నువ్వు అక్కడ జాబ్‌లో జాయిన్‌ అయి ఎన్నేళ్ళయింది?’’ ఉన్నట్టుండి అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘రెండేళ్ళవుతోంది.’’ ఆలోచిస్తూ చెప్పింది మనోరమ.

‘‘నీకేం తెలుసు?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘మీకేం కావాలి?’’ తిరిగి అడిగింది మనోరమ.

‘‘నిజమే కదా! తనకేం తెలుసని అడుగుతున్నారు?!’’ తనలో తనే అనుకున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘యలమంచిలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వారసులెవరో చెప్పగలవా?!’’ ఉన్నట్టుండి అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘వారసులా?!... ఎవరు?!’’ అని క్షణం ఆగి ‘‘నిజం చెప్పాలంటే మహాశ్వేతాదేవి... ఎస్‌! చైర్‌పర్సెన్‌ మహాశ్వేతాదేవిగారే’’ ఆలోచిస్తూ అంది మనోరమ.

‘‘ఆమె చనిపోయిందని విన్నాను.’’ మనోరమ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘అవును! పాపం! నెల రోజుల క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.’’ విచారంగా అంది మనోరమ.

‘‘మరి చనిపోయిన ఆమె పేరు చెబుతున్నావు?!’’ నవ్వుతూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘నిజమే కదా. ఆమె తర్వాత...ఆమె భర్త... ఎస్‌ ఆమె భర్తే...హరిశ్చంద్ర ప్రసాద్‌గారు... ప్రస్తుతం ఇన్‌చార్జ్‌చైర్మన్‌... ఇమీన్‌ యాక్టింగ్‌ చైర్మన్‌’’ ఆలోచిస్తూ అంది మనోరమ.

‘‘ఏం?! మహాశ్వేతాదేవి గారికి పిల్లలు  లేరా?!’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘లేరు...!’’ టక్కున సమాధానం చెప్పింది మనోరమ.

‘‘వాళ్ళ పెళ్ళయి ఎన్నాళ్ళయి ఉంటుంది?’’ అడిగాడు ఎస్సై.

‘‘పదేళ్ళంటారు. ప్రతి ఏడాది గ్రాండ్‌గా మేరేజ్‌డే సెబ్రేషన్స్‌ జరిపిస్తూ ఉంటాంగా!’’ ఆలోచిస్తూ అంది మనోరమ.

‘‘మేడమ్‌ శోభాదేవికి యలమంచిలి గ్రూప్‌ కంపెనీకి ఏమిటి సంబంధం?!’’ చూచాయగా తెలుసున్నా కావాలనే అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘వ్వాట్‌! అదేంటి సార్‌ అలా అడిగారు... మేడమ్‌ ఎవరో కాదు. చనిపోయిన చైర్మన్‌ గారి ఒక్కగానొక్క అక్క. మేడమ్‌ మహాశ్వేతాదేవి గారి మేనత్త సార్‌. శోభాదేవి మేడమ్‌ గారికి యలమంచిలి గ్రూప్‌ కంపెనీలో పాతిక శాతం షేర్లున్నాయి. మేడమ్‌ కూడా బోర్డులో యాక్టింగ్‌డైరెక్టర్‌ తెలుసా’’ గొప్పగా చెప్తూ అంది మనోరమ.

‘‘శోభాదేవి గారి పిల్లలు...?’’ ప్రశ్నార్ధంగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘ఇద్దరూ అబ్బాయిలే! సార్‌ కూడా కంపెనీలోనే యాక్టివ్‌గా పని చేస్తున్నారు. అబ్బాయిలు ఇద్దరూ వైజాగ్‌ హాస్పటల్‌ ఎం.డి. ఒకరు, విజయవాడ హాస్పటల్‌ ఎం.డి. ఒకరు. శోభాదేవిగారి భర్త చెన్నైలోనే కంపెనీ ఆడిట్‌ అకౌంట్స్‌ వగైరా అన్నీ ఆయనే చూస్తారు.’’ చెప్పింది మనోరమ.

