Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

బహుమతులు బహు విధాలు.!

Gifts are multiple ways.

తెలుగు నాట రాజకీయాల్లో 'రిటర్న్‌ గిఫ్ట్‌' అనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. పుట్టినరోజు పార్టీకో, పెళ్లికో, మరో ఫంక్షన్‌కో వెళితే గిఫ్ట్‌ తీసుకెళ్లడం తప్పనిసరి. తప్పనిసరి అంటే తీసుకురాకపోతే ఫంక్షన్‌ చేస్తున్న వాళ్లు మనల్నేమీ నిలదేసేయరు. కానీ అదొక రెస్పెక్ట్‌ అంతే. ఏ ఫంక్షన్‌కి ఎలాంటి గిఫ్ట్‌ ఇద్దాం అని ఒకటికి వంద రకాలుగా ఆలోచించుకునే అలవాటు మనందరికీ ఉంటుంది. కొత్త ట్రెండ్‌ ఏంటంటే, మనం తీసుకెళ్లే గిఫ్ట్‌ కంటే, అటువైపు నుండి వచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ కోసం ఎక్కువ కసరత్తులు జరుగుతున్నాయిప్పుడు. ఫంక్షన్‌కి వెళ్లే వాళ్లు తమ స్థాయికి తగ్గట్లు ఏదో ఒక బహుమతి తీసుకెళ్లడం మామూలే. కానీ ఫంక్షన్స్‌ ఎవరైతే ఏర్పాటు చేస్తారో, వారికి అదొక మెమరబుల్‌ డే. అందుకే ఆ ఫంక్షన్‌ని తమతో పాటు, ఆ ఫంక్షన్‌కి వచ్చిన వారందరూ గుర్తు పెట్టుకునేలా చేయాలనుకుంటున్నారు. సరిగ్గా ఈ ప్రత్యేక ఆలోచనే చాలామందికి ఉపాధి కల్పిస్తోంది.

ఈ రిటర్న్‌ గిప్ట్స్‌లో పర్మినెంట్‌ గిఫ్ట్‌, టెంపరరీ గిఫ్ట్‌ అని రెండు రకాలున్నాయి. టెంపరరీ అంటే అప్పటికప్పుడు ఆ మెమరబుల్‌ డేని గుర్తు పెట్టుకునేందుకు వీలుగా చేసిన కొన్ని గిప్ట్‌ ఏర్పాట్లుయితే, లైఫ్‌ లాంగ్‌ గుర్తుంచుకునేలా ఇచ్చే మరికొన్ని గిఫ్ట్‌లు. ఉదాహరణకు ఇప్పుడు కొందరు ఫంక్షన్స్‌లో రిటర్న్‌ గిఫ్ట్స్‌గా మొక్కలు ఇస్తున్నారు.

పోషణ ఉంటేనే ఆ మొక్క బతికేది. కొన్నాళ్లకు ఆ మొక్క చనిపోతే ఆ గిఫ్ట్‌కి గుర్తింపు ఉండదు. అలా కాకుండా కొందరు ఎక్కడా దొరకని రేర్‌ ఐటెమ్స్‌ని రిటర్న్‌ గిఫ్ట్స్‌గా ఇస్తున్నారు. ఇలాంటివి చూసి ఫంక్షన్‌కి వచ్చిన వారు పది చోట్ల గొప్పగా చెప్పుకుంటున్నారు. కొన్ని అద్భుత కళాఖండాలు, ఆర్ట్‌ ఐటెమ్స్‌ని కూడా గిప్ట్స్‌గా ఇస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే, కొందరు బంగారు, వజ్రపు ఆభరణాలను కూడా గిప్ట్స్‌ ఇస్తున్నారు. ఇలాంటివి పర్మినెంట్‌ గిఫ్ట్స్‌ కిందికి వస్తాయి.

ఈ ఆలోచనలతోనే పలు రకాల స్టార్టప్‌ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఎక్కడ ఈవెంట్స్‌ జరుగుతున్నాయి అని తెలుసుకునే వాళ్లు కొందరైతే, ఆ ఈవెంట్స్‌ ఎలా నిర్వహించాలి అనేది తెలుసుకునే వారు ఇంకొకరు. ఈ తరహా ఈవెంట్స్‌కి ఏమేం కావాలి అని తెలుసుకుని, వాటిని సమకూర్చేవారు మరికొందరు. ఇప్పుడిదే ట్రెండింగ్‌లో ఉంది. ఇక రిటర్న్‌ గిఫ్టుల కోసం వేల నుండి లక్షల వరకూ ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు కొందరు. తమ స్థాయిని బట్టి వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు పది లక్షల వరకూ ఖర్చు చేసేందుకైనా సిద్దపడుతున్నారు. హై క్లాస్‌ వెడ్డింగ్స్‌లో ముఖ్యంగా లక్ష రూపాయలనుండి 10 లక్షల రూపాయల వరకూ రిటర్న్‌ గిఫ్ట్స్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారు. ఇలా ఈ రిటర్న్‌ గిఫ్ట్‌ అనేది ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశంగా మారింది. అదే వినూత్న ఆలోచనలకు దారి తీస్తోంది.

మరిన్ని యువతరం
The matchstick is a coconut