Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
The superstar is the great mahanati

ఈ సంచికలో >> సినిమా >>

సినీ నటుడు బ్రహ్మానందానికి శస్త్ర చికిత్స

Surgical treatment for film actor Brahmanandam

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అస్వస్థతకు గురి కావడంతో ఆదివారం ఆయన్ని హుటాహుటిన ముంబయ్‌ ఏహెచ్‌ఐ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమాచారమ్‌ అందించారు. ముంబయ్‌ వైద్యులు బ్రహ్మానందానికి పరీక్షలు నిర్వహించి, గుండెకు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు.

సోమవారం ప్రముఖ హార్ట్‌ స్పెషలిస్ట్‌ రమాకాంత్‌ ఆధ్వర్యంలో బ్రహ్మానందానికి హార్ట్‌ సర్జరీ జరిగింది. నెమ్మదిగా కోలుకుంటున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కమెడియన్‌గా బ్రహ్మానందం పలు చిత్రాల్లో నటించారు. అసలు ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ మధ్య బ్రహ్మానందం సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదు. బుల్లితెరపై ఓ రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈలోగా సడెన్‌గా అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఆయన కామెడీతో ఎందరో అనారోగ్యవంతుల్ని ఆరోగ్యంగా చేసిన గొప్ప వ్యక్తి ఆయన. అందుకే ఆయన్ని 'కామెడీ బ్రహ్మ' అని ముద్దుగా పిలుచుకుంటారు. త్వరగా కోలుకొని, బ్రహ్మనందం మునపటిలా మరిన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
This is the look of Vijay Sethupathi in sira