‘‘మీ చైర్మన్‌ గారు పోయి ఎన్నాళ్ళయింది?’’ ఆలోచిస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘ఆర్నెలలు అవుతోంది’’  చెప్పింది మనోరమ.

‘‘ఆరు నెలలా? ఆరు ఏళ్ళా’’ అర్ధం కాక అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘ఆరు నెలలు సార్‌! ఇంకా ఏడాది కాలేదు.’’ వింతగా ఎస్సై అక్బర్‌ఖాన్‌ కేసి చూస్తూ అంది మనోరమ.

‘‘వ్వాట్‌? ఆరు నెలలా!’’ ఒక్కసారే ఉలిక్కిపడి అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.   ఆ ముసలాయన అలా చెయ్యి గిల్లేసరికి సర్రున కోపంతో అరవబోయి ఆయన ఇస్తున్న చీటీకేసి చూసి టక్కున ఆగిపోయింది మనోరమ.

‘‘నేను.... తప్పని పరిస్థితుల్లో ఇలా రావాల్సి వచ్చింది. లోపలకు వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం’’ అని ఉందా చీటీలో. ఆ చీటీ చదివి ఆశ్చర్యంగా ఆ ముసలాయన కేసి తేరిపారా చూసింది మనోరమ.

చిలిపిగా నవ్వుతున్న కళ్ళు.... చూస్తూనే గుర్తుపట్టేసింది మనోరమ. ఆ వెంటనే అటూఇటూ చూసి ఎప్పట్నుంచో పరిచయమున్న మనిషిని చూసినట్టు ఆ ముసలాయన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టు నటిస్తూ అంది మనోరమ.

ఆ ముసలాయన్ని అంత జాగ్రత్తగా నడిపించుకు వస్తున్న ‘మనోరమ’ కేసి చూసి ఆశ్చర్యపోయారు చాలామంది.

ముసలివేషంలో ఉన్న ఎస్సై అక్బర్‌ఖాన్‌కూడా నడవలేకపోతున్నట్టు నటిస్తూ మనోరమ నడుం చుట్టూ చెయ్యేసి గట్టిగా దగ్గరకు లాక్కుంటూ నడుస్తున్నాడు.

‘‘సార్‌! మీ వేషాలు చాలిక. చెయ్యి తియ్యండి. కావాలంటే భుజం మీద చెయ్యి వేసుకోండి’’ అంటూ ఎస్సై అక్బర్‌ఖాన్‌ నడుం మీద గట్టిగా గిల్లింది మనోరమ.

మనోరమ అలా గట్టిగా గిల్లే సరికి ‘అమ్మా’ అని అరిచాడు ముసలి వేషంలో ఉన్న ఎస్సై అక్బర్‌ఖాన్‌.

చుట్టు ప్రక్క వాళ్ళంతా ముసలాయన ఒక్కసారే ‘అమ్మా’ అని అరిచేసరికి ఏమైందోనని తలలు త్రిప్పి చూసారు.

‘‘ఏమైంది మామయ్యా! కాలు నొప్పిగా ఉందా!’’ అంటూ అందరి కేసి చూస్తూ ముసలి వేషంలో ఉన్న ఎస్సై అక్బర్‌ఖాన్‌ మీద శ్రద్ధ చూపిస్తున్నట్టు నటిస్తూ అంది మనోరమ.

‘‘పాపం!  తాతగారు  నడవలేకపోతున్నారు.  జాగ్రత్తగా తీసుకువెళ్ళమ్మ’’ చుట్టు ప్రక్కల ఉన్న ఫేన్సీ దుకాణా వాళ్ళు అంటున్నారు.
వాళ్ళ మాటలు వింటూ ఇద్దరూ మనసు లోనే ముసిముసిగా నవ్వుకుంటూ గాలి గోపురంలో నుండి ఆలయం ఆవరణ లోకి అడుగుపెట్టారు ఎవరూ లేని ఓ మూలకి వెళ్ళి కూర్చున్నారు.

