Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
renu re entry

ఈ సంచికలో >> సినిమా >>

హీరోల రిస్కులు, నిర్మాతల కష్టాలు.!

Heroes Risks, Producers' Difficulties.

ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా హీరో గోపీచంద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో కొంత ఆందోళన కలిగించింది. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే అప్పుడు, ఇప్పుడున్నంత సేఫ్టీ ప్రికాషన్స్‌ ఉండేవి కావు. కాబట్టి రిస్కీ షాట్స్‌లో హీరోలు గాయపడేవారు. అయినా ఎక్కువ శాతం రిస్కీ షాట్స్‌ జోలికి పోయేవారు కాదు, డూప్స్‌నే ఆశ్రయించేవారు. రిస్కీ స్టంట్స్‌ చేయడంలో చిరంజీవి తన ప్రత్యేకతను చాటుకున్నారు అప్పటి హీరోల్లో. సీనియర్‌ నటుడు, నిర్మాత మోహన్‌బాబు ఆయన కుమారుడు విష్ణునుద్దేశించి ఈ విషయమై ఓ సందర్భంలో స్పందించారు. తండ్రిగా విష్ణు రిస్క్‌ని చూసి గర్వపడతాను. కానీ ఓ నిర్మాతగా బాధపడతాను. హీరోల రిస్కులు నిర్మాతలకు తీరని కష్టాల్ని తెచ్చిపెడతాయి.

వారి గాయాల కారణంగా షూటింగ్‌లు వాయిదా పడడం, సినిమాలు అనుకున్న బడ్జెట్‌ని మించిపోవడం ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన ప్రస్థావించారు. నిజమే నేచురాలిటీ కోసం రిస్క్‌ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఆ రిస్క్‌ల కారణంగా కలిగే కష్టం, నష్టం హీరోతో మాత్రమే పోయేది కాదు. ఒక్కోసారి తగిలిన గాయాలు సుదీర్ఘ కాలం పాటు బాధిస్తూనే ఉంటాయి కూడా. కానీ ఈ జనరేషన్‌ హీరోలు దాదాపుగా రిస్క్‌లనే ఇష్టపడుతున్నారు. ప్రబాస్‌ కూడా షూటింగ్‌లో గాయపడ్డారు గతంలో. ఇటీవల ఓ సినిమాకి సంబంధించి యంగ్‌ హీరో నాని కూడా గాయపడడం జరిగింది. అందుకే అనుకోకుండా జరిగే ప్రమాదాల్ని ఏమీ చేయలేం కానీ, రిస్క్‌ చేసే ముందు నటీనటులు, నిర్మాతల శ్రేయస్సును కాస్త దృష్టిలో పెట్టుకుంటే మంచిది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam