Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
library cartoons

ఈ సంచికలో >> శీర్షికలు >>

18-01-2019 నుండి 24-01-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం ముఖ్యమైన నిర్ణయాల్లో కాస్త తడబాటు కలిగి ఉంటారు, అనుభవజ్ఞుల సూచనల మేర  ముందుకు వెళ్ళండి. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన మరింతగా లబ్దిని పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

  ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను కాస్త శ్రమతో పూర్తిచేసే ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దల అభిప్రాయాలను గౌరవించుట సూచన. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం తప్పక జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీ పరమైన విషయాల్లో మీకంటూ ఉన్న ఆలోచనలతో ముందుకు వెళ్తారు.

 

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్న రాను రాను మీకు సానుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుట విషయంలో ఆసక్తిని కలిగిం ఉంటారు. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. గతంలో మీనుండి సహకారం తీసుకున్న వారి నూతన సహాయ సహకారాలు లభిస్తాయి, ఇవి మీకు ఉపయోగపడుతాయి. సంతానం విషయంలో కాస్త కఠినంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. నూతన ఉద్యోగాలు కలిసి వస్తాయి. సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

 ఈవారం బంధువులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు. రుణపరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో పెద్దలనుండి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సహకారం లభిస్తుంది, ప్రయాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం విషయంలో గతంలో ఉన్న ఆందోళన చాలామేర తగ్గుతుంది. అనుకోని ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఆదాయం కూడా బాగానే ఉంటుంది.

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

 ఈవారం ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు, తోటీసభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొనే ఆస్కారం కలదు. బంధువులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారంలో నూతన భాగస్వామ్య ఒప్పందాలకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర స్పష్టమైన ఆలోచలతో ముందుకు వెళ్ళండి, అలాగే ఎవరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్త. రుణపరమైన ఇబ్బందులు తప్పక పోవచ్చును , జాగ్రత్త అవసరం.

 

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం సోదరులను కలుస్తారు, వారినుండి  పరిగణలోకి తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి. ప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడుతాయి. సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఉద్యోగంలో కాస్త పనిభారం పెరుగుతుంది, నలుగురిని కలుపుకొని వెళ్ళండి. సమయానికి భోజనం చేయుట అలాగే విశ్రాంతి తీసుకోవడం మంచిది. మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి

 

 

 


తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

 ఈవారం మిశ్రమ ఫలితాలు సూచితం. కాస్త సర్దుబాటు విధానం మంచిది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. అధికారుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి , బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ముఖ్యమైం విషయాల్లో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. బంధువులను కలుస్తారు, వారితో సమయం గడుపుతారు.

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం పెద్దలను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో కొన్నిటిని పూర్తిచేసే ఆస్కారం ఉంది, ఓపికసహనం అవసరం. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సమయాన్ని చర్చాపరమైన విషయాలకు కేటయిస్తారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. సోదరుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయివారికి అనుకూలమైన సమయం.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం మిత్రులతో సమాయన్ని సరదాగా గడుపుతారు. మిత్రులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. అధికారిక ఒప్పందాల్లో మీదైనా ఆలోచన ధొరణి కలిగి ఉంటారు. కాస్త మానసికంగా ఇబ్బంది తప్పకపోవచ్చును. చేపట్టు పనుల్లో ఒత్తిడి లేక పనిభారం ఉంటుంది. కుటుంబసభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చర్చల్లో లబ్దిని పొందుతారు. విదేశీ ప్రయాణాలు లేదా దూరప్రదేశ ప్రయాణాలు చేయవల్సి వస్తుంది.

 

 

 


మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం పెద్దలతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సరదాగా మొదలు పెట్టిన పనులు లక్ష్యంగా మారే ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాల కన్నా గతంలో తీసుకున్న వాటికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో స్వల్ప సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. సోదరుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

 ఈవారం ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ పొందుతారు. అధికారుల నుండి సహకారం లభిస్తుంది. గతంలో మొదలు పెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. నూతన ఆర్థిక ఆదాయ మార్గాలు లభిస్తాయి. కుటుంబంలో నూతన సమస్యలు వచ్చుటకు అవకాశం ఉంది. అందరిని కలుపుకొని వెళ్ళండి. కొన్ని కొన్ని విషయాల్లో ఒకింత రహస్యం ఉంచుట సూచన. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. స్త్రీ పరమైన విషయాలలో పాల్గొంటారు. వారినుండి ఊహించని విధంగా సహకారం లభిస్తుంది. ఆత్మీయులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. సంతానం విషయంలో సంతృప్తి ఉంటుంది. జీవితభాగస్వామి నుండి పూర్తిసహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి వచ్చే అవకాశం కలదు. ప్రణాళిక ఉండుట వలన లబ్దిని పొందుతారు.

 

 

 

 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 
మరిన్ని శీర్షికలు
mrutyukeli