‘‘చెప్పండి! ఏమిటీ ఈ వేషాలు! ఈ పరాచికాలు’’ చిన్నగా నవ్వుతూ అడిగింది మనోరమ.

ఉదయం శోభాదేవి గారిని కలిసిన తర్వాత అక్కడ నుండి బయలుదేరిన దగ్గర నుండి మధ్యాహ్నం వరకూ జరిగిందంతా చెప్పాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘అమ్మో! అలా వార్నింగ్‌ ఇచ్చాడా ఆ బౌన్సర్‌’’ ఆశ్చర్యంగా అడిగింది మనోరమ.

‘‘అందుకే వాడు వెళ్ళిన వెంటనే రామ్‌ని పిలిచి జరిగిందంతా చెప్పాను. లాడ్జీలో రిసెప్షనిష్ట్ కి చెప్పి హైదారాబాద్‌కి టిక్కెట్టు తీసుకున్నాను. సాయంత్రం అయిదు గంటలకే రూమ్‌ ఖాళీ చేసి తాళాలు అప్పగించేసి రోడ్డు మీద పడ్డాను. బట్టల షాపులో ఈ షరాయి, కమీజు కొన్నాను. దారిలో ‘మెన్స్‌ బ్యూటీషియన్‌’ లో దూరి ఇదిగో ఇలా తయారయి వచ్చాను. బావున్నానా?’’ నవ్వుతూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘నా మొహంలా ఉన్నారు’’ అంది మనోరమ.

‘‘అయితే ముసలి గెటప్‌ కూడా బావుందన్నమాట’’ నవ్వుతూ అన్నాడు ఎస్సై.

‘టిక్కెట్టు ఎందుకు దండగ. కేన్సిల్‌ చేయించలేకపోయారా. చెన్నై నుండి విశాఖపట్నానికి ఏ.సి.స్లీపర్‌ రెండువేల రూపాయలు తీసుకుని ఉంటాడు. అవునా!’’ అంది మనోరమ.

‘‘రెండువేల అయిదొందలు. తప్పదు కదా! వాడు రిసెప్షన్‌లో తప్పకుండా ఎంక్వయిరీ చేస్తాడు. ఇంకా నమ్మకం కుదరకపోతే ట్రావెల్స్‌ పేరు కనుక్కుని, ట్రావెల్స్‌లో కూడా కనుక్కుంటాడు. చెన్నై నుండి వివాఖపట్నానికి వెళ్ళే బస్సులో నేను ఎక్కానా? లేదా?! అని’’ చిన్నగా నవ్వుతూ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘అమ్మో! అయితే మరి ఎలా? మేడమ్‌ గారిని కలవకుండానే వెళ్ళిపోతారా?’’ ఆశ్చర్యంగా అడిగింది మనోరమ.

‘‘ఎందుకు కలవను. తప్పని సరిగా కలుస్తాను!’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘మరి? ప్రయాణమంటున్నారు?’’ ఆశ్చర్యంగా అడిగింది మనోరమ.

‘‘నా బదులు లోకల్‌ పోలీసులు ఉన్నాడు కదా! ఆయన ఇక్కడ బస్సు ఎక్కుతాడు.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

‘‘పాపం! దేవుడామని అతను విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలా?’’ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి అంది మనోరమ.

