Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Laxmis NTR 'beyond expectations!

ఈ సంచికలో >> సినిమా >>

రూటు మార్చిన రత్తాలు.!

Root changed rattaalu

ముద్దుగుమ్మ రాయ్‌ లక్ష్మీకి బాలీవుడ్‌ సినిమా 'జూలీ 2' దెబ్బ కొట్టింది. దాంతో సౌత్‌ సినిమాలపైనే దృష్టి పెట్టింది. అందునా గ్లామర్‌తో పాటు, హారర్‌ని కూడా ఎక్కువగా టచ్‌ చేస్తోంది. అలాగే పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌ పైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తోంది. ఆ క్రమంలోనే సౌత్‌లో పలు సినిమాలకు రాయ్‌ లక్ష్మీ సైన్‌ చేసింది. వాటిలో 'వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. మొదట్లో ఈ సినిమాని గ్లామర్‌ ప్రధానాంశంగా చూపించారు. కానీ ట్రైలర్‌ వచ్చాక సీన్‌ రివర్స్‌ అయిపోయింది. ఇదో హారర్‌ కామెడీ చిత్రమని తెలిసింది.

రాయ్‌ లక్ష్మి ఎప్పటిలాగే హాట్‌గా కనిపించింది. కానీ అక్కడక్కడా భయపెట్టేసింది. రాయ్‌లక్ష్మితో పాటు ఈ సినిమాలో కమెడియన్స్‌ ప్రవీణ్‌, మధునందన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో యువ జంటతో బీభత్సమైన రొమాన్స్‌ కూడా చేయించారు. బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు మాస్‌ ఆడియన్స్‌ మెచ్చే ఘాటు రొమాంటిక్‌ సీన్స్‌తో 'వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి' ట్రైలర్‌ని కలర్‌ఫుల్‌గా నింపేశారు. అయితే సినిమాలో విషయం ఎలా ఉందనేది విడుదలైతే కానీ తెలీదు. ఇదిలా ఉంటే, 'నాగకన్య' అనే పీరియాడిక్‌ మూవీలో నాగినిగా రాయ్‌ లక్ష్మి కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు 'ఝాన్సీ' అనే మరో చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్ర పోషిస్తోంది హాట్‌ హాట్‌ రాయ్‌ లక్ష్మి. 

మరిన్ని సినిమా కబుర్లు
renu re entry