‘‘పిచ్చిమొద్దు. దారిలో ఎక్కడన్నా టిఫిన్‌కి బస్సు ఆపుతాడు కదా! అక్కడ దిగి వెనక్కి వచ్చేస్తాడు.’’ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘పోలీసు ఉద్యోగాల్లో ఇన్ని కష్టాలుంటాయా!’’ అంది మనోరమ.
    ‘‘కష్టమెందుకనుకోవాలి. ఛాలెంజ్‌ అనుకోవాలి. పోలీస్‌ కన్నా నేరం చేసే వాడే తెలివిగా ఆలోచిస్తాడు. పోలీస్‌ కూడా నేరస్థుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తేనే విజయం సాధిస్తాడు’’ చెప్పాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘సరే! ఈ రాత్రి ఎలా? ఎక్కడ పడుకుంటారు?’’ దిగాలుగా అడిగింది మనోరమ.
    ‘నాకేం... బికారి బాటసారిని. ఏ రైల్వే స్టేషన్లో నో... బస్సుస్టాండ్‌ లోనో... కూర్చొని కన్ను మూస్తే తెల్లారిపోతుంది. అక్కడే వెయిటింగ్‌ రూమ్‌లో కాలకృత్యాలు తీర్చుకుని తయారయి వచ్చేస్తాను. ఇంతకీ రేపు మీ మేడమ్‌ గారు ఎక్కడ కలుస్తామన్నారు’’ మాట మారుస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘రేపు ఎలా కలవాలన్న విషయం మాట్లాడాదామనే ఇప్పుడు వచ్చాను’’ అంది మనోరమ ఎస్సై అక్బర్‌ఖాన్‌ కళ్ళ ల్లోకి చూస్తూ.
    ‘‘అవునా!... నమ్మమంటావు!’’ చిలిపిగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘ఎందుకో... కలవాలనిపించింది. కలుద్దామన్నాను. తప్పా!’’ చిన్నగా బుంగ మూతి పెడుతూ అంది మనోరమ.
    ‘‘తప్పని అన్నానా?! నాక్కూడా నిన్ను చూడాలని అనిపించింది.... నిజం! ఎందుకో అర్ధం కావటం లేదు.’’ కొంటెగా మనోరమ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘సరిసరి! మా మేడమ్‌ గురించి ఆలోచించండి. ఆవిడ ఎందుకో ఆందోళనగా ఉన్నారు. ఈ రోజు మీరు ఏం మాట్లాడారో... నాకర్ధం కాదు. మీతో సరిగ్గా మాట్లాడలేదని... ఎలాగైనా మిమ్మల్ని కలవాని ఆందోళనగా అన్నారు’’ అంది మనోరమ.
    ‘‘ఉదయమే మాట్లాడొచ్చు కదా! కానీ ఎందుకో నాతో మాట్లాడ్డానికి ఇష్టం లేనట్టే మాట్లాడారు. ఇప్పుడు... రహస్యంగా కలుద్దామని కబురు చేస్తున్నారు’’ అయోమయంగా అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘మీకు తెలుసా?! మిమ్మల్ని కలవాలని... మాట్లాడాలన్న విషయం నోటితో చెప్పలేదు. ఆఫీస్‌ నోట్‌లా కాగితం మీద  మీ ఫోన్‌ నెంబర్‌ రాసి ఎవరూ చూడకుండా నాకు ఇచ్చారు. ఫోన్‌ చేసి మీకు చెప్పమని రాసారు. అంత పెద్దావిడ ఎందుకలా భయపడుతున్నారో నాక్కూడా అర్ధం కావటం లేదు సార్‌’’ అంది మనోరమ.
    ‘‘నువ్వు అక్కడ జాబ్‌లో జాయిన్‌ అయి ఎన్నేళ్ళయింది?’’ ఉన్నట్టుండి అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘రెండేళ్ళవుతోంది.’’ ఆలోచిస్తూ చెప్పింది మనోరమ.
    ‘‘నీకేం తెలుసు?’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘మీకేం కావాలి?’’ తిరిగి అడిగింది మనోరమ.
    ‘‘నిజమే కదా! తనకేం తెలుసని అడుగుతున్నారు?!’’ తనలో తనే అనుకున్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘యలమంచిలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వారసులెవరో చెప్పగలవా?!’’ ఉన్నట్టుండి అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘వారసులా?!... ఎవరు?!’’ అని క్షణం ఆగి ‘‘నిజం చెప్పాలంటే మహాశ్వేతాదేవి... ఎస్‌! చైర్‌పర్సెన్‌ మహాశ్వేతాదేవిగారే’’ ఆలోచిస్తూ అంది మనోరమ.
    ‘‘ఆమె చనిపోయిందని విన్నాను.’’ మనోరమ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘అవును! పాపం! నెల రోజుల క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.’’ విచారంగా అంది మనోరమ.
    ‘‘మరి చనిపోయిన ఆమె పేరు చెబుతున్నావు?!’’ నవ్వుతూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘నిజమే కదా. ఆమె తర్వాత...ఆమె భర్త... ఎస్‌ ఆమె భర్తే...హరిశ్చంద్ర ప్రసాద్‌గారు... ప్రస్తుతం ఇన్‌చార్జ్‌చైర్మన్‌... ఇమీన్‌ యాక్టింగ్‌ చైర్మన్‌’’ ఆలోచిస్తూ అంది మనోరమ.
    ‘‘ఏం?! మహాశ్వేతాదేవి గారికి పిల్లలు  లేరా?!’’ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘లేరు...!’’ టక్కున సమాధానం చెప్పింది మనోరమ.
    ‘‘వాళ్ళ పెళ్ళయి ఎన్నాళ్ళయి ఉంటుంది?’’ అడిగాడు ఎస్సై.
    ‘‘పదేళ్ళంటారు. ప్రతి ఏడాది గ్రాండ్‌గా మేరేజ్‌డే సెబ్రేషన్స్‌ జరిపిస్తూ ఉంటాంగా!’’ ఆలోచిస్తూ అంది మనోరమ.
    ‘‘మేడమ్‌ శోభాదేవికి యలమంచిలి గ్రూప్‌ కంపెనీకి ఏమిటి సంబంధం?!’’ చూచాయగా తెలుసున్నా కావాలనే అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘వ్వాట్‌! అదేంటి సార్‌ అలా అడిగారు... మేడమ్‌ ఎవరో కాదు. చనిపోయిన చైర్మన్‌ గారి ఒక్కగానొక్క అక్క. మేడమ్‌ మహాశ్వేతాదేవి గారి మేనత్త సార్‌. శోభాదేవి మేడమ్‌ గారికి యలమంచిలి గ్రూప్‌ కంపెనీలో పాతిక శాతం షేర్లున్నాయి. మేడమ్‌ కూడా బోర్డులో యాక్టింగ్‌డైరెక్టర్‌ తెలుసా’’ గొప్పగా చెప్తూ అంది మనోరమ.
    ‘‘శోభాదేవి గారి పిల్లలు...?’’ ప్రశ్నార్ధంగా చూస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘ఇద్దరూ అబ్బాయిలే! సార్‌ కూడా కంపెనీలోనే యాక్టివ్‌గా పని చేస్తున్నారు. అబ్బాయిలు ఇద్దరూ వైజాగ్‌ హాస్పటల్‌ ఎం.డి. ఒకరు, విజయవాడ హాస్పటల్‌ ఎం.డి. ఒకరు. శోభాదేవిగారి భర్త చెన్నైలోనే కంపెనీ ఆడిట్‌ అకౌంట్స్‌ వగైరా అన్నీ ఆయనే చూస్తారు.’’ చెప్పింది మనోరమ.
    ‘‘మీ చైర్మన్‌ గారు పోయి ఎన్నాళ్ళయింది?’’ ఆలోచిస్తూ అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
‘‘ఆర్నెలలు అవుతోంది’’  చెప్పింది మనోరమ.
    ‘‘ఆరు నెలలా? ఆరు ఏళ్ళా’’ అర్ధం కాక అడిగాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.
    ‘‘ఆరు నెలలు సార్‌! ఇంకా ఏడాది కాలేదు.’’ వింతగా ఎస్సై అక్బర్‌ఖాన్‌ కేసి చూస్తూ అంది మనోరమ.
    ‘‘వ్వాట్‌? ఆరు నెలలా!’’ ఒక్కసారే ఉలిక్కిపడి అన్నాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.  

(ఇంకా వుంది